Monday, 14 December 2009

మత మార్పిడులూ, మన వాల్లూ

నియో హిందూ వాదులు, సెల్ఫ్ అప్పయింటెడ్ మోరల్ అండ్ కల్చరల్ పోలీస్ లంతా కూడా ఈ మధ్య మత మార్పిడులపైన యుధ్ధం ప్రకటించారు. వీల్ల వాదన ఏమిటంటే క్రైస్తవ మిషనరీ లు హిందువులనందరినీ మత మార్పిడులకు ప్రోత్సహిస్తుంది, వీల్ల అజెండా హిందూ దేషాన్ని మెల్లగ క్రైస్తవ దేషంగా మర్చడం అని.

వీల్ల వాదనలో కొంత నిజం ఉంది. క్రైస్తవ మిషనరీ ల ఉద్దేషం అందరినీ క్రైస్తవులుగా మార్చడమే. అలాగే ముస్లిం మతనాయకుల ఉద్దేషం కూడా అందరినీ ఇస్లాం వైపు మరల్చడమే. ఎందుకంటే వీల్ల మతాల విశ్వాసాలు, మిగతా మతాలు, వాల్ల విశ్వాసాలు, వాల్ల దేవుల్లు అన్నీ తప్పు, కేవలం వాల్ల మతాల్లు, ఆచారాలు సత్యం అని చెబుతాయి. కాబట్టి వీల్లంతా కూడా మిగతా వాల్లు అగ్న్యానంలో ఉన్నరు, వాల్లను మార్చడం తమ కర్తవ్యం అని నమ్ముతారు. కానీ, హిందూ మతం వారి నమ్మకం ప్రకారం కేవలం హిందూ దేశంలోపుట్టినవాడు మాత్రమే హిందువు. అంటే వేరే జాతి వాల్లు హిందువులు గా మారడానికి వీల్లేదు. ఈ విధంగా ఇస్కాన్ వాల్లు హిందువులు గా మార్చిన తెల్ల వాల్లను మన గుల్లలోకి కూడా రానియ్యరు.

ఫై రెండు నమ్మకాలలో ఏది మంచి, ఎది చెడు అని మనం ఎప్పటికీ తేల్చలేము, ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాలవి, అందరికీ పర మత నమ్మకాలు తప్పు, వారి దేవుల్లు తప్పు దేవుల్లు. అయితే, ఈ భిన్నమయిన క్రైస్తవ, ముస్లిం మరియు హిందూ పద్దతుల వల్ల మెల్లగా హిందువుల రేషియో తగ్గి పోయి, క్రైస్తవుల, ముస్లిముల రేషియో పెరుగుతోంది. ఈ పరిస్తితి హిందూ రక్షకులుగా చెప్పుకునే వారికి కష్టం గా మారింది. అయితే, అలాగని ఒకరిని బలవంతంగా నువ్వు మతం మారకూడదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అన్న విషయం వీరు మరిచి పోతున్నారు. చేతనయితే వీల్లు కూడా, డబ్బో, మరేదొ ఇచ్చి అలా ఎవరూ మారిఫొకుండా కాపాడుకొవాలి, లేకపోతే ఇస్కాన్ వాల్లని ఆదర్షంగా తీసుకొని వేరే జాతి వాల్లని హిందువులుగా మార్చి వాల్ల సంఖ్య ను పెంచుకోవలి. అంతే కానీ ఒకడిని బలవంతంగా నువ్వు మతం మారడానికి వీల్లేదు అనడం వాడి హక్కును కాలరాయడమే.

ఇక పోతే ఇక్కడ రెండొ విషయం...అసలు మన ట్రైబల్స్ ఎప్పుడు హిందువులుగా లేరు. వాల్ల ఆచారాలు, విష్వాసాలు, దేవుల్లు అన్నీ కూడా హిందువులకు భిన్నమయినవి. ట్రైబల్స్ లో చాలా జాతులకు రామాయనం కానీ, భారతం, భగవద్గీత కానీ తెలియవు. వాలూ రామున్ని కానీ, క్రిష్నున్ని కానీ కొలవరు. అలంటి వారిని క్రైస్తవ మిషనరీ లు క్రైస్తవులుగా మారిస్తే అవి మత మార్పిడులు ఎలా అవుతాయి, ఒక మత స్వీకరన తప్ప? వాల్లకు ఇంతవరకూ చెప్పుకోవడానికి ఒక మతం అంటూ లేదు కదా?

ఇక మూడొ విషయం దలితుల మత మార్పిడులు. దలితులు హిందూ మతం లో భాగం అయినప్పటికీ, వాల్లెప్పుడూ అంటరాని వాల్లు గానే ఉన్నారు. దలితులను ఇప్పటికీ చాల గ్రామాల్లొ గుడులలోకి రానివ్వరు. అలాంటప్పుడు వాల్లు వేరే మతం స్వీకరిస్తే వాల్లకు సోషల్ స్టేటస్ పెరుగుతుందనుకోవడం తప్పెలా అవుతుంది? దీనికి మన వాల్లు చెప్పేదేంటంటే ఇలా మత మార్పిడి చేసుకొన్న వాల్లు దలితులు గానే ఉంటారు, వాల్లక సమన స్టేటస్ రాదు అని. అయితే వాల్ల స్తేటస్ పెరుగుతొందా రాదా అనేది వాల్లు నిర్నయించుకొంటారు, కాదనే హక్కు మనకెలా ఉంది? అయినా నాకు తెలిసి ఏ చచి కూడా ఫలనా వాల్లు చర్చి లోకి రాగూడదు అని అనరు. వీల్ల వాదన వింటే నాకు తెలంగాణా విషయం గుర్తొస్తుంది. ఈ ఆంధ్రా నాయకులు ఎలాగైతే తెలంగాణా వాల్ల హక్కులు వాల్లకు ఇవ్వరు, కానీ విడిపొయ్యే వీల్లేదు అంటారో ఇదీ అంతే మరి. ఇది చదివిన వాల్లు నన్ను కూడా హిందూ ద్వేషి, కుహనా హేతువాది, కుహనా నాస్తికుడు అనొచ్చు. నేను కేవలం తార్కికంగా అలొచించి రాసాను, నేను ఎవ్వరి ద్వేషినీ కాదు. నిజాలు కొన్ని చేదుగా ఉంటాయి మరి.

No comments:

Post a Comment