Sunday 20 December 2009

సమైక్యాంధ్ర వాదులు చెప్పే రీజన్స్ ఏంటి?

తెలంగాణా ను ప్రత్యేకరాష్ట్రం చేయాలనే డిమాండ్ గత యాభై సంవత్సరాలుగా ఉంది. అలాగే కేసీఆర్ కూడా టీఆరెస్ పార్టీ పెట్టి పది సంవత్సరాలు గదిచిపోయింది. ఇంతకాలం ఆంధ్రా ప్రాంతం వారు ఎవ్వరూ కూడా సమైక్యాంధ్ర కావాలని ఉద్యమించిన వాల్లు లేరు. అల్లాగే కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన పది రోజుల్లో కూడా ఏ ఆంధ్రా నేతా తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నమని చెప్పలేదు. అంతే కాకా వీల్లంతా కూడా అఖిల పక్ష సమవేషంలో ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన తెస్తే సమర్ధిస్తామనో, లేక అధిష్టానానికి కట్టుబడి ఉంటామనో మరోతో చెప్పారు.

ఇప్పుడు ఆంధ్రా నాయకులంతా ఒక్కసారిగా తాము సమైక్యాంధ్ర కోరుతున్నామని చెబుతున్నారు. ఏదేమైనా ఈ సమైక్యవాదులు కలిసి ఉండడానికి తాము చెప్పే కారణాలు ఏంటి? అవి ఎంతవరకూ సమర్ధనీయం?

1. కలిసి ఉంటేనే అభివ్రుధ్ధి సాధ్యం.

- కాస్త బుర్ర ఉన్న వాడికి ఎవడికైనా ఇది తప్పు అని తెల్సిపోతుంది. కలిసి ఉంటేనే అభివ్రుద్ధి జరిగితే మొత్తం దేశం అంతా కలిసి ఉండిపోవచ్చు కదా? రాష్ట్రాలుగా విభజించడం దేనికి?

- ఆంధ్రా సెపరేట్ అయితే దానికి ఒక కాపిటల్ సితీ తయారవుతుంది. అప్పుడు అక్కడ పరిశ్రమలు, మిగతా అభివ్రుద్ధి జరుగుతుంది. కొత్త ప్రభుత్వ ఉద్యొగాలు తయారవుతాయి.

2. హైదరాబద్ ను ఆంధ్రా వాల్లే అభివ్రుద్ధి చేసారు.

- ఇందులో నిజానిజాలు పక్కన పెడితే అసలు ఈ వాదన వీల్ల ప్రేమ హైదరాబాద్ మీద తప్ప కలిసి ఉండడం కాదని అర్ధమవుతుంది.

3. హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న ఆంధ్ర వాల్ల సంగతేంటి? వాల్ల ఆస్తులకు రక్షన ఎలా ఉంటుంది?

- మద్రాస్ లొ మనవాల్లు లక్షలకొద్ది ఉన్నారు ఇప్పటికీ. వాల్ల ఆస్తులను ఎవరైన లాక్కున్నారా? అసలు హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాల్లు తెలంగాణాని సమర్ధించినపుడు ఈ వాదన ఎంత సబబు?
4. మనమంతా తెలుగు భాష మాట్లాడి వాల్లమే. తెలుగు అన్నా, ఆంధ్రము అన్నా ఒకటే.

-అవును నిజమే. మనమంతా మాట్లాడెది తెలుగే. అలా అని అంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని ఎక్కడ రూల్ ఉంది? హిందీ మాట్లాడే ప్రజలు పలు రాష్ట్రాలుగా విడివిడిగా లేరా?

5. అసలు తెలంగాణా ప్రజలంతా సమైక్యాంధ్ర కావాలనుకుంటున్నారు. ఇది కేవలం రాజకీయ నాయకుల కుట్ర.

- ఇదే నిజమయితే ఒక్కచోట కూడా తెలంగానాలో సమైక్యాంధ్రకు అనుకూలంగా ఒక ర్యాలీ కానీ, ఒక సభ కానీ, లేక నిరాహారదీక్ష కానీ ఎవరైనా చేసారా?

