Wednesday 23 December 2009

ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?

ఎలాగైతేనేం, ఆంధ్రా వాల్లు వాల్లకి కావలిసింది సాధించారు. చిదంబరం తో అన్ని పక్షాల ఏకాభిప్రాయం సాధించిన తరువాత మాత్రమే తెలంగాణా ఇస్తామని చెప్పించారు. పది రోజుల ధర్నాల వల్ల నయితేనేమి, నిరాహార దీక్ష ద్రామాలవల్లనైతే నేమి వత్తిడి తెచ్చి తెలంగానా ప్రక్రియ ప్రస్తుతానికి ఆపించారు.
అయితే ఏకాభిప్రాయం సాధించడమంటే తెలంగానా ఇవ్వమడం సాధ్యం కాదు అని చెప్పడమే అలి తెలిసిన ఆంధ్రా వాల్లు సంబరాలు చేసుకుంటున్నారు. యాభై యేల్లుగా రానీ ఏకాభిప్రాయం, పదేల్ల టీఆరెస్ ఉద్యమంతో రాని ఏకాభ్ప్రాయం ఇప్పుడు వస్తుందా? అయినా దోచుకుని తినే వాడు ఎవడైన ఆ దోపిడిని అపేద్దాం అంటె ఒప్పుకుంటాడా?

17 comments:

  1. విడిపోయిన దేశాలే కలవగలిగినప్పుడు, విడిపోవాలన్నా, కలిసుండాలన్న ఎకాభిప్రాయానికి రావాలన్న చిత్తశుద్ది రెండు ప్రక్కల ఉండాలే కాని రావటం కష్టమా?
    కాకపోతే తెలంగాణా కావాలనుకొనేవాళ్లు తెలంగాణా అభివృద్ది కంటే, హైదరాబాద్ ఆదాయాన్ని నొక్కెద్దాము అన్న స్వార్ధం, అలాగే కలసివుండాలనే వాళ్లు హైదరాబాద్ ప్రస్తుతం నొక్కేసి, భవిషత్తులో మా నోట్లో మన్నుకొడతారా అన్న అనుమానం ఉన్నంతకాలం ఎకాభిప్రాయం రాదు అంతే!!!
    ముందు kcr లాంటి నోటి దురద గాళ్లను తీసిపక్కంబెట్టి, హైదరాబాద్ అందరదే పంచుకోవటానికి ఏమీ ఇబ్బంది లేదని అనమనండి, అప్పుడు కనీసం చర్చలు ఎక్కడొ అక్కడ మొదలూవుతాయో లేదో చూడండి !!

    ఇక యాభై ఏళ్లు, యాభై ఏళ్లు అంటున్నారు, నిజంగా తెలంగాణా యాభై ఏల్లుగా ఉద్యమం గా ఉందా? 1970 ల నుండి, kcr రాజకీయ నిరుద్యొగి గా మారే నంతవరకూ దాని గురించి అంత గొప్పగా ఎవరయినా మాట్లాడారా? అంతెందుకు 1969 కి ముందు (చెన్న రెడ్డి నిరుద్యొగిగా మారకముందు) తెలంగాణా గురించి ఎంతమంది ఉద్యమం చేసారు?

    ఇక ప్రజల అకాంక్ష అంటారా, తెలుగు ప్రజలు అందరూ కలసి ఉండాలనే అకాంక్ష వందల ఏళ్ళు గా ఉంది కాబట్టి సమైఖ్యాంధ్రా ది వందల ఏళ్ల ఉద్యమం అందామా?

