Saturday, 26 December 2009

మహబూబ్ నగర్, నల్లగొండల గోడు

క్రిష్ణమ్మ, తుంగమ్మ ఏకమైనను ఇచట
గ్రుక్కెడైనను నీల్లు దాల్చలేదె?
వరదలొచ్చిన నాడు మునిగిపోతిని నేనె,
కరువులొచ్చిన నాడు ఎండి పోతిని నేనె !!


నాదు దేహము తొలిచి త్రవ్వెనొక సాగరం
గొంతు తడప చుక్క ఇవ్వలేదె !
దిష్టి బొమ్మ లాగ నాపైని ఈడాము
నన్ను వెక్కిరించి పక్క దోవ పట్టె !!

Thursday, 24 December 2009

సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణాలో ఎందుకు చేయరు?

తెలుగు ప్రజలంతా కలిసి ఉందామని కోరుకుంటున్నారు, తెలంగానా వాదం కేవలం కొంతమంది రాజకీయ నిరుద్యోగుల పని అని చెప్పే చిరంజీవి, లగడపాటి, జగన్, రోజా అంతా ఇప్పుడు తెలంగాణా వచ్చి తెలంగానా ప్రజలను శాంతింపచేయొచ్చు గదా? అలా ఎందుకు చేయరు మరి?

సమైక్యవాదులు చెప్పేట్లు నిజంగా తెలంగాణా వాల్లు కలిసి ఉందామనుకొంటున్నారు, ఇదంతా కేవలం కొందరు నాయకుల నాటకం అని చెప్పె వాల్లు తెలంగాన ప్రంతంలో సమైక్య వానిని బలంగా వినిపించడానికి ఇప్పుడున్న సమయంకంటే సరైన సమయం ఎప్పుడు వస్తుంది?

ఎవరో చెప్పినట్లు చరిత్రలో తొలిసారిగా ఒక ప్రాంతంవాల్లు స్వాతంత్రాన్ని కోరుతుంటే, ఇవ్వొద్దని ఉద్యమం చెయ్యడం ఇప్పుడు చూస్తున్నాం.

హైదరాబాద్ లో సీమాంధ్ర నేతల గూండాగిరీ

నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల హైదరాబాదులో హిందువులు, ముస్లిములు ఎప్పుడూ కలిసి ఐకమత్యంగానే ఉన్నారు. ఏనాడూ ఆవేష కావేషాలతో ఒకరిని ఒకరు చంపుకోలేదు. ఇప్పటికీ పాత బస్తీలో ఉండే హిందువులు, ముస్లిములు కలిసి మెలిసి ఉంటూ ఒకరి పండుగలను మరొకరు జరుపుకుంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న చెదురు మదురు సంఘటనలు జరిగినా, అవి తొందరగా సమిసిపొయ్యేవి.

అయితే 1991 లో హైదర్రబదులో జరిగిన మతకల్లోహాలు మాత్రం ఇందుకు భిన్నం. ఒక్క సారి 200ల మంది వరకూ చనిపోయారు. ఒకే రాత్రి జరిగిన దాడుల్లో వందకి పైగ చనిఫొయారు. అయితే విచిత్రంగా ఒకె ప్రాంతంలో ఒకే రాత్రి హిందువులని, ముస్లిములని కూడా చంపేషారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం స్కూటర్ పై ఇద్దరు గుండాలు వచ్చి బస్ స్టాండులో వున్న హిందువుని, ముస్లిముని కూడా పొడిచారు. ఇవి హిందూ ముస్లిము ఘర్షనలు కావు, కేవలం ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని దించివేయడానికి కొందరు నాయకులు రాయలసీమనుండి, అవని గడ్డ నుంచి తెచ్చిన కిరాయి రౌదీలు అన్నది సుస్పష్టం.

2002 లో, ఆనాడు అధికారమ్ళొ ఉన్న టీడీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చర్జీలకు నిరసనగా వామపక్షాలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే మధ్యలో కొంతమంది గూండాలు ఊరేగింపులో చేరి పోలీసులను రాల్లతో కొట్టారు. అప్పుడు జరిగిన పోలిసుల కాల్పుల్లో అమాయకులు బలి అయిపోయారు. ఆ సంఘటనకు కారనం ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాయలసీమకు చెందిన కాంగ్రేసు నాయకులే అనేది సుస్పష్టం.

ఇప్పుడు జరుగుతున్న తెలంగానా ఉద్యమంలో ఆంధ్రా మెస్సులపై, చందన బ్రదర్స్ పై దాడి చేసింది విద్యార్తులు కాదు గూండాలు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇవ్వాల నాగం జనార్ధన్ రెద్ది పై జరిగిన దాడిని టీవీలో చూసిన వారికి దాడిలొ నాగమ్ను విడవకుండా కొట్టిన ఆకుపచ్చ చొక్కా వెధవ విద్యార్థి అని చూసిన వాడు ఎవడూ అనుకోడు. ఎద్దులా ఎదిగి, కనీసం ముప్పై అయిదు ఏల్లకు పైగా ఉన్న ఆ వెధవను పట్టుకొని అరెస్ట్8ఉ చేస్తే తెలుస్తుంది వాడు ఉస్మానియా విద్యార్తేనా లేక జగన్, జగడపాటి మనిషా అని.