సమైక్య వాదులారా. బహుషా నా అభిప్రాయం తప్పు కావొచ్చు. నేను మీ వాదనలో ఏదయినా మిస్స్ అవుతున్నానేమో. కొంచెం మీ వాదన ఏమిటో చుబుతారా? ఈ ఆంధ్రా వాల్ల సమైక్య వాదన తెలంగాణా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెల్తుంది. ఆంధ్రా వాల్లు నిజంగానే తమ వనరులను దోచుకుంటున్నారు, ఆంధ్రా వాల్లు సొంత వనరులతో ఒక రాష్ట్రంగా ఉండలేరు అనుకొంటున్నారు. ఇది తప్పు అని చెప్పాలంటే ఆంధ్రా వాల్లు తమ వాదన ఏవిధంగా సమర్ధనీయమో ఖచ్చితమయిన వివరన ఇవ్వాలి.

13 comments:

  1. ఆంధ్రా వాళ్ళను తిట్టాద్దంటే...ఎందుకు తిట్టవద్దో చెప్పండి. నిజంగానే వాళ్ళంతా లఫ్‌‌డాగాళ్ళే. వాళ్ళకు అనుకూలంగా రాస్తేనో, వాళ్ళకు భయపడితేనో ప్రచురిస్తారు.ఎందుకంటున్నానంటే నేను
    http://groups.google.co.in/group/teluguseva/browse_thread/thread/2f7ec45a2bbb843f?hl=en

    అనే గుగుల్ గ్రూప్‌‌లో కొన్ని ప్రశ్నలు సంధించా. ఒక్కటి కూడా తిట్టుకాని,తిరస్కారంకాని లేదు. అయినా..వారికి అనుకూలంగా లేవని వాటిని ప్రచురించ లేదు. ఇది వారి నీచబుద్ధిని, సమైక్య రహస్యాన్ని బయట పేడుతలేదా?

    ReplyDelete
  2. 1)ఎ రాష్ట్రాలు ఎందుకు:
    పరిపాలనా సౌలభ్యం కోసం
    1)బి: విడిపోతే కొత్త రాజధాని ... పరిశ్రమలు... అభివృద్ధి:
    మరి మీరు ఒప్పుకుంటున్నారా? హైదరాబాదు కి కొస్తా-సీమ ప్రజలు ఎందుకు వచ్చారో? మరి వాళ్ళు కూడా హై.బా పోషణలో భాగస్వాములే అని?
    2) హైదరాబాదు ను అంధ్రావాళ్ళే అభివృద్ధి చేసారు: తప్పు
    హైదరాబాదు ని సీమ-కోస్తా వాళ్ళు కూడా అభివృద్ధి చేసారు: రైటు
    3) మద్రాసులో తెలుగు వాళ్ళు లేరా:
    ఉన్నారు. సెకెండ్ క్లాస్ సిటిజన్స్ లాగా. చెన్నైలో తెలుగువాళ్ళ బాధలు మీకు తెలియవు. విభజన తరువాత, తెలుగు సంస్కృతి అంతరించింది. మిగిలింది వారి ఆస్తులే
    4) తెలుగు వాళ్ళు అందరూ ఒక్కటిగా ఉండాలని రూల్ ఉందా:
    లేదు. అందుకని ఇది విడిపోవడానికి కారణమా?
    5) తెలంగాణా ప్రజలంతా సమైక్యాంధ్రా కవాలనుకుంటున్నారు:
    ఇలా ఎవ్వరూ అనుకోవటంకేదు. ఇప్పుడు తెలంగాణాలో సమైక్య అని చెప్పే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు. కలిసుండాలనుకునే వాళ్ళు నిశ్శబ్దంగా మాత్రమే ఉన్నారు.

    ఎందుకు సమైక్యంగా ఉండాలి:
    విడిపోవడానికి కారణాలు చెప్ప్చ్చు. వివక్ష, దోపిడీ, దారుణం, కుట్ర, అవహేళణ అని చెప్పడాం చాలా సులువు. అతి సులువు గా, అలోచించనవసరంలేకుండా నమ్మ దగినవి.

    ఎందుకు సమైక్యంగా ఉండాలి అంటే? వ్యవస్థలో లోపాలున్నా, ఉంటే ఎందుకు మంచిది అని చెప్పడానికి, ప్ర్జలు మూందు ఆలోచించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ వారు బద్ధకస్తులు.

