Thursday, 24 December 2009

సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణాలో ఎందుకు చేయరు?

తెలుగు ప్రజలంతా కలిసి ఉందామని కోరుకుంటున్నారు, తెలంగానా వాదం కేవలం కొంతమంది రాజకీయ నిరుద్యోగుల పని అని చెప్పే చిరంజీవి, లగడపాటి, జగన్, రోజా అంతా ఇప్పుడు తెలంగాణా వచ్చి తెలంగానా ప్రజలను శాంతింపచేయొచ్చు గదా? అలా ఎందుకు చేయరు మరి?

సమైక్యవాదులు చెప్పేట్లు నిజంగా తెలంగాణా వాల్లు కలిసి ఉందామనుకొంటున్నారు, ఇదంతా కేవలం కొందరు నాయకుల నాటకం అని చెప్పె వాల్లు తెలంగాన ప్రంతంలో సమైక్య వానిని బలంగా వినిపించడానికి ఇప్పుడున్న సమయంకంటే సరైన సమయం ఎప్పుడు వస్తుంది?

ఎవరో చెప్పినట్లు చరిత్రలో తొలిసారిగా ఒక ప్రాంతంవాల్లు స్వాతంత్రాన్ని కోరుతుంటే, ఇవ్వొద్దని ఉద్యమం చెయ్యడం ఇప్పుడు చూస్తున్నాం.

9 comments:

 1. Telangana lo samaikhyavadam ante; pakistan lo jihadi vaddu annatlu. evadina anagalda? antha dammu evarikundi

  ReplyDelete
 2. ***చిరంజీవి, లగడపాటి, జగన్, రోజా అంతా ఇప్పుడు తెలంగాణా వచ్చి తెలంగానా ప్రజలను శాంతింపచేయొచ్చు గదా?
  వాళ్ళు రారు ఒక వేళ వచ్చినా జనం

  మాములుగా కాదు బాబు ''పిచ్చ కొట్టుడు కొడతారు''

  ReplyDelete
 3. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
  ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
  1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad.nic.in/
  1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur.nic.in/
  1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor.nic.in/
  1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari.nic.in/
  1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur.nic.in/
  1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad.nic.in/
  1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa.nic.in/
  1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar.nic.in/
  1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam.nic.in/
  1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna.nic.in/
  1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool.nic.in/
  1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar.nic.in/
  1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak.nic.in/
  1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda.nic.in/
  1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore.nic.in/
  1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad.nic.in/
  1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam.nic.in/
  1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy.nic.in/
  1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam.nic.in/
  1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatnam.nic.in/
  1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram.nic.in/
  1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal.nic.in/
  1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari.nic.in/

  * అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,

  స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.

  ReplyDelete
 4. కొరివితో తలగోక్కోవటం అంటే ఇదే.
  అయినా నిజంగా ప్రజలలో ఆ భావన వుంటే రాజసేకరుడు గెలిచి, టి ఆర్ యస్ మట్టి కరిచి వుండేదికాదు.
  ఒక ప్రాంతంవాల్లు స్వాతంత్రాన్ని కోరుతుంటే, ఇవ్వొద్దని ఉద్యమం చెయ్యడం ఇప్పుడు చూస్తున్నాం. అన్నారు కాని ఇక్కడ కోరేది స్వాతంత్రాన్ని కాదు,మనదని వచ్చిన రాజదానిని కూడా, రాజదానితో ఉండే భందాన్ని(తెలంగాణాతో కాదు), రేపు తనవారికోసం ఇక్కడకు వచ్చే స్వేచ్చని కూడా.

  ReplyDelete
 5. తెలంగాణా లో ఉండి సమైక్యవాదాన్ని ఆలపించిన మోహన్ బాబు, చిరంజీవి తదితరుల మీద ఎలాంటి మూర్ఖపు దాడులు జరుగుతున్నాయో చూసారు కదా. అందుకే చేరి మూర్ఖుల మనసును రంజింపలేమని ఇక్కడి ప్రజలు మిన్నకుంటున్నారు. తెలంగాణా వచ్చినా సామాన్యుల కష్టాలు ఏ మాత్రం తీరవు, ఏ రాయి అయితే ఏంటి? అన్న నిర్లిప్తత అంతే.