హైదరాబాదుని మేమే అభివ్రుధ్ధి చేసామని అతిషయోక్తులు పలికే ఈ ఆంధ్రా నాయకులు, హైదరాబాదు లో గూండాగిరి చేసింది ఆంధ్రా వాల్లే అని ఒప్పుకోరు మరి.

Wednesday, 23 December 2009

ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?

ఎలాగైతేనేం, ఆంధ్రా వాల్లు వాల్లకి కావలిసింది సాధించారు. చిదంబరం తో అన్ని పక్షాల ఏకాభిప్రాయం సాధించిన తరువాత మాత్రమే తెలంగాణా ఇస్తామని చెప్పించారు. పది రోజుల ధర్నాల వల్ల నయితేనేమి, నిరాహార దీక్ష ద్రామాలవల్లనైతే నేమి వత్తిడి తెచ్చి తెలంగానా ప్రక్రియ ప్రస్తుతానికి ఆపించారు.
అయితే ఏకాభిప్రాయం సాధించడమంటే తెలంగానా ఇవ్వమడం సాధ్యం కాదు అని చెప్పడమే అలి తెలిసిన ఆంధ్రా వాల్లు సంబరాలు చేసుకుంటున్నారు. యాభై యేల్లుగా రానీ ఏకాభిప్రాయం, పదేల్ల టీఆరెస్ ఉద్యమంతో రాని ఏకాభ్ప్రాయం ఇప్పుడు వస్తుందా? అయినా దోచుకుని తినే వాడు ఎవడైన ఆ దోపిడిని అపేద్దాం అంటె ఒప్పుకుంటాడా?

Tuesday, 22 December 2009

చిరంజీవి కన్నా రాజకీయ నిరుద్యోగి ఎవరు?

తెలంగాణా లొ ఉన్న రాజకీయ నిరుద్యోగులే తెలంగాణా విడిపోవలంటున్నరని చిరంజీవి తన ఇటీవలి ప్రెస్ మీట్ లో అన్నాడు. ఈ వార్త విన్న జనం అసలు చిరంజీవి కన్నా రాజకీయ నిరుద్యోగి ప్రస్తుతం ఎవరని ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

మొన్నటికి మొన్న తామే ఇక దుకాణం మూసివేద్దమనుకుని, తీర్రా ఆ వార్త మీడియా లో రాగానే అసలు ఝండా పీకెయ్యడం సాధ్యమా అని మీడీ పై విరుచుకుపడ్డడు. ఆ తరువాత గ్రేటర్ ఎలక్షన్ లో ఏ విధంగా వోట్లు అడగాలో తెలియక కాంగ్రేస్ తొ పొత్తు పెట్టుకుందామనుకొని, తీరా అది కుదరకపోవడంతో ఒంతరిగా పోటీ చేసి ఒక్క కౌన్సిలర్ సీటు గలుచుకుని కన్ను లొట్టపోయినా సరే చావు తప్పించుకున్నారు.

ఆ తరువాత, మేము సామాజిక తెలంగాణా కి కట్టుబడి ఉన్నామని చిదంబరం ప్రకతనకి ఒక రోజు ముందు వరకూ చెప్పి ఆ తరువాత ఒక్క సారి ఈ సమైక్యాంధ్ర ఉద్యమం ఏదో బాగుంది, కొన్నాల్లు ఇందులో బుజీగా ఉండవచ్చునని అటువైపు దూకిన చిరంజీవి మిగతా వాల్లను రాజకీయ నిరుద్యోగులనడం ఎబ్బెట్టుగా ఉంది.

మంచో చేడో తెలంగాణా వాదులు ఒక విషయానికి కట్టుబడి ఉన్నారు, అదే వాల్ల ఉద్యోగం. ఎటొచ్చీ ఏ ఉద్యోగం లేక అయినవాల్లయిన తమ్ముడు, బామ్మర్ది కూడా వదిలి వేయడంతో దిక్కు తోచక ఇప్పుడు కాస్త పని కోసం సమైక్య రాగం అందుకుంది చిరంజీవే మరి. ఇక ఆయన అగ్నానానికి పరాకాష్ట విడిపోతే ఎల ఉంటుందో, కలిసి ఉంటే ఎల ఉంటుందో చెప్పడానికి ఆయన రష్యా, జెర్మనీ ఉదాహరనలు. అసలు ఆయనకి పెట్టుబదీ దారీ వ్యవస్త, సొషలిస్టు వ్యవస్తల తేడ తెలుసో లేదో? ఒక్క సారి ఆ విడిపోయిన పాత సోషలిస్టు రిబ్లిక్కులైన ఉక్రైన్, జార్జియా, బెలారస్ లాంటి దేషాలకు వెల్లి అడిగితే తెలుస్తుంది..వాల్లకు విడిపోతే బాగుందో, కలిసింటే బాగుందో.

Sunday, 20 December 2009

సమైక్యాంధ్ర వాదులు చెప్పే రీజన్స్ ఏంటి?

