పాపం చిరంజీవి ముహూర్తం చూసుకునే రాజకీయాల్లోకి వచ్చాడు కానీ, వచ్చినప్పటినుండీ అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. ప్రస్తుత రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా ఒక్క తన గ్లామర్ చాలు ముఖ్యమంత్రి కావడానికి అనుకుని రాజకీయాల్లోకి వస్తే అదంత వీజీ కాదని ఎప్పుడొ తెలిసిపోయింది.
మార్పు తీసుకొస్తాను, నిశ్శబ్ద విప్లవం వస్తుంది అని చెప్పుకొన్న చిరంజీవి తాను తీసుకురాబోయే మార్పు ఏంటొ ఏ కోశానా చెప్పలేక చివరికి నూటా పది మంది బీసీ లకు టికెట్లు ఇచ్చి ఇదే మార్పు అని చెప్పే ప్రయత్నం చేసాడు. సామాజిక న్యాయం తమ విధానమని చెప్పుకున్నా ఆ సామాజిక న్యాయం ఎలా వస్తుందో చెప్పలేక పోయాడు.
తెలంగానా లో ఓట్లు దండుకుందామని సామాజిక తెలంగానా తీసుకొస్తామని ఎలక్షను మానిఫెస్టో లో రాసుకున్నాడు. ప్రత్యేక తెలంగాణా నినాదానికి కి, సామాజిక తెలంగానా ఏ విధంగా భిన్నమయిందో వాల్ల పార్టీ కే తెలియాలి. ఇప్పుడు కాస్తా అనుకొన్నట్లు సామాజిక తెలంగానా నినాదం ఉపయోగపడక పోవడం తో దాన్ని గాలికి ఒదిలివేసాడు.
తెలంగానా పై చిదంబరం ప్రకటన వెలువడిన తరువాత ఒక వారం రోజుల వరకూ ఏం చేయాలో పాలుపోక గమ్మున కూర్చుని, ఆ తరువాత తీరుబడి గా బావమరిది తో కలిసి లెక్కలు వేసుకుని, సామాజిక తెలంగానా కన్నా సమైక్యాంధ్ర అంటే భవిష్యత్తులో కొంత రాజకీయ మనుగడ ఉండ వచ్చును అని నిర్నయించుకుని ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కి రాజీనామా ఇచ్చి సమైక్యాంధ్ర నినాదంతో పర్యటనలు చేస్తున్నాడు.
సామాజిక న్యాయం నినాదం కాస్తా ఇప్పటికే ఒక సామాజిక వర్గ న్యాయంగా మారి , పీఆర్పీ పార్టీ ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాచే పార్టీ గా గుర్తింపు తెచ్చుకున్నది. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆంధ్రా లో ఎదిగే సంగతేమిటొ కానీ ఆ పార్టీకి తెలంగాణా లో ఉన్న ఆర్గనైజేషన్ కాస్తా సొంత కుంపటి పెట్టుకునే కార్యక్రమంలో బుజీ అయిపోయింది.
ఇప్పుడున్న క్లిష్ట పరిస్తితిలో ఒక బాధ్యతగల పార్టీ అధినేతగా గొడవలు సద్దుమనగడానికి క్రుషి చేయాల్సింది పోయి, ఒక వర్గాన్ని రెచ్చ్గొట్టే కార్యక్రమంలో చిరంజీవి మునిగిపోయాడు. అగ్నికి అజ్యం పోసేవాడిలాగా ఒకప్రక్క రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఉద్యమానికి సంఘీభావం అంటూ రాష్ట్ర పర్యటనకి బయల్దేరాడు.
తను నమ్ముకున్న వాల్లు, తను ఉద్దేషపూర్వకంగా పక్కన పెట్టిన వాల్లు అంతా ఒక్కొక్కరే పార్టీ నుంది విడిపోతుంటే బహుషా ఆఖరి అస్త్రంగా ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మీదేసుకోవచ్చు. అయితే సినిమాల్లో మెగాస్టార్ గా వెలిగిన చిరజీవి రాజకీయాల్లో కమేడియన్ లా మారకముందే దుకానం మూసుకోవడం బెటర్ లా కనిపిస్తుంది.
No comments:
Post a Comment