కొన్నాల్లుగా తాను దైవాంశ సంభూతురాలుగా చెప్పుకుంటున్న శాంభవి, ఆమె సమ్రక్షకురాలుగా చెప్పుకుంటున్న ఉషారాని ల గుట్టు ఎట్టకేలకి బయటపడింది. ఆ ఉషారణి ఎవరో కాదు, స్వయంగా శంభవి తల్లి, డబ్బుకోసం ఈ నాటకం అంతా అడింది అన్న విషయం తేటతెల్లమయిపోయింది.
మీడియా పుణ్యమా అని గత కొంతకాలంగా శాంభవి మన రాష్త్రంలో అందరికీ తెలిసిపోయింది. ప్రజలకు విగ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలను ఇవ్వాల్సిన మీడియా లో ఒక వర్గం శాంభవిని నిజంగానే దైవంశ సంభూతురాలుగా ప్రచారం చెయ్యడం వల్ల ప్రజల్లో కూడా కొంత మంది ఇప్పటికే ఏమో, నిజమే కావొచ్చు, శాంభవి కి దైవశక్తులు ఉండొచ్చు అనుకొన్న వాల్లు లేకపోలెదు. ఇంకొన్ని రోజులు ఇలాగే వదిలేస్తే శాంభవి కూడా ఏ సత్య సాయిబాబా లాగానో, లేక బాల సాయిబాబా, ధరని మాత, కల్కి భగవానుడు మొదలైన వారి లిస్టు లో చేరిపోయేది. ఆ తరువాతా ఉషారాణి సమయం కాస్తా కోట్లు లీక్క పెట్టడం తోనే సరిపోయేది. అద్రుష్టవశాత్తు సరైన సమయం లో మన హేతువాడ సంఘాలు జోక్యం చేసుకోవడం వల్ల గానీ, ఒక్క సారి జనంలో పేరు పెరిగిపోతే ఏ కొర్టు కేసులు కూడా ఎమీ చేయలేకపోయేవి.
మిగతా బాబాలకు, శాంభవికి ఉన్న తేడా అల్లా శాంభవి ముక్కు పచ్చలారని బాలిక. ఖచ్చితంగా శాంభవికి దేవిడి పేరుతో జనాలను మోసం చేసి డబ్బు సంపాదిచే వయసు గానీ, తెలివి కానీ లేవు, అంతా ఉషారాణి డ్రామా మాత్రమే. శాంభవి అలాగే ఉండి, ఒక వేల ఎదిగిన తరువాత అలాంటి మోసపు బతుకు బ్రతకడం ఇష్టం లేకపోతే అప్పటికే ఊబిలోకి దిగిపోయిన శాంభవి కి బయటికి రావడం కష్టం అయిపోయేది. ఈ విషయలో జోక్యం చేసుకుని శాంభవి భ్విష్యత్తును తిరిగి ఆమెకి అప్పగించినందుకు మన హేతువాద సంఘాలను, మానవ హక్కుల కమీషనును, కోర్టులను అభినదించాలి.
ఇకపోతే ఇమొత్తం ఎపిసోడ్ లో తెలిసిపోయిన విషయం ఏమిటంటే మన దేశం లో దేవిడిపేరు చెప్పుకొని జనాలను మోసం చెయ్యడం చాలా సులువు. కాస్త విషయ గ్న్యాణమూ, కాస్త పురానాల్లో పట్టు ఉండి నాలుగు వేదాంతపు పలుకులు పలికితే ఎవ్వరైనా బాబాలుగా మారొచ్చూ, డబ్బు సంపాదించనూ వచ్చు. ఎంతమంది దేవుల్లు ఉన్నా, మన వాల్లు కొత్త దేవుల్లను ఆహ్వానిస్తూనే ఉంటారు మరి. కొత్తొక వింత కదా!!
No comments:
Post a Comment