తెలంగాణా ను ప్రత్యేకరాష్ట్రం చేయాలనే డిమాండ్ గత యాభై సంవత్సరాలుగా ఉంది. అలాగే కేసీఆర్ కూడా టీఆరెస్ పార్టీ పెట్టి పది సంవత్సరాలు గదిచిపోయింది. ఇంతకాలం ఆంధ్రా ప్రాంతం వారు ఎవ్వరూ కూడా సమైక్యాంధ్ర కావాలని ఉద్యమించిన వాల్లు లేరు. అల్లాగే కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన పది రోజుల్లో కూడా ఏ ఆంధ్రా నేతా తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నమని చెప్పలేదు. అంతే కాకా వీల్లంతా కూడా అఖిల పక్ష సమవేషంలో ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన తెస్తే సమర్ధిస్తామనో, లేక అధిష్టానానికి కట్టుబడి ఉంటామనో మరోతో చెప్పారు.

ఇప్పుడు ఆంధ్రా నాయకులంతా ఒక్కసారిగా తాము సమైక్యాంధ్ర కోరుతున్నామని చెబుతున్నారు. ఏదేమైనా ఈ సమైక్యవాదులు కలిసి ఉండడానికి తాము చెప్పే కారణాలు ఏంటి? అవి ఎంతవరకూ సమర్ధనీయం?

1. కలిసి ఉంటేనే అభివ్రుధ్ధి సాధ్యం.

- కాస్త బుర్ర ఉన్న వాడికి ఎవడికైనా ఇది తప్పు అని తెల్సిపోతుంది. కలిసి ఉంటేనే అభివ్రుద్ధి జరిగితే మొత్తం దేశం అంతా కలిసి ఉండిపోవచ్చు కదా? రాష్ట్రాలుగా విభజించడం దేనికి?

- ఆంధ్రా సెపరేట్ అయితే దానికి ఒక కాపిటల్ సితీ తయారవుతుంది. అప్పుడు అక్కడ పరిశ్రమలు, మిగతా అభివ్రుద్ధి జరుగుతుంది. కొత్త ప్రభుత్వ ఉద్యొగాలు తయారవుతాయి.

2. హైదరాబద్ ను ఆంధ్రా వాల్లే అభివ్రుద్ధి చేసారు.

- ఇందులో నిజానిజాలు పక్కన పెడితే అసలు ఈ వాదన వీల్ల ప్రేమ హైదరాబాద్ మీద తప్ప కలిసి ఉండడం కాదని అర్ధమవుతుంది.

3. హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న ఆంధ్ర వాల్ల సంగతేంటి? వాల్ల ఆస్తులకు రక్షన ఎలా ఉంటుంది?

- మద్రాస్ లొ మనవాల్లు లక్షలకొద్ది ఉన్నారు ఇప్పటికీ. వాల్ల ఆస్తులను ఎవరైన లాక్కున్నారా? అసలు హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాల్లు తెలంగాణాని సమర్ధించినపుడు ఈ వాదన ఎంత సబబు?
4. మనమంతా తెలుగు భాష మాట్లాడి వాల్లమే. తెలుగు అన్నా, ఆంధ్రము అన్నా ఒకటే.

-అవును నిజమే. మనమంతా మాట్లాడెది తెలుగే. అలా అని అంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని ఎక్కడ రూల్ ఉంది? హిందీ మాట్లాడే ప్రజలు పలు రాష్ట్రాలుగా విడివిడిగా లేరా?

5. అసలు తెలంగాణా ప్రజలంతా సమైక్యాంధ్ర కావాలనుకుంటున్నారు. ఇది కేవలం రాజకీయ నాయకుల కుట్ర.

- ఇదే నిజమయితే ఒక్కచోట కూడా తెలంగానాలో సమైక్యాంధ్రకు అనుకూలంగా ఒక ర్యాలీ కానీ, ఒక సభ కానీ, లేక నిరాహారదీక్ష కానీ ఎవరైనా చేసారా?

సమైక్య వాదులారా. బహుషా నా అభిప్రాయం తప్పు కావొచ్చు. నేను మీ వాదనలో ఏదయినా మిస్స్ అవుతున్నానేమో. కొంచెం మీ వాదన ఏమిటో చుబుతారా? ఈ ఆంధ్రా వాల్ల సమైక్య వాదన తెలంగాణా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెల్తుంది. ఆంధ్రా వాల్లు నిజంగానే తమ వనరులను దోచుకుంటున్నారు, ఆంధ్రా వాల్లు సొంత వనరులతో ఒక రాష్ట్రంగా ఉండలేరు అనుకొంటున్నారు. ఇది తప్పు అని చెప్పాలంటే ఆంధ్రా వాల్లు తమ వాదన ఏవిధంగా సమర్ధనీయమో ఖచ్చితమయిన వివరన ఇవ్వాలి.

Saturday, 19 December 2009

దిషా, గమ్యం లేని చిరంజీవి రాజకీయాలు


పాపం చిరంజీవి ముహూర్తం చూసుకునే రాజకీయాల్లోకి వచ్చాడు కానీ, వచ్చినప్పటినుండీ అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. ప్రస్తుత రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా ఒక్క తన గ్లామర్ చాలు ముఖ్యమంత్రి కావడానికి అనుకుని రాజకీయాల్లోకి వస్తే అదంత వీజీ కాదని ఎప్పుడొ తెలిసిపోయింది.

