Wednesday, 23 February 2011
రొట్టెముక్క చిన్నదయితే
ఒక ఇద్దరు స్నేహితులు కలిసి హాలిడేస్ గడపడంకోసం ఒక టూర్‌కు బయల్దేరారనుకుందాం. వెల్తూ వెల్తూ దారిలో కనిపించిన మంచి రష్టారెంటుకు వెల్లి ఇద్దరూ భోజనం ఆర్డర్ చేశారనుకోండి. ఇద్దరికీ కలిపి రెష్టారెంటువాడు రెట్టెలు ఒక బాస్కెట్లో ఇచ్చారనుకుందాం. అప్పుడు ఇద్దరిలో ఎవ్వరూ నువ్వు నాకంటే ఎక్కువ తింటున్నావ్, నావాటాకూడా కొట్టేస్తున్నావ్ అంటూ గొడవ చెయ్యడు. పైగా నువ్వింకాస్త వేసుకో అంతే నివ్వింకాస్త వేసుకో అని ఒకరినొకరు మొహమాటపెట్టుకుంటారు.
అదే వ్యక్తులు టూర్‌కని వెల్లి ఒక అడవిలో తప్పిపొయి తిండిలేకుండా రెండురోజులు తిరుగుతున్నారనుకుందాం. అప్పుడు వారికి ఒక రొట్టె దొరికిందనుకుందాం. అప్పుడు ఇద్దరిలో బలవంతుడు రొట్టె అంతా కాజేసి రెండోవాడికి కొదిగా విదిలిస్తే రెండోవాడికి ఖచ్చితంగా మండుతుంది. అలాగే ఒక నెలరోజులు వాల్లు అదే అడవిలో ఉండి, రోజూ వారికి ఒకే రొట్టెముక్క రేషన్‌లో దొరికితే ఆరొట్టెను బలవంతుడు పూర్తిగా కాజేస్తూ రెండో వాడిని ఎండబెడితే అప్పుడు రెండోవాడు తిరుగుబాటు చేస్తాడు. నీతో కలిసి ఉండడం నాకు సాధ్యంకాదు, నాదారి నేను చూసుకుంటానంటాడు. అప్పుడు బలవంతుడు, చూడు, నా పరిస్థితికూడా అంతబాగా ఏమీలేదు, నేనుకూడా సన్నబడ్డాను, ఈనెలరోజుల్లో ఐదు కిలోలు తగ్గాను అని కబుర్లు చెప్పితే ఫలితంలేదు, ఉన్నంతలో రొట్టెను ఇద్దరూ సమానంగా వాటాలు వేసుకుని పంచున్నారా లేదా నేదే ఇక్కడ సమస్య.
సమైఖ్య రాష్ట్రంలో నీల్లూ, నిధులూ, నియామకాలు రొట్టెముక్కల్లాంటివి, ఇవి విడిగా ఎవ్వరికీ పూర్తిగా సరిపోవు. అందుకే వీటి వాటాలలో ఎంతవివక్ష జరుగుతున్నా ఇంకా సీమాంధ్రలో పలుచోట్ల పేదరికం అలాగే ఉంది. ఇప్పటికిప్పుడు ఈరొట్టెముక్క పెద్దది చెయ్యడం సాధ్యం కాదు, సహజవనరులు ఉన్నవి పరిమితం. ఇప్పుడు సమస్య ఈ వనరులను న్యాయబద్దంగా పంచుతున్నారా లేదా అని. అంతేకానీ సీమాంధ్రలో కూడా ఫలానాచోట పేదరికం ఉంది కాబట్టి మీరు ప్రత్యేక రాష్ట్రం అడగడానికి వీల్లేదు అనే వాదన సరికాదు.
సమైక్యంగా ఉండడంవల్ల ఒక రొట్టె రేషన్ వస్తే విడిపోవడం వల్ల చెరి సగం రొట్టె వస్తుంది. అంటే బలహీనుడికి న్యాయం జరుగుతుంది. బలవంతుడికి అప్పటిదాకా తేరగా సంపాదిస్తున్న అదనపు భాగం రాదు. అందుకే వాడికి కలిసి ఉండడం కావాలి.
Subscribe to:
Post Comments (Atom)
బాగుంది.
ReplyDeleteమీ అనాలజీని మరింత విస్తరిస్తే ఇంకో విషయం కూడా తెలుస్తుంది. సమైక్యంగా ఉండడంవల్ల ఒక రొట్టె రేషన్ వస్తే విడిపోవడం వల్ల చెరి సగం రొట్టె వస్తుంది. అంటే బలహీనుడికి న్యాయం జరుగుతుంది. బలవంతుడికి అప్పటిదాకా తేరగా సంపాదిస్తున్న అదనపు భాగం రాదు. అందుకే వాడికి కలిసి ఉండడం కావాలి.
మీరు చెప్పినట్లు అప్‌డేట్ చేశాను.
ReplyDeleteGood analysis.
ReplyDeletegoo one.. but మీ విశ్లేషణ బలవంతులకే(ప్రాంతం ఏదైనా) పరిమితం. సామాన్యులకు కలిసున్నా, విడిపోయినా లాభ నష్టాలు ఏమీ వుండవు.
ReplyDeleteedichinatlu undi. you started with an assumption that the other party is strong..
ReplyDelete@Padmarpita
ReplyDeleteThank you.
@a2zdreams
ఇక్కడ రొట్టెముక్క నీల్లు, ప్రభుత్వ నిధులు అనుకుంటే బలవంతులు మొత్తంగా నీటిని, నిధులనూ తినలేరు కనుక బలహీనమైనప్రాంతంలో అందరికీ లాభమే.
@vijay
apparantly assumption is quite valid. The other party is stronger due to majority politics with holding more number of MLAs in the assembly.
super analysis ...thanks
ReplyDelete