    ప్రజలకి బోధప్రచాలి. చాలా మంది బ్లాగర్లు ఇక్కడ చేస్తున్న పని అదే. జల్లెడా లోనో, కూడాలి లోనో చూడండి.

    సమైక్యవాదులు తెలంగాణా వెనుకబాటుపై ఉద్యమానికి వ్యతితేకులు కాదని, విభజనకి వ్యతిరేకులని మీరు గమనించాలి

    ReplyDelete
  3. చదువరి గారు ఈ టపాలో చాలా చక్కగా విశ్లేషించారు.. మీ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయ్ అందులో..
    http://chaduvari.blogspot.com/2009/12/blog-post_19.html
    అలాగే సోమ శేఖర్ గారు చెప్పినట్టు, సమైక్య వాదులు తెలంగాణా వెనుకబాటు తనం పై ఉద్యమానికి వ్యతిరేకులు కానే కాదు.. విభజన పేరు తో ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించాలని కుట్ర పన్నే నాయకులకి వ్యతిరేకులు...

    ReplyDelete
  4. చదువరి గారి బ్లాగు చదివాను. ఆయన చెప్పేది తెలంగాణా నాయకులు చవటలు, మంచినీటి ప్రాజెచ్టులకోసం వాల్లెప్పుడూ నొరుమెదపలేదు. అది నిజమే కావొచ్చు. అయితే అది ఏ విధంగా సమైక్యాంధ్ర నినాదాన్ని సమర్ధిస్తుంది? కలిసి ఉండడానికి మీరు చెప్పే కారణాలు ఎమిటి?

    ReplyDelete
  5. రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్‌ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

    ReplyDelete
  6. విభజన జరిగినంత మాత్రానా ప్రజలమధ్య అగాధం ఏవిధంగా వస్తుంది? ఇప్పుడు కర్ణాతకకు, ఆంధ్రాకు మధ్య పెద్ద అగాధం ఉందా? మనం మన పనులకోసం, ఉద్యోగాలకోసం బెంగులూరు వెల్లడం లేద, వాల్లు రావడం లేదా? ఈ అగాధం అనేది ఒక అనవసర భయాన్ని ప్రజలలో క్రియేట్ చెయ్యడం మాత్రమే.

    ఇక పోతే తెలంగాణా కాంగ్రెస్ నాయకులు చవటలే కావొచ్చు..వాల్లెప్పుడూ తెలంగణా కోసం పెద్దగా గొంతు విప్పక పోవచ్చు..తెలంగాణా బాగు కంటె అధికారంలో ఉన్న వాడి మెప్పు కోసమే పని చేసి ఉండవచ్చు. అల్లగని చెప్పి విడిపోతే అభివ్రుద్ధి జరగదని అనుకోవడం తప్పు. ఏ ప్రభుత్వంలో నయినా ముఖ్యమంత్రిగా ఉన్నవాడిడె చెల్లుతుంది. ముఖ్యమంత్రిగా కాకుండా ఒక మంత్రిగానో, ఎమ్మెల్యే గా నో ఉన్నవాడు పెద్దగా ప్రాంతాభివ్రుద్ధికి పని చెయ్యలేడు. అందుకే తెలంగాణా వాల్లు విడిపోతామంటున్నారు.

    ReplyDelete
  7. రహమతుల్ల గారికి
    యానామ్ను ఆంధ్రాలో కలపడం యానాం వాల్లకే ఇష్టం లేదు. వాల్లకు ఇష్టం లేకుండా మనం కావాలనుకుంటె కలపగలమా? అలాగే ఆన్ష్రా తో కలిసి ఉండడం తెలంగాణా వాల్లకి ఇష్టం లేదు. ఆంధ్రా వాల్లు సమైక్యంగా ఉండాలనుకుంటే సరిపోతుందా?