మార్పు తీసుకొస్తాను, నిశ్శబ్ద విప్లవం వస్తుంది అని చెప్పుకొన్న చిరంజీవి తాను తీసుకురాబోయే మార్పు ఏంటొ ఏ కోశానా చెప్పలేక చివరికి నూటా పది మంది బీసీ లకు టికెట్లు ఇచ్చి ఇదే మార్పు అని చెప్పే ప్రయత్నం చేసాడు. సామాజిక న్యాయం తమ విధానమని చెప్పుకున్నా ఆ సామాజిక న్యాయం ఎలా వస్తుందో చెప్పలేక పోయాడు.
తెలంగానా లో ఓట్లు దండుకుందామని సామాజిక తెలంగానా తీసుకొస్తామని ఎలక్షను మానిఫెస్టో లో రాసుకున్నాడు. ప్రత్యేక తెలంగాణా నినాదానికి కి, సామాజిక తెలంగానా ఏ విధంగా భిన్నమయిందో వాల్ల పార్టీ కే తెలియాలి. ఇప్పుడు కాస్తా అనుకొన్నట్లు సామాజిక తెలంగానా నినాదం ఉపయోగపడక పోవడం తో దాన్ని గాలికి ఒదిలివేసాడు.
తెలంగానా పై చిదంబరం ప్రకటన వెలువడిన తరువాత ఒక వారం రోజుల వరకూ ఏం చేయాలో పాలుపోక గమ్మున కూర్చుని, ఆ తరువాత తీరుబడి గా బావమరిది తో కలిసి లెక్కలు వేసుకుని, సామాజిక తెలంగానా కన్నా సమైక్యాంధ్ర అంటే భవిష్యత్తులో కొంత రాజకీయ మనుగడ ఉండ వచ్చును అని నిర్నయించుకుని ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కి రాజీనామా ఇచ్చి సమైక్యాంధ్ర నినాదంతో పర్యటనలు చేస్తున్నాడు.

సామాజిక న్యాయం నినాదం కాస్తా ఇప్పటికే ఒక సామాజిక వర్గ న్యాయంగా మారి , పీఆర్పీ పార్టీ ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాచే పార్టీ గా గుర్తింపు తెచ్చుకున్నది. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆంధ్రా లో ఎదిగే సంగతేమిటొ కానీ ఆ పార్టీకి తెలంగాణా లో ఉన్న ఆర్గనైజేషన్ కాస్తా సొంత కుంపటి పెట్టుకునే కార్యక్రమంలో బుజీ అయిపోయింది.
ఇప్పుడున్న క్లిష్ట పరిస్తితిలో ఒక బాధ్యతగల పార్టీ అధినేతగా గొడవలు సద్దుమనగడానికి క్రుషి చేయాల్సింది పోయి, ఒక వర్గాన్ని రెచ్చ్గొట్టే కార్యక్రమంలో చిరంజీవి మునిగిపోయాడు. అగ్నికి అజ్యం పోసేవాడిలాగా ఒకప్రక్క రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఉద్యమానికి సంఘీభావం అంటూ రాష్ట్ర పర్యటనకి బయల్దేరాడు.
తను నమ్ముకున్న వాల్లు, తను ఉద్దేషపూర్వకంగా పక్కన పెట్టిన వాల్లు అంతా ఒక్కొక్కరే పార్టీ నుంది విడిపోతుంటే బహుషా ఆఖరి అస్త్రంగా ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మీదేసుకోవచ్చు. అయితే సినిమాల్లో మెగాస్టార్ గా వెలిగిన చిరజీవి రాజకీయాల్లో కమేడియన్ లా మారకముందే దుకానం మూసుకోవడం బెటర్ లా కనిపిస్తుంది.

Friday, 18 December 2009

శాంభవి గుట్టు రట్టు, హేతువాదుల విజయం

కొన్నాల్లుగా తాను దైవాంశ సంభూతురాలుగా చెప్పుకుంటున్న శాంభవి, ఆమె సమ్రక్షకురాలుగా చెప్పుకుంటున్న ఉషారాని ల గుట్టు ఎట్టకేలకి బయటపడింది. ఆ ఉషారణి ఎవరో కాదు, స్వయంగా శంభవి తల్లి, డబ్బుకోసం ఈ నాటకం అంతా అడింది అన్న విషయం తేటతెల్లమయిపోయింది.

మీడియా పుణ్యమా అని గత కొంతకాలంగా శాంభవి మన రాష్త్రంలో అందరికీ తెలిసిపోయింది. ప్రజలకు విగ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలను ఇవ్వాల్సిన మీడియా లో ఒక వర్గం శాంభవిని నిజంగానే దైవంశ సంభూతురాలుగా ప్రచారం చెయ్యడం వల్ల ప్రజల్లో కూడా కొంత మంది ఇప్పటికే ఏమో, నిజమే కావొచ్చు, శాంభవి కి దైవశక్తులు ఉండొచ్చు అనుకొన్న వాల్లు లేకపోలెదు. ఇంకొన్ని రోజులు ఇలాగే వదిలేస్తే శాంభవి కూడా ఏ సత్య సాయిబాబా లాగానో, లేక బాల సాయిబాబా, ధరని మాత, కల్కి భగవానుడు మొదలైన వారి లిస్టు లో చేరిపోయేది. ఆ తరువాతా ఉషారాణి సమయం కాస్తా కోట్లు లీక్క పెట్టడం తోనే సరిపోయేది. అద్రుష్టవశాత్తు సరైన సమయం లో మన హేతువాడ సంఘాలు జోక్యం చేసుకోవడం వల్ల గానీ, ఒక్క సారి జనంలో పేరు పెరిగిపోతే ఏ కొర్టు కేసులు కూడా ఎమీ చేయలేకపోయేవి.

