Friday 25 March 2011

మేధావి వర్గం వివక్షాధోరణి

"చెడ్డవారి దుర్మార్గం కంటే మంచివారి మౌనం ప్రమాదకరం" ఇది మన మేధావివర్గ రాజకీయనాయకుడు జేపీగారు పదేపదే వినిపించే డైలాగు. జేపీగారూ, వినండి: మంచివారి మౌనం కంటే కూడా మేధావివర్గం వివక్షాధోరణి ప్రమాదకరం. ఈ మేధావి వర్గం వారిమాటలతో ప్రమాదం ఎంతంటే వీరుమాట్లాడే నీతులన్ని వింటుంటే ఎంతో బాగున్నట్టుగా ఉంటాయి, నిజమే సుమీ ఎంత అన్యాయం జరుగుతుందీ అనిపిస్తుంది. కానీ వీరి నీతులు చాలా సెలెక్టివ్‌గా ఉంటాయి. తామకు ఎవరు నచ్చకపోతే వారికి మాత్రమే నీతులు వినిపిస్తారు, తమకు నచ్చిన వాడు లేదా తనకంటే బలంగా ఉండి తను నీతులు చెబితే రెండు తగిలించే వాడికి మాత్రం వీరు నీతులు చెప్పరు. చెడ్డవారి దుర్మార్గం సామాన్యుడి బ్రతుకులను మాత్రమే అణచివేస్తాయి, మేధావుల వివక్ష సామాన్యుడి మనసులనే మానిపులేట్ చేస్తాయి.

మన మేధావినాయకుడు జేపీ విగ్రహాలకూల్చివేత సందర్భంగా అరగంటసేపు అసెంబ్లీలో చానా ఆవేశంతో, మధ్యమధ్యలో జాషువా పద్యాలతో, గురజాడ కవిత్వాన్ని ఉపయోగిస్తూ మాట్లాడాడు. కాస్త న్యూట్రల్‌గా ఉంటూ కాస్త విషయాలను గూర్చి పెద్దగా లోతుకు వెల్లని సామాన్య జనం విని ఆహా ఎంతబాగా మాట్లాడాడు జేపీ, ఇది విని కూడా ఫలానా వారికి బుద్ధిరాదేమో అనుకునేలా మాట్లాడాడు. మరి ఇదే పెద్దమనిషి దేశంలోని అతున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అధ్యక్షతన తెలంగాణా విషయంపై నిజానిజాలు తేల్చమని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఉద్యమాన్ని ఎలా అణచివెయ్యాలి, నాయకులను ఎలా కొనాలి, మీడియాను ఎలా మానిపులేట్ చెయ్యాలి అన్న పాఠాలతో ఒక కుట్రపూరితమైన రిపోర్టును వండితే దానిపై మాత్రం అసలేం స్పందించడు. రాష్ట్ర హైకోర్టు కమిటీ అలాంటి రిపోర్టును ఇచ్చినందుకు నిందిస్తే ఇతనికి మాత్రం పట్టదు.

ఉస్మానియా విద్యార్థులను రాక్షసంగా హాస్టల్లలో బంధించి గంటలతరబడి కొడితే రాష్ట్ర హైకోర్టు ఇది మానవహక్కుల ఉల్లంఘన అని చెప్పినా ఇతను మాత్రం అసలేం స్పందించడు. పైగా ఒక టీవీ షోలో మాట్లాడుతూ తెలంగాణాలో విద్యార్థుల ఆత్మాహుతిని చాలా తక్కువగా చేస్తూ ఈ దేశంలో రోజుకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడంలేదు అని వాఖ్యానిస్తాడు. అప్పులకు తట్టుకోక చేసుకొనే రైతు ఆత్మహత్యలకూ, ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకునే వారికీ ఈయన దృష్టిలో తేడా ఏంలేదు. ఒక తెలంగాణా సగటుపౌరుడు ఈయన నెత్తిపై ఒకటి ఇచ్చినతరువాత కూడా ఈయన తనవివక్షను మానుకోలేదు.

ఇక మన సీపీఎం మేధావులు మరోతీరు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది మరో దారన్నట్లు వీరి మార్క్సిస్టు మేధస్సు ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఆలోచిస్తుంది. వీరిదృష్టిలో హిందువులకు కొమ్ముకాసేవారు మతతత్వ శక్తులు, ముస్లిములకు కొమ్ముకాసేవారు మాత్రం కాదు. రాష్ట్ర హైకోర్టు శ్రీక్రిష్ణ రిపోర్టు ఎనిమిదో అధ్యాయాన్ని కమీషను తమ విధులను విస్మరించి కొందరికి కొమ్ముగాస్తూ రాసిందని చెప్పి రిపోర్టును బహిర్గతం చెయ్యాలని తీర్పిస్తే ఈ సీపీఎం మేధావులు క్రిష్ణకమిటీని తప్పు పట్టరు, తీర్పిచ్చిన న్యాయమూర్తిని తప్పుపడతారు. పైగా మీడియానూ, పార్టీలనూ మేనేజ్ చెయ్యాలనే అనైతికమయిన పనులను చెప్పిన రిపోర్టును సమర్ధిస్తూ ఇవన్ని ఎవరికీ తెలియని విషయాలంటూ విషయాన్ని పలుచన చేస్తారు.