  ReplyDelete
 6. నూటికి తొంభై శాతం తెలంగాణా ప్రజలు తమ తెలంగాణా రాష్ట్రం తమకు కావాలని ప్రగాడం గా కోరుకుం టున్నప్పుడు ఎవరినా సమైక్యతా గురించి ఎట్లా ప్రచారం చేయగలరు?
  రాజ శేకర్ అంతటి వస్తాదు కూడా తెలంగాణలో " కాంగ్రెస్ పార్టీ తెలంగాణాకు కట్టుబడి వుంది" అని అక్కడ ఆంధ్రాలో "తెలంగాణా వస్తే హైదరాబాద్కు వీసాలు వుంటే గాని పోవడానికి వీలుకాని పరిస్థితి వస్తుంది, మీకు నీళ్ళు రావు, ఉద్యోగాలు రావు" అని ప్రచారం చేసిన వైనం ఎవరు మరచిపోలేదు.
  ఈ అవకాశ వాద రాజకీయాలే తెలంగాణాకు తీరని ద్రోహం చేస్తున్నాయి.

  ReplyDelete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. Prabhakar garu manchi point chepparu. Avakasavaada rajakeeyalu oka praantaniki chendina rajakeeya naayakudu cheyyatam valle telangana ki droham jarigindi ante oppukonu. Telangana prantam lone avakasavadula valle ante bagintundi, ile nenu anataniki mana KCR pedda udaharana kadantara. ninna monnati varaku emi maatladani madhu yaski, ponnala, congress telnagan seniors emayyaru innalu telangana abivruddi kosam enduku alochinchaledu?

  9 samvatsaralu manrti padavi velagabettina KCR emi chesadu telangana prajalu aatma pareeseelana chesukovali. evaro enduku konnella kritam ilaane divangata Chennareddy koda telangaanam ettukunnaru CM padavi ivvagane telangaanam marachi poyyaru. ee 9 ellallo KCR okka manchi pani chesadu ani cheppataniki ledu. kendra mantri padavi hodalo unna KCR and TRS co lu telangana abhivruddiki eemaatram kastapaddaro andariki telusu.

  Nenu edo oka prrantaniki chendina vallatarapu maatladatam ledu. Oka telugu vadigaa adugutunanu british valla ayudham ayina "Divide and Rule" enta varaku correct antaru. Chinna raastaru elaa abivruddi saadinchayo Jharkhna abhivruddi chooste andariki artham avtundi.

  Seperate state kosam kaakonda telangana abhivruddi kosama KCR and vidyarthulu telangana vadulu udhyamiste prati telugu vadu garvistadu.

  ReplyDelete
 9. ఆనాడు తొందరపడి ఇతర రాష్ట్రాల్లో కలిపేసిన తెలుగు ప్రాంతాలు ఇవిః
  ఒడిసా – గంజాం,బరంపురం,కోరాపుట్,పర్లాకిమిడి.
  కర్నాటక – చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి.
  మహారాష్ట్ర – చంద్రపూర్,గచ్చిబోల్
  చత్తీస్గడ్ – బీజాపూర్,బస్తర్,దంతెవాడ.
  తమిళనాడు – హోసూరు,దేవనపల్లి,కృష్ణగిరి,డెంకణికోట.
  పాండిచేరి -యానాం
  సమైక్య ఆంధ్ర(ఆంధ్రప్రదేశ్)కే బీటలు పడుతుంటే,ఇక పై తెలుగు ప్రాంతాలతో కలిసిన మహా తెలుగునాడు(విశాలాంధ్ర)ఆవిర్భవిస్తుందా?

  ReplyDelete