మిగతా బాబాలకు, శాంభవికి ఉన్న తేడా అల్లా శాంభవి ముక్కు పచ్చలారని బాలిక. ఖచ్చితంగా శాంభవికి దేవిడి పేరుతో జనాలను మోసం చేసి డబ్బు సంపాదిచే వయసు గానీ, తెలివి కానీ లేవు, అంతా ఉషారాణి డ్రామా మాత్రమే. శాంభవి అలాగే ఉండి, ఒక వేల ఎదిగిన తరువాత అలాంటి మోసపు బతుకు బ్రతకడం ఇష్టం లేకపోతే అప్పటికే ఊబిలోకి దిగిపోయిన శాంభవి కి బయటికి రావడం కష్టం అయిపోయేది. ఈ విషయలో జోక్యం చేసుకుని శాంభవి భ్విష్యత్తును తిరిగి ఆమెకి అప్పగించినందుకు మన హేతువాద సంఘాలను, మానవ హక్కుల కమీషనును, కోర్టులను అభినదించాలి.

ఇకపోతే ఇమొత్తం ఎపిసోడ్ లో తెలిసిపోయిన విషయం ఏమిటంటే మన దేశం లో దేవిడిపేరు చెప్పుకొని జనాలను మోసం చెయ్యడం చాలా సులువు. కాస్త విషయ గ్న్యాణమూ, కాస్త పురానాల్లో పట్టు ఉండి నాలుగు వేదాంతపు పలుకులు పలికితే ఎవ్వరైనా బాబాలుగా మారొచ్చూ, డబ్బు సంపాదించనూ వచ్చు. ఎంతమంది దేవుల్లు ఉన్నా, మన వాల్లు కొత్త దేవుల్లను ఆహ్వానిస్తూనే ఉంటారు మరి. కొత్తొక వింత కదా!!

Monday, 14 December 2009

మత మార్పిడులూ, మన వాల్లూ

నియో హిందూ వాదులు, సెల్ఫ్ అప్పయింటెడ్ మోరల్ అండ్ కల్చరల్ పోలీస్ లంతా కూడా ఈ మధ్య మత మార్పిడులపైన యుధ్ధం ప్రకటించారు. వీల్ల వాదన ఏమిటంటే క్రైస్తవ మిషనరీ లు హిందువులనందరినీ మత మార్పిడులకు ప్రోత్సహిస్తుంది, వీల్ల అజెండా హిందూ దేషాన్ని మెల్లగ క్రైస్తవ దేషంగా మర్చడం అని.

వీల్ల వాదనలో కొంత నిజం ఉంది. క్రైస్తవ మిషనరీ ల ఉద్దేషం అందరినీ క్రైస్తవులుగా మార్చడమే. అలాగే ముస్లిం మతనాయకుల ఉద్దేషం కూడా అందరినీ ఇస్లాం వైపు మరల్చడమే. ఎందుకంటే వీల్ల మతాల విశ్వాసాలు, మిగతా మతాలు, వాల్ల విశ్వాసాలు, వాల్ల దేవుల్లు అన్నీ తప్పు, కేవలం వాల్ల మతాల్లు, ఆచారాలు సత్యం అని చెబుతాయి. కాబట్టి వీల్లంతా కూడా మిగతా వాల్లు అగ్న్యానంలో ఉన్నరు, వాల్లను మార్చడం తమ కర్తవ్యం అని నమ్ముతారు. కానీ, హిందూ మతం వారి నమ్మకం ప్రకారం కేవలం హిందూ దేశంలోపుట్టినవాడు మాత్రమే హిందువు. అంటే వేరే జాతి వాల్లు హిందువులు గా మారడానికి వీల్లేదు. ఈ విధంగా ఇస్కాన్ వాల్లు హిందువులు గా మార్చిన తెల్ల వాల్లను మన గుల్లలోకి కూడా రానియ్యరు.

ఫై రెండు నమ్మకాలలో ఏది మంచి, ఎది చెడు అని మనం ఎప్పటికీ తేల్చలేము, ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాలవి, అందరికీ పర మత నమ్మకాలు తప్పు, వారి దేవుల్లు తప్పు దేవుల్లు. అయితే, ఈ భిన్నమయిన క్రైస్తవ, ముస్లిం మరియు హిందూ పద్దతుల వల్ల మెల్లగా హిందువుల రేషియో తగ్గి పోయి, క్రైస్తవుల, ముస్లిముల రేషియో పెరుగుతోంది. ఈ పరిస్తితి హిందూ రక్షకులుగా చెప్పుకునే వారికి కష్టం గా మారింది. అయితే, అలాగని ఒకరిని బలవంతంగా నువ్వు మతం మారకూడదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అన్న విషయం వీరు మరిచి పోతున్నారు. చేతనయితే వీల్లు కూడా, డబ్బో, మరేదొ ఇచ్చి అలా ఎవరూ మారిఫొకుండా కాపాడుకొవాలి, లేకపోతే ఇస్కాన్ వాల్లని ఆదర్షంగా తీసుకొని వేరే జాతి వాల్లని హిందువులుగా మార్చి వాల్ల సంఖ్య ను పెంచుకోవలి. అంతే కానీ ఒకడిని బలవంతంగా నువ్వు మతం మారడానికి వీల్లేదు అనడం వాడి హక్కును కాలరాయడమే.