6 comments:

  1. మార్క్సిస్ట్‌లు అందరూ తెలంగాణాకి వ్యతిరేకం కాదు. వరవరరావు గారు తెలంగాణాకే అనుకూలం. సిపిఎం నాయకులు బివి రాఘవులు, సీతారాం ఏచూరి కోస్తా ఆంధ్రవాళ్లు కదా. ప్రాంతం విషయానికి వచ్చేసరికి తమ భావజాలం మరచిపోతారు. మార్క్సిజం అంతర్జాతీయవాద భావజాలం. బివి రాఘవులు వంటివారు ప్రాంతం సంకోచాలలో ఉండడం మార్క్సిస్ట్‌లకి బాధ కలిగించే విషయమే.

    ReplyDelete
  2. Article is really good and balanced .

    ReplyDelete
  3. మావోయిస్టుల నుండి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వరకు అందరూ ప్రత్యేక తెలంగాణా వాదాన్ని బలపరుస్తున్నారు, ఒక్క మార్క్సిస్టు పార్టీ వారు తప్ప. బహుశ మార్క్సిస్టు పార్టీ అని వ్రాయబోయి మార్క్సిస్టులు అని వ్రాసినట్టుంది.

    ReplyDelete
  4. praveen sarma &hari,

    సీపీఎం మేధావులని నా ఉద్దేషం. సరిదిద్దాను, ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మీ పోస్ట్ తో నేను విభేదిస్తున్నాను .జయ ప్రకాష్ ని మేధావి అని ఎవరన్నరు ?కొన్ని కవితలు బట్టి పడితే మేధావి అయ్యి పోతరా?కాన్వెంట్ "పిల్లకాయలు "లెక్క ఇంగ్లీష్ మాట్లాడితే మేధావి అయ్యి పోతరా ?jp మేధావి అని అన్నోడు ఎవడు ?మా నాయిన వీరయ్య అంట లేడు .మా మామ కనకయ్య అంట లేడు.మా మేనత్త పోశమ్మ అంట లేదు.మా ఊర్ల సదువుకొన్న పోరలు పోర్లు అంట లేరు సదువుజేప్పే సార్లు అంట లేరు .మరి ఎవడు అనేటోడు?ఒక కులపోల్లు అంటన్రు అంటరా,ఆ కులపోల్లు ntr అనంగానే "ఒక్క మగాడు "అంటరు.గదే నిజమైతే ntr సచ్చిపాయినంక కూడ మనుషులు ఎట్ల పుడుతండ్రు ?ntr మాత్రమే ఒక్క మగాడు కాదు ఈ బూమ్మీద పుట్టే అందరు బిడ్డలకి మగతనమో ఆడతనమో కచ్చితంగా ఉంటది వాళ్ళ కుండే సామజిక పరిస్టుతుల బట్టి వాళ్ళ ఎదుగుదల ఉంటదని మెడ మీద తలకాయ ఉన్న ప్రతి ఒనికి అర్థం అయ్యినట్లే కాన్వెంట్ పోరగాల్ల లెక్క మాట్లడంగనే మేధావులు కారని సమజ్ అయ్యితది.ఎరకయ్యిందా?
    సిపిఎం అంటే కమ్మ్యునిస్ట్ పార్టీ ఆఫ్ marxist కాదు మోసగిస్ట్ అని మా ఊర్ల పోరలు ఎప్పడి నుండో అంటన్రు .మీకు ఇంకా తెల్వదా ?మీకు ఈ విషయం ఎరికేనా ?1977 ల వీళ్ళు అధికారం లకి రాక మునుపు దండకారణ్యం ల ఉన్న దళిత బెంగాలి రేఫ్యుజి ల కాడికి పోయి మేము అధికారం లకి వస్తే మిమ్మల్నందర్నీ బెంగాలుకి తోలుక పొయ్యి భూములు ,ఇల్లు అన్నిస్తం అని హామిలిచ్చి వచ్చిన్రు .ఈ మోసగిస్ట్ లు అధికారం లకి రాంగనే దళితులు ఉరుక్కొంట బెంగాల్కి వచ్చిన్రు .అప్పుడు ఏమైందో ఎరికేనా ?మన మోసగిస్ట్ లు దళితులని ఒక ద్వీపం ల పెట్టి నాలుగు వేల కుటుంబాలను మట్టు పెట్టిన్రు ఎరికేనా ?అంతేనా నిన్న గాక మొన్న వీళ్ళ జ్యోతిబసు సచ్చి పోయే ముందు బెడ్ పక్కన వెంకటేశ్వర సామి బొమ్మ పెట్టుకోన్నాడని గోపాల కృష్ణ గాంధీ పత్రికల వ్యాసం రాసిండు .ఈ మధ్యలనే సచ్చి పోయిన సుభాస్ చక్రబోర్తి అనే కామ్రేడ్ దాదాపు 20 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ,ఆయన కాలిక దేవి మందిరానికి పోయి దర్శనం జేసుకొని ఏమన్నాడో ఎరికేనా ,"నేను మొదట బ్రాహ్మణున్ని తర్వాత హిందువిని తర్వాతే కమ్మ్యునిస్ట్ ని "ఇదీ వీరి marxism ,మేధస్సు .గిసంటొల్ల మాటలు రాతలు పట్టుకొని నారాజ్ ఐతవా?ఇదేమ్మన్న మంచి ముచ్చటేనా?

    ReplyDelete
  6. ఉదయ,

    మీరు చెప్పింది అక్షరాలా నిజం. ప్రస్తుతానికి జేపీ మేధావి అని ప్రజలు అనకపోయినా మీడియా ప్రచారం చేస్తుంది కనుక అప్పుడప్పుడూ మనమూ మోసపోవలిసి వస్తుంది. వీరిని మేధావులు అనే బదులు స్వయంప్రకటిత మేధావులు అందాం.

    ReplyDelete