Monday, 14 December 2009

హేతువాదం పై అర్ధం లేని విమర్షలు

ఈ మధ్యన మన తెలుగు బ్లాగుల్లో హేతువాదాన్ని విమర్షించడం ఒక కొత్త ట్రెండ్ గా తయారయింది. తాము ఎంతో భక్తిగా నమ్మే విషయాలను మూఢ నమ్మకాలని ఒకరు అనడం సహజం గానే ఎవరికీ నచ్చదు. అది మూఢ నమ్మకం ఎందుకు కాదో, ఆ నమ్మకం ఏ విధంగా సమ్ర్ధనీయమో వీల్లు లాజికల్ గా వివరించలేరు. కాబట్టి అ ఫ్రస్ట్రేషన్ లో హేతువాదులందరినీ కుహనా హేతువాదులు గా, హిందూ ద్వేషులు గా చిత్రిస్తుంటారు.

వీల్ల వాదనలు మామూలు గా ఈ విధమగా ఉంటాయి. హేతువాదులు అని చెప్పుకునే వాల్లు కేవలం హిందూ ద్వేషులు. వాల్లకు హిందూ మతం లో ఉన్న ఆచారాలు మాత్రమే కనిపిస్తాయి, ఇస్లాం, కిరస్తానం లోని ముఢాచారాలు కనపడవు. వాటి గురించి మాట్లడే ధమ్ము వీల్లకు లేదు. వీల్లు ఎమీ సమాజ సేవ చెయ్యరు, కేవలం కబుర్లు చెపుతారు. కానీ వీల్లు విమర్షించే బాబాలు వగైరాలు మాత్రం ఎంతో సమాజ సేవ చేస్తారు.

వీల్ల వాదన వింటే నాకు వచ్చే మొదటి సందేహం, కుహనా హేతువాదులు అంటే ఎంటి అని. ఈ కుహనా అనే పదం నాకు తొలి సారిగా బీజేపీ నేతల నోట్లో వినపదింది. వీల్ల ద్రుష్టి లో వీల్లకి నచ్చని మతాలను విమర్షిస్తే వాల్లు మంచి హేతువాదులు, వాల్ల మతాన్ని విమర్షిస్తే కుహనా హేతువాదులు అని. అంటే ఎవరిని విమర్షించాలో వాల్లే నిర్నయిస్తారన్నమాట.

ఈ వాదని ఎలాగ ఉంటుందంటే, కందుకూరి, గురజాడా...మీకు ఇస్లాం లో ఉన్న దురాచారాలు కనపద లేద? వాటిని గురించి ఎందుకు మాట్లాడరు, ఎందుకు కేవలం మన సమాజం లోని కన్యా షుల్కం, బాల్య వివాహాలగురిచే మాట్లాదుతారు అన్నట్టు. ఇలా చెబితే ఒప్పుకోరు గానీ, ఈ విధంగా వాదించే వాల్లు ఒక వేల కందుకూరి ఉన్నప్పుడు పుట్టి ఉంటే బాల్య వివాహాలను సమర్ధిచే వారే, ఇప్పుడు అందరూ తప్పంటున్నారు కనుక వాల్లు కూడ బాల్య వివాహాలు తప్పే అని అంటారు. కందుకూరి ఏ అరబ్ దేసం లోనో పుట్టి ఉంటే అప్పుడు బురఖా గురించి ఉద్యమం చేసే వాడేమో.ఆంధ్ర దేషం లో పుట్టాడు కనుక బాల్య వివాహాల గురించి ఉద్యమిచాడు.

ఏ సమాజం లో ఉన్న హేతు వాదులు ఆ సమాజంలోని నమ్మకాలను గురించే గట్టిగా మాట్లాడుతారు, ఉద్యమిస్తారు. ఎక్కడొ దూరంగా ఉన్న సమాజం లోని విషయాలు ఎదైనా పుస్తకాల్లో రస్తే రాయొచ్చు కానీ, దాని గురిచి ఎక్కువ ఎఫర్ట్ ఎవరూ పెట్టరు. అలాగే ఒక అంతర్జాతీయ సమస్య గురించి ఉద్యమిచాలంటే దానికి ఒక పెద్ద వేదిక కావాలి. మనకు మాత్రమే సంబంధించిన మూఢ నమ్మకాలను, మనకు దగ్గరలో జరిగే దురాచారాలను మనం ముందుగా ఖందిస్తాము. ఈ విషయం అర్ధం చేసుకోలేక ఊరికే వాదించే ఈ క్రొత్త తరానికి చెందిన పాత భావాల వారసులని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.

ఇక పోతే రెండొ విషయం మీరు ఇలా ఎందుకు చెయ్యరు, అల్ల ఎందుకు చెయ్యరు అని అనడం. హేతు వాదులు ఎందుకు సాయిబాబా లాగా సేవలు చెయ్యరు అంటే మరి సాయి బాబా కి తేరగా దబ్బులు వస్తున్నాయి కాబట్టీ, అలా సేవ చేసినట్టు చూపించుకోకపోతే విరాలాలు వసూలు చెయ్యడం కష్టం కాబట్టి సేవలు చేస్తాడు. మరి హేతువాదుల దగ్గర అంత దబ్బు ఎక్కడ ఏద్చింది? ఇలా విమర్షించే వాల్లంతా ఎప్పుడైనా హేతువాద సంఘాలకు ఓ వెయ్యి రూపాయలు విరాలం ఇచ్చారా మరి? ఏ గుల్లోనో లక్ష రూపాయలు వెయ్యమంటే వేస్తారు గానీ?
ఇక మూడో విషయం, ఈ హేతువాద విమర్షకులు ఎప్పుడూ కూడా, హేతువాదులు చెప్పేది ఎందుకు తప్పో చెప్పరు. ఎందుకంటే అవి మూఢ నమ్మకాలు అన్న విషయం వీల్లకు కూడా తెలుసు. అయినా అది ఒప్పుకోవడానికి మనసు రాదు, ఎందుకంటే అది మన అచారం కదా. మన ఆచారాలను వేలెత్తి చూపడానికి వీడెవడు అనేది వీల్ల భావన. అదే వేరే వాల్ల అచారాలను వేలెత్తి చూపిస్తే అది మంచి హేతువాద లక్షనమన్న మాట.

2 comments:

  1. బాగా చెప్పారు. ప్రతిదాన్ని మతం కోణంలో చూస్తారు. అంతెందుకు గుళ్ళో పూజారినెవరినడిగినా చెప్తారు. ఇదంతా ట్రాష్ అని. పొట్టకూటికోసమని. అంతేసి విరాళాలిచ్చే ఈ పెద్దమనుషులు చిన్న చిన్న గుళ్ళొ పూజారులు అర్థాకలితో మాడి చస్తుంటే ఏనాడైనా సాయంచేసారా? ఇదీ వీరి మానవత్వం. మానవసేవ. తిరుపతిగుళ్ళో ఒక పూజారి నాణేలు, నగలు అమ్ముకొని కోటీశ్వరుడైతే, కూతురి పెళ్ళికి వాడినవాడు కటకటాలు లెక్కపెట్టాడు. అదీ వీరి మతాభిమానం.

    ReplyDelete
  2. మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

    * పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
    * పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
    * బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
    * జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
    * అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
    * చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
    * చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
    * కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
    * బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
    * తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
    * కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
    * నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
    దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

    * ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.
    * మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
    * కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
    * నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
    * గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

    ReplyDelete