ఇక పోతే ఇక్కడ రెండొ విషయం...అసలు మన ట్రైబల్స్ ఎప్పుడు హిందువులుగా లేరు. వాల్ల ఆచారాలు, విష్వాసాలు, దేవుల్లు అన్నీ కూడా హిందువులకు భిన్నమయినవి. ట్రైబల్స్ లో చాలా జాతులకు రామాయనం కానీ, భారతం, భగవద్గీత కానీ తెలియవు. వాలూ రామున్ని కానీ, క్రిష్నున్ని కానీ కొలవరు. అలంటి వారిని క్రైస్తవ మిషనరీ లు క్రైస్తవులుగా మారిస్తే అవి మత మార్పిడులు ఎలా అవుతాయి, ఒక మత స్వీకరన తప్ప? వాల్లకు ఇంతవరకూ చెప్పుకోవడానికి ఒక మతం అంటూ లేదు కదా?

ఇక మూడొ విషయం దలితుల మత మార్పిడులు. దలితులు హిందూ మతం లో భాగం అయినప్పటికీ, వాల్లెప్పుడూ అంటరాని వాల్లు గానే ఉన్నారు. దలితులను ఇప్పటికీ చాల గ్రామాల్లొ గుడులలోకి రానివ్వరు. అలాంటప్పుడు వాల్లు వేరే మతం స్వీకరిస్తే వాల్లకు సోషల్ స్టేటస్ పెరుగుతుందనుకోవడం తప్పెలా అవుతుంది? దీనికి మన వాల్లు చెప్పేదేంటంటే ఇలా మత మార్పిడి చేసుకొన్న వాల్లు దలితులు గానే ఉంటారు, వాల్లక సమన స్టేటస్ రాదు అని. అయితే వాల్ల స్తేటస్ పెరుగుతొందా రాదా అనేది వాల్లు నిర్నయించుకొంటారు, కాదనే హక్కు మనకెలా ఉంది? అయినా నాకు తెలిసి ఏ చచి కూడా ఫలనా వాల్లు చర్చి లోకి రాగూడదు అని అనరు. వీల్ల వాదన వింటే నాకు తెలంగాణా విషయం గుర్తొస్తుంది. ఈ ఆంధ్రా నాయకులు ఎలాగైతే తెలంగాణా వాల్ల హక్కులు వాల్లకు ఇవ్వరు, కానీ విడిపొయ్యే వీల్లేదు అంటారో ఇదీ అంతే మరి. ఇది చదివిన వాల్లు నన్ను కూడా హిందూ ద్వేషి, కుహనా హేతువాది, కుహనా నాస్తికుడు అనొచ్చు. నేను కేవలం తార్కికంగా అలొచించి రాసాను, నేను ఎవ్వరి ద్వేషినీ కాదు. నిజాలు కొన్ని చేదుగా ఉంటాయి మరి.

హేతువాదం పై అర్ధం లేని విమర్షలు

ఈ మధ్యన మన తెలుగు బ్లాగుల్లో హేతువాదాన్ని విమర్షించడం ఒక కొత్త ట్రెండ్ గా తయారయింది. తాము ఎంతో భక్తిగా నమ్మే విషయాలను మూఢ నమ్మకాలని ఒకరు అనడం సహజం గానే ఎవరికీ నచ్చదు. అది మూఢ నమ్మకం ఎందుకు కాదో, ఆ నమ్మకం ఏ విధంగా సమ్ర్ధనీయమో వీల్లు లాజికల్ గా వివరించలేరు. కాబట్టి అ ఫ్రస్ట్రేషన్ లో హేతువాదులందరినీ కుహనా హేతువాదులు గా, హిందూ ద్వేషులు గా చిత్రిస్తుంటారు.

వీల్ల వాదనలు మామూలు గా ఈ విధమగా ఉంటాయి. హేతువాదులు అని చెప్పుకునే వాల్లు కేవలం హిందూ ద్వేషులు. వాల్లకు హిందూ మతం లో ఉన్న ఆచారాలు మాత్రమే కనిపిస్తాయి, ఇస్లాం, కిరస్తానం లోని ముఢాచారాలు కనపడవు. వాటి గురించి మాట్లడే ధమ్ము వీల్లకు లేదు. వీల్లు ఎమీ సమాజ సేవ చెయ్యరు, కేవలం కబుర్లు చెపుతారు. కానీ వీల్లు విమర్షించే బాబాలు వగైరాలు మాత్రం ఎంతో సమాజ సేవ చేస్తారు.

