తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించినతరువాత ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం సంక్లిష్ట స్థ్తితిలోకి వచ్చింది. అసలే బొటాబొటి మెజారిటీతో ఉండి అందులోనూ అవినీతి కూపంలో కూరుకుపోయి మంత్రులపైనే విచారణలెదుర్కుంటూ, మరో పక్క లోక్‌పాల్ విషయంతో కొట్టుమిట్టాడుతున్న కేంద్రానికి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో అని భయంతో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని ఇలాగే కొనసాగించడం అసలు సాధ్యం కాదు కనుక కేంద్ర ఏం చెయ్యాలి? ఇప్పుడు కేంద్ర దగ్గర ఉన్న మార్గాలు ఏమిటి? ఇంతకూ కేంద్రం ఏం చేస్తే ఏం జరుగుతుంది?
రెండు మూడు రోజుల్లో జగన్ తన స్టాండును కూడా చెప్పాల్సి వస్తుంది. జగన్ నిర్ణయం కూడా కొంతవరకూ భవిష్యత్ పరిణామాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం కొండా సురేఖ, జయసుధల రాజీనామాలను బట్టి జగన్ తెలంగాణ సమర్ధిస్తాడనుకోవచ్చు. కాకపోతే జగన్ మద్దతు ఇవ్వడం, ఇవ్వకపోవడం వల్ల ఈక్వేషన్లు పెద్దగా మారకపోవచ్చు.
1) గవర్నర్ పాలన: కేంద్ర ఎటూ తేల్చక, అందరి రాజీనామాలు తీసుకుని రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించవచ్చు. ఇదే నియంత గవర్నర్ నరసింహన్‌ను కొనసాగించి రాబోయే మూడేల్లలో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివెయ్యొచ్చు. తరువాత నిదానంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2014లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరుపవచ్చు.
ఫలితం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రేస్, తెలుగుదేశం పూర్తిగా ఓడిపోతాయి. టీఆరెస్, బీజేపీ, సీపీఐ ఒక కూటమి లాగా మారవచ్చు. జగన్ అనుకూల నిర్ణయం తీసుకుంటే జగన్ కూడా కూటమిలో చేరవచ్చు. టీఆరెస్, బీజేపీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. సీట్ల పంపిణీ ద్వారా సీపీఎం, జగన్ పార్టీలు తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. మజ్లీస్‌కు బాగా సీట్లు తగ్గిపోయి ఒకటి లేదా రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకోవచ్చు. పార్లమెంటు సీట్లలో కాంగ్రేస్్‌కు బహుషా ఒక్కటి కూడా దక్కక పోవచ్చు.
గవర్నర్ పాలన వలన సీమాంధ్ర ప్రజలు కూడా విసిగిపొయి ఉంటారు కాబట్టి కాంగ్రేస్‌కు సీమాంధ్రలో కూడా 4-5 కంటే ఎక్కువపార్లమెంటు స్థానాలకంటే ఎక్కువ రావు. జగన్‌కు ఎక్కువ సీట్లు , కొన్ని సీట్లు టీడీపీకి దక్కొచ్చు. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్కుండి 4,5 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటే కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఎండీయే అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణ ఇస్తుంది. అప్పుడు రాష్ట్రంలో కూడా జగన్, టీఆరెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఉంటే వారు విభజనకు అభ్యంతరాలు పెట్టరు. తెలంగాణలో టీఆరెస్, ఆంధ్రాలో జగన్ పార్టీ అధికారంలోకి రావొచ్చు.
2) సమస్యను సాగదీయడం: ఏదో ఒకలాగా కాంగ్రేస్ ప్రజాప్రతినిధులను మెత్తబరిచి, సమస్యను పరిష్కరిస్తున్నట్లు నటించి రాజీనామాలు వెనక్కి తీసుకునేట్టు చేసి కాలయాపన చెయ్యడం. రెండు సంవత్సరాలు అలాగే గడపెయ్యడం.
అప్పుడు కూడా వెచ్చే ఎలక్షన్లలో కాంగ్రేస్ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. తెలుగుదేశానికి ఇప్పటికే అడ్రస్ లేదు. ఎలక్షన్ రిజల్ట్సు మొదటి ఆప్షన్ లాగానే ఉంటాయి. తరువాత జరిగే పరిణామాలు కూడా భిన్నంగా ఉండవు, ఎండీయే అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇస్తుంది.
3) తెలంగాణ ఇవ్వడం: కేంద్రానికి మిగిలిన ఏకైక మార్గం తెలంగాణ ఇచ్చెయ్యడం. అప్పుడు ఉద్యమం సీమాంధ్రాకు మారుతుంది. కొన్నిరోజులు బంద్‌లూ గట్రా జరుగుతాయి. తెలంగాణా నుండి స్పషల్ ఫోర్సులను ఆంధ్రాకు తరలిస్తే రెండువారాల్లో అక్కడ పరిస్థితి మామూలు దశకు తీసుకురావొచ్చు.
ఎలాగూ అక్కడ ప్రజల్లో విభజన విషయంలోగానీ సమైక్యత విషయంలో గానీ పెద్ద ఆసక్తి లేదు. ఉద్యమాన్ని నడిపించేది ఎలాగూ నాయకులే. కాంగ్రేస్ నాయకులు సోనియా ఒక్కసారి కన్నెర్రజేస్తే నోరుమూసుకుంటారు. జగన్ బూచిని చూపి చంద్రబాబును దారిలోకి తెచ్చుకుంటే తెలుగుదేశం నాయకులు కూడా మెత్తబడుతారు. జగన్ ఎలాగూ రెండు రోజుల్లో తెలంగాణ అనుకూల ప్రకతన చేస్తాడనుకుంటే జగన్ సమైక్య ఉద్యమం చేసే అవకాశాలు అస్సలు లెవ్వు.
వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రేస్ తెరాసతో పొత్తు పెట్టుకోవచ్చు, లేక తెరాసను కలిపేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో కొన్ని సీట్లు కాంగ్రేస్ గెలుచుకోవచ్చు. సీమాంధ్రాలో విభజన వద్దనే పార్టీ ఏదీ ఉండదు కాబట్టి సీమాంధ్రాలో ఈఅంశం ఎన్నికలపై ప్రభావం చూపకపోవచ్చు. చంద్రబాబు పని ఇప్పటికే అయిపోయింది కాబట్టి సీమాంధ్రలో జగన్, కాంగ్రేస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. దీనివల్ల వచ్చే ఎలక్షన్లలో కేంద్రంలో కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి రాకపోయినా కనీసం కొన్ని సీట్లు పెరుగుతాయి, ఆంధ్ర, తెలంగాణాల్లో తన ఉనికిని కాంగ్రేస్ కాపాడుకుంటుంది.
కాబట్టి ఎలా చూసినా తెలంగాణా ఇస్తేనే కాంగ్రేస్‌కు లాభం. ఏం జరిగినా వచ్చే మూడేల్లలో పూర్తిగా జోకర్లుగా మిగిలేది మాత్రం చంద్రబాబు, చిరంజీవి
.