Tuesday, 22 December 2009

చిరంజీవి కన్నా రాజకీయ నిరుద్యోగి ఎవరు?

తెలంగాణా లొ ఉన్న రాజకీయ నిరుద్యోగులే తెలంగాణా విడిపోవలంటున్నరని చిరంజీవి తన ఇటీవలి ప్రెస్ మీట్ లో అన్నాడు. ఈ వార్త విన్న జనం అసలు చిరంజీవి కన్నా రాజకీయ నిరుద్యోగి ప్రస్తుతం ఎవరని ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

మొన్నటికి మొన్న తామే ఇక దుకాణం మూసివేద్దమనుకుని, తీర్రా ఆ వార్త మీడియా లో రాగానే అసలు ఝండా పీకెయ్యడం సాధ్యమా అని మీడీ పై విరుచుకుపడ్డడు. ఆ తరువాత గ్రేటర్ ఎలక్షన్ లో ఏ విధంగా వోట్లు అడగాలో తెలియక కాంగ్రేస్ తొ పొత్తు పెట్టుకుందామనుకొని, తీరా అది కుదరకపోవడంతో ఒంతరిగా పోటీ చేసి ఒక్క కౌన్సిలర్ సీటు గలుచుకుని కన్ను లొట్టపోయినా సరే చావు తప్పించుకున్నారు.

ఆ తరువాత, మేము సామాజిక తెలంగాణా కి కట్టుబడి ఉన్నామని చిదంబరం ప్రకతనకి ఒక రోజు ముందు వరకూ చెప్పి ఆ తరువాత ఒక్క సారి ఈ సమైక్యాంధ్ర ఉద్యమం ఏదో బాగుంది, కొన్నాల్లు ఇందులో బుజీగా ఉండవచ్చునని అటువైపు దూకిన చిరంజీవి మిగతా వాల్లను రాజకీయ నిరుద్యోగులనడం ఎబ్బెట్టుగా ఉంది.

మంచో చేడో తెలంగాణా వాదులు ఒక విషయానికి కట్టుబడి ఉన్నారు, అదే వాల్ల ఉద్యోగం. ఎటొచ్చీ ఏ ఉద్యోగం లేక అయినవాల్లయిన తమ్ముడు, బామ్మర్ది కూడా వదిలి వేయడంతో దిక్కు తోచక ఇప్పుడు కాస్త పని కోసం సమైక్య రాగం అందుకుంది చిరంజీవే మరి. ఇక ఆయన అగ్నానానికి పరాకాష్ట విడిపోతే ఎల ఉంటుందో, కలిసి ఉంటే ఎల ఉంటుందో చెప్పడానికి ఆయన రష్యా, జెర్మనీ ఉదాహరనలు. అసలు ఆయనకి పెట్టుబదీ దారీ వ్యవస్త, సొషలిస్టు వ్యవస్తల తేడ తెలుసో లేదో? ఒక్క సారి ఆ విడిపోయిన పాత సోషలిస్టు రిబ్లిక్కులైన ఉక్రైన్, జార్జియా, బెలారస్ లాంటి దేషాలకు వెల్లి అడిగితే తెలుస్తుంది..వాల్లకు విడిపోతే బాగుందో, కలిసింటే బాగుందో.

1 comment:

  1. Baaga chepparu. Chiranjeevi nijangaane rajakeeya agnani

    ReplyDelete