వీల్ల వాదన వింటే నాకు వచ్చే మొదటి సందేహం, కుహనా హేతువాదులు అంటే ఎంటి అని. ఈ కుహనా అనే పదం నాకు తొలి సారిగా బీజేపీ నేతల నోట్లో వినపదింది. వీల్ల ద్రుష్టి లో వీల్లకి నచ్చని మతాలను విమర్షిస్తే వాల్లు మంచి హేతువాదులు, వాల్ల మతాన్ని విమర్షిస్తే కుహనా హేతువాదులు అని. అంటే ఎవరిని విమర్షించాలో వాల్లే నిర్నయిస్తారన్నమాట.

ఈ వాదని ఎలాగ ఉంటుందంటే, కందుకూరి, గురజాడా...మీకు ఇస్లాం లో ఉన్న దురాచారాలు కనపద లేద? వాటిని గురించి ఎందుకు మాట్లాడరు, ఎందుకు కేవలం మన సమాజం లోని కన్యా షుల్కం, బాల్య వివాహాలగురిచే మాట్లాదుతారు అన్నట్టు. ఇలా చెబితే ఒప్పుకోరు గానీ, ఈ విధంగా వాదించే వాల్లు ఒక వేల కందుకూరి ఉన్నప్పుడు పుట్టి ఉంటే బాల్య వివాహాలను సమర్ధిచే వారే, ఇప్పుడు అందరూ తప్పంటున్నారు కనుక వాల్లు కూడ బాల్య వివాహాలు తప్పే అని అంటారు. కందుకూరి ఏ అరబ్ దేసం లోనో పుట్టి ఉంటే అప్పుడు బురఖా గురించి ఉద్యమం చేసే వాడేమో.ఆంధ్ర దేషం లో పుట్టాడు కనుక బాల్య వివాహాల గురించి ఉద్యమిచాడు.

ఏ సమాజం లో ఉన్న హేతు వాదులు ఆ సమాజంలోని నమ్మకాలను గురించే గట్టిగా మాట్లాడుతారు, ఉద్యమిస్తారు. ఎక్కడొ దూరంగా ఉన్న సమాజం లోని విషయాలు ఎదైనా పుస్తకాల్లో రస్తే రాయొచ్చు కానీ, దాని గురిచి ఎక్కువ ఎఫర్ట్ ఎవరూ పెట్టరు. అలాగే ఒక అంతర్జాతీయ సమస్య గురించి ఉద్యమిచాలంటే దానికి ఒక పెద్ద వేదిక కావాలి. మనకు మాత్రమే సంబంధించిన మూఢ నమ్మకాలను, మనకు దగ్గరలో జరిగే దురాచారాలను మనం ముందుగా ఖందిస్తాము. ఈ విషయం అర్ధం చేసుకోలేక ఊరికే వాదించే ఈ క్రొత్త తరానికి చెందిన పాత భావాల వారసులని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.

ఇక పోతే రెండొ విషయం మీరు ఇలా ఎందుకు చెయ్యరు, అల్ల ఎందుకు చెయ్యరు అని అనడం. హేతు వాదులు ఎందుకు సాయిబాబా లాగా సేవలు చెయ్యరు అంటే మరి సాయి బాబా కి తేరగా దబ్బులు వస్తున్నాయి కాబట్టీ, అలా సేవ చేసినట్టు చూపించుకోకపోతే విరాలాలు వసూలు చెయ్యడం కష్టం కాబట్టి సేవలు చేస్తాడు. మరి హేతువాదుల దగ్గర అంత దబ్బు ఎక్కడ ఏద్చింది? ఇలా విమర్షించే వాల్లంతా ఎప్పుడైనా హేతువాద సంఘాలకు ఓ వెయ్యి రూపాయలు విరాలం ఇచ్చారా మరి? ఏ గుల్లోనో లక్ష రూపాయలు వెయ్యమంటే వేస్తారు గానీ?
ఇక మూడో విషయం, ఈ హేతువాద విమర్షకులు ఎప్పుడూ కూడా, హేతువాదులు చెప్పేది ఎందుకు తప్పో చెప్పరు. ఎందుకంటే అవి మూఢ నమ్మకాలు అన్న విషయం వీల్లకు కూడా తెలుసు. అయినా అది ఒప్పుకోవడానికి మనసు రాదు, ఎందుకంటే అది మన అచారం కదా. మన ఆచారాలను వేలెత్తి చూపడానికి వీడెవడు అనేది వీల్ల భావన. అదే వేరే వాల్ల అచారాలను వేలెత్తి చూపిస్తే అది మంచి హేతువాద లక్షనమన్న మాట.

Saturday, 12 December 2009

తెలంగాణా వద్దనే హక్కు ఆంధ్రా వాల్లకు ఎలా వచ్చింది?

సమైక్యాంధ్ర లో తెలంగాణా వాసులకు అన్యాయం జరుగుతుందనేది తెలంగాణా వాసుల అభిప్రాయం. ప్రత్యేక రాష్ట్రం ఎర్పదితే మన వనరులపై మనకే హక్కు ఉంతుంది, ఇక్కది ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి అనేది వాల్ల విశ్వాసం. ఏఎ విశ్వాసం ఇప్పుదు కొత్తగా కేసేఏ యార్ తీసుకొచ్చింది కాదు, ఇది తెలంగానా వాసుల్లో ఎప్పటి నుచో ఉన్న నమ్మకం. కేసీయార్ కేవలం ఈ నమ్మకాన్ని తన రాజకీయ ప్రాభల్యం కోసం వాడుకున్నాడు. కాబట్టి కేసీయార్ నిరాహార దీక్ష, టీఆరెస్ పార్టీ తో సంబంధం లేకుండా తెలంగానా ప్రజలు తెలంగానా కావలని అనుకొంటున్నారు. ఈ డిమాండ్ కి బలాన్ని తీసుకొచ్చినందుకు మనం కేసీయార్ కి క్రెడిట్ ఇవ్వాల్సిండే.