    ReplyDelete
  8. ఇవీ కారణాలుః
    *కోస్తా ఆంధ్రుల భయాలు
    పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు, కోస్తాంధ్రకు ప్రధాన జలవనరులు కృష్ణా, గోదావరి జలాలు. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణాను వేరుచేస్తే కోస్తాఆంధ్ర ఎడారిగా మారుతుంది. తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 256 గ్రామాలు సుమారు లక్ష ఎకరాలు మునిగిపోతాయనే సాకుతో పోలవరం ప్రాజెక్టును కూడా అడ్డుకుంటారు. విద్యుత్తు సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడతాయి, తెలంగాణాలో అత్యధిక సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు తిరిగి తరలివస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.హైదరాబాదులో అధిక ధరలకు కొని కూడబెట్టుకున్న కష్టార్జిత ఆస్తులు చౌకగా అమ్ముకోవాల్సివస్తుంది.
    *తెలంగాణా వాదుల వాదనలు
    ఇది ఆత్మ గౌరవ సమశ్య.మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము.పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు.ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి.కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి.మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.తెలంగాణా ఆంధ్రుల వలస కేంద్రంగా మారింది.ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్రవాళ్ళు ఇక్కడే ఉండి పోటీ చేసి గెలవండి..పొట్టకూటికోసంవచ్చిన వాళ్ళను వెళ్ళీపొమ్మనము గానీ మా పొట్ట కొట్టేటోళ్ళనే వెళ్ళిపొమ్మంటున్నాం.శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.
    *ఐఏఎస్‌ ఐపిఎస్‌ల భయం
    ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారందరిలో ఎక్కువ శాతం కొత్తగా ఏర్పాటు అయ్యే ఆంధ్ర రాష్ట్రా సర్వీసుల్లోకి వెళ్ళాలి.ఒక వేళ గ్రేటర్‌ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లయితే కేంద్ర సర్వీ సులకు చెందిన అధికారులను మూడుగా విభజిస్తారు.హైదరాబాద్‌ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించినట్లయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి లోకి వచ్చేందుకు కేంద్ర సర్వీసు అధికారులు విముఖత చూపుతున్నారు. ఎందుకంటే యూనియన్‌ టెరిటరీ కేడర్‌లోకి వచ్చినట్లయితే ఇకపై వారి బదిలీలన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమవుతాయి. దీని వల్ల హైదరాబాద్‌ యూనియన్‌ టెరిటరీ(కేంద్ర పాలిత ప్రాంతం) నుంచి వేరొక చోటకు బదిలీ కావాలంటే మరొక కేంద్ర పాలిత ప్రాంతానికే బదిలీ కావా ల్సి ఉంటుంది.
    *తెలుగు సినీ పరిశ్రమ భయం
    మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలివచ్చిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు రామకృష్ణ సినీ స్టుడియో, అన్నపూర్ణ సినీ స్టుడియో, రామానాయుడు స్టుడియో, పద్మాలయా స్టుడియో, రామోజీ ఫిలింసిటీ స్టుడియోలు నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జునకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. పద్మాలయా స్టుడియో లోని కొంత భాగాన్ని ఇతరులకు విక్రయించిన వ్యవహారం పై టిఆర్‌ఎస్‌ కోర్టుకెళ్ళింది. తమ ప్రాంతంలో పేదలకు పంపిణీ చేయవలసిన భూములను ఆంధ్రా ప్రాంతానికి చెందిన సినీవర్గాలకు ఇచ్చారన్న వివాదం మొదలయింది.

    ReplyDelete
  9. సోమశేఖర గారికి

    విడిపోవడానికి నిజానికి కారణాలు అక్కరలేదు. ఒక ప్రాతపు ప్రజలు అంతా కలిసి విడిపోవాలని నిర్నయించుకుంటే బలవంతంగా ఆపడానికి ఎవరికీ హక్కు లేదు. దేశాలే విడిపోయాయి, రాష్ట్రాలో లెక్కా.

    కాని, ఒక ప్రాంతపు ప్రజల్ అభీస్టానికి వ్యతిరేకంగా కలిసి ఉండాలని మిగత ప్రాంతపు వాల్లు నిర్నయించాలనుకొన్నప్పుడు అది ఎందుకు సహేతుకమో వాల్లే వివరించాలి.

    ఇకపోతే సమైక్యాంధ్ర కావాలని గోలపెట్టే నాయకులెవ్వరూ కేంద్రప్రభుత్వ నిర్నయం వచ్చే వరకూ కూడా సమైక్యంగా ఉండాలని చెప్పలేదు. ఇప్పుడు అలా చెబుతున్న వాల్లు ఎందుకు కలిసిండాలో చెప్పల్సిన భాద్యత వాల్ల మీదే ఉంది.