వైఎస్సార్ తెలంగానా పై రకరకాలుగా మట్ల్లడి, ఎతూ తేల్చక దాన్ని ఇన్ని రోజులూ సాగ దీసాడు. పనిలో పనిగా, తన ఐదేల్ల పాలన లో జలయగ్నం పేరుతో, క్రిష్నా, గోదావరీ జలాలను రాయలసీమ, ఆంధ్రా లకు తరలించి తెలంగానా ప్రజల నోత్లో మట్టి కొట్టె ప్రయత్నం చేసాడు. ఇప్పుడు ఆయన చావుథో ఈ ఉద్యమం మల్లీ ఓ కొలిక్కి వచ్చింది.


ఇక్కడ నేను చెప్పాలనుకొనేదేంటంటే, తలంగానా ను ఇవ్వొద్దు, అంతా కలిసి సమైక్యాంధ్ర లా ఉండాలనే హక్కు ఆంధ్రా వాసులకు ఎలా వచ్చింది? ఏ ప్రాంత ప్రజలకు ఆ ప్రాంతాన్ని ఎలా పాలిచాలో నిర్నయించుకునే హక్కు ఉంది. తెలంగానా కలిసి ఉండాలో, వద్దో నిర్నయించాల్సింది తెలంగానా వాల్లే.


ఒక ఉమ్మడి కుటుంబం లో నలుగురు అన్నదమ్ములు కలిసి ఉంటున్నారనుకుందాం. అందులో ఒక్కడికి మిగతా వాల్లు తన సంపాదన దోచుకుంటున్నరనే ఫీలింగ్ ఉంటే వాడు విది పోతాడు. విడిపోవద్దనే హక్కు మిగతా సోదరులకు ఉండదు. విడి పోతే ఆస్తులు ఎలా పంచుకోవాలో మాత్రమే అంతా కలిసి నిర్నయించుకోవలి, కనీ విడిపోవలో వద్దో నిర్నయిచే హక్కు మాత్రం వాల్లకు ఉందదు. మరలాంటప్పుడు సమైక్యాంధ్ర కావాలని ఆంధ్రా వాల్లు గిడవ చెయ్యడం లో అర్ధం ఏమిటి?


ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ తో కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసాడు. అప్పుడు అరవ వాల్లందరూ వద్దు, విడిపోవద్దు, మనమంతా కలిసి సమైక్య మద్రాస్ లా కలిసి ఉండాలి అంటే మన వాల్లు వింటారా? అలా విడిపోవద్దని ఉద్యమం చేసే హక్కు అరవ వాల్లకు అప్పుడు ఉండేదా?


అసలు గొడవంతా హైదరాబాద్ తో వచ్చింది. హైదరాబాద్ లేక పోతే తెలంగానా కూడా ఎప్పుడో ఏ చ్త్తీస్ ఘర్, ఉత్తరాంచల్ లాగానో వెరు అయ్యేది, కానీ ఇక్కడ హైదరాబాద్ ఉండడం వల్ల ఆంధ్రా వాల్లు ఈ డిమాండ్ ను పడనీయడం లేదు. హైదరాబాద్ తో పాటు ఇక్కడ విలువైన కోల్ మైన్స్, ఫారెస్ట్ సంపదలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది విడిపోవడం ఆంధ్రా వాల్లకు మిగుడు పడడం లేదు. ఒక వేల తెలంగానా కాకుండా రాయలసీమ వాల్లు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే అప్పుడు ఈ ఆంధ్రా వాల్లు వద్దంటారా? పోతే పోనీ ఈ ఫాక్షనిస్టుల గొడవ వదులుద్ది, ఇక్కడ కరువు తప్ప మ్నకింఖెం ఒరుగుతుంది అనుకొంటారు.


అంతే మరి, ఉమ్మడి కుటుంబం లో కూడ సంపాదించే వాడు విడిపోతే గొడవ కానీ, సంపాదించని వాడు వెల్తాంటే ఎవరూ వద్దనరు మరి.

Sunday, 6 December 2009

బాబా గారి సేవలు

సత్య సాయి బాబా భక్తులపై జాలితో..

ఆవె!!

నాది గాని సొమ్ము నాకేల పట్టెరా
ఇంత సేవ సేతు, ఎంతొ వెనుక వేతు !
సేవ ముసుగు లోన సేపిస్తి మర్డర్లు
భక్తులంచు సెక్సు భ్రష్టు జేస్తి!!

రాజ్యమేలు వాడు రాంబంటు నాముందు
దేవుదంచు నేను దోచుకుందు
మేధ వర్గమంత మోసగాడన్నునూ
ప్రూవు చెయ్యు వాదు పుట్ట లేదు !!