    ReplyDelete
  10. ఒకే జాతికి చెందినవాళ్ళని విడగొట్టడానికి చెప్పే కారణాలు, రెండు వేఱువేఱు జాతుల వాళ్ళని విడగొట్టడానికి చెప్పే కారణాలతో సరిపోలవు. ప్రస్తుతం చెలామణిలోకి వచ్చిన తెలంగాణ నినాదం నాయకుల స్వార్థం వల్ల, ఆంధ్రప్రాంతీయుల ప్రగతి పట్ల అసూయ వల్ల వచ్చినటువంటిది. దీని మూలం అసూయా, అకారణద్వేషం కనుక విడిపోయాక అవి ఇంకా ఎక్కువవుతాయే తప్ప తగ్గే ప్రశ్న లేదు. ఎప్పుడూ తెలంగాణని ద్వేషించనివారిని కావాలని బాధపెట్టి రెచ్చగొట్టి వారి నిరసనకి తెలంగాణవారు పాత్రులవుతున్నారు. ఇది తెలంగాణవారికి దీర్ఘకాలంలో మంచి చెయ్యదు. వ్యక్తిగత సంబంధాల్ని బాగుచెయ్యొచ్చు. ఒక జనాభాకీ మఱో జనాభాకీ మధ్య సంబంధాలు చెడిపోతే వాటిని బాగుచెయ్యడం అసాధ్యం. పొఱుగున శత్రువుల్ని సృష్టించుకొని మనశ్శాంతిగా బతకడం కష్టం. ఈ దూరదృష్టి తెలంగాణవారిలో దారుణంగా లోపించింది. ఆంధ్రప్రాంతీయులు సంయమనం వహించడం వల్లనే రాష్ట్రం ఈ మాత్రం ప్రశాంతంగా ఉంది. భవిష్యత్తులో ఈ సంయమనం ఇలాగే కొనసాగుతుందనే నమ్మకం లేదు.

    ReplyDelete
  11. @LBS
    తెలంగాణా ప్రాంతం వాల్లేమీ ఆంధ్రా ప్రాంతపు వనరులను లాక్కోవాలనుకోవడం లేదే, అసూయ దేనికి? వాల్ల ప్రాంతపు వనరులపై న్యాయమైన హక్కుకోసం విడిపోవాలనుకోవడం తప్పెలా అవుతుంది?

    ReplyDelete
  12. @రహమతుల్ల

    విడిపోయాక తెలంగాణా వాల్లేమీ ఆంధ్రా వాల్ల నీటిని తాము తీసుకోలేరు కదా. వాల్లకు న్యాయంగా చెందాల్సిన షేర్ ను మాత్రమే తీసుకుంటారు. మీరు చెప్పింది నిజం..ఇది ఆంధ్రా వాల్లకు ఇష్టం లేదు. తెలంగాణా వాల్ల న్యాయమైన వాటా ను వాల్లకు ఇవ్వడం ఇష్టం లేదు..అందుకే తెలంగాణా వాల్లు విడిపోతామంటున్నారు మరి.

    ReplyDelete
  13. సోమశెఖర గారికి
    హైదరాబాద్ అభివ్రుద్ధి లో ఆంధ్రా వాల్లు, తెలంగాణా వాల్లు, గుజరాతీలు, మార్వాడీలు ఇంకా అనేక మంది భగస్వాములు. వాల్లంతా అలాగే ఉంటారు. అలాగే బెంగులూరు, మద్రాసు, ధిల్లీ, పునే, షోలాపూర్ లాంటి అనేక నగరాల అభివ్రుద్ధికి తెలుగు వాల్లు కారనం. వాల్లు అక్కడె అలాగే ఉంటారు. అలాగని అక్కడి తెలుగు వాల్లు ఆ నగరాలను తమకే ఇవ్వాలని డిమాండ్ చేయరు.

    ఇకపోతే ఇంతకూ ఎందుకు కలిసి ఉండాలో మీరు ఎక్కడా చెప్పలేదు.

    ReplyDelete