    ముందు అన్నిటికంటె, తెలంగాణా వెనకబడిఉందో, వెనకబడిలేదో నిజాలతో (జిమ్మిక్కులు లేకుండా) నిరూపించాల్సిన బాధ్యత ప్రబుత్వానికి ఉంది. అలాగే వెంకబడిన ప్రాంతాలన్నిటినీ గుర్తించి సమానం గా, అభివృద్ది చెయాల్సిన బాద్యత కూడా ప్రబుత్వానిదే. 22 జిల్లాలను విస్మరించి అభివృద్దీంతా హైదరాబాద్ లో చేయటం కూడా ఆపి, దానికి తగ్గట్టుగా వేరే చోట్లని అభివృద్ది చేయాల్సిన బాధ్యత కూడా ప్రబుత్వానికి ఉంది. పైనవి జరిగినప్పుడు విడిపోవాలన్నా, కలసిఉండాలన్న ఎవ్వరికీ ఇబ్బంది ఉండదెమో అలోచించండి, అప్పటివరకూ ఇది kcr లాంటి కేతి గాళ్లు, వానికి పోటీగా జగడపాటి లాంటి వాళ్లు ఆడే ఆట మాత్రమే. ఇందులో చివరకు సమిధలు అవుతుంది సామాన్య జనం, కుంటుపడుతున్నది మన రాష్ట్ర అభివృద్ది మాత్రమే.

    ReplyDelete
  2. తెలంగాణా రాష్ట్రం కోసం కాకుండా తెలంగాణా అభివృద్ధి కోసం మాట్లాడితే ఏకాభిప్రాయం వుంటుంది.

    ReplyDelete
  3. హైదరాబాదుని అందరూ కలిసి పంచుకుంటే ఎకాభిప్రాయం వస్తుందని మీరు చెప్పడమే చెబుతుంది, సమీక్యవాదుల అసలు కారనం హైదరాబద్, సమైక్యత కేవలం నాటకమని. ఇక హైదరాబద్ పంచుకోవడానికి వస్తువు కాదు కదా. అది కనీసం బార్డర్ లో కూడ లేకుండా తెలంగాణా మధ్యలో ఉంది. అంతే కాక అసలు ఆంధ్రప్రదేష్ ఫాం కాకుముందు నుంచే హైదరాబాద్ తెలంగానా రాజధాని.

    కేసీఆర్ రాజకీయ నిరుద్యోగి కాదు.. ఆయన ఉద్యోగమే తెలంగాణా తేవడం. రాజకీయ నిరుద్యోగులు ఇప్పుడు చిరంజీవి, జగడపాటి, జగన్. వీల్లంతా సమైక్యం పేరుతో ఇప్పుడు మైలేజీ పెంచుకోవడానికి ప్రయతం చేస్తున్నారు.

    ఇక ఏకాభిప్రాయం విషయానికి వస్తే, అన్ని రాజకీయ పార్టీలు ఎకాభిప్రాయం ఇచ్చిన తరువాతే, తెలంగాణా ప్రకటన ఇవ్వడం జరిగింది. రోజుకో మాటలు చెప్పే వాల్లున్నప్పుడు ఏ రొజు అభిప్రాయాన్ని ఏకాభిప్రాయంగా తీసుకోవాలి?

    ReplyDelete
  4. తెలంగానాలో అన్ని పార్టీలూ తెలంగానా ఇస్తామనే వోట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు అంతా రాజీనామ చేసి మల్లీ ఎలక్షన్లు వస్తే వీల్లు ఏ ముఖం పెట్టుకుని వోట్లడుగుతారు?

    ReplyDelete
  5. @ కిరణ్
    మీరు అన్నట్లే ఎన్నికలు గనుక వస్తే సమైక్యాంధ్ర ముఖం పెట్టుకొని అడుగుతారు. ఇప్పుడెన్ని ఓట్లు వస్తాయో దానిని బట్టి అంతా స్పష్టమవుతుంది కదా. కంగారెందుకు.

    ఎప్పటి ఏకాభిప్రాయం ముఖ్యం అంటరా? అప్పుడెప్పుడో యాభయ్, అరవై ఏళ్ళ క్రితం పెద్ద మనుషులు ఏకాభిప్రాయం సాధించారే దానిని ప్రామాణికంగా తీసుకుందామా మరి?

    ReplyDelete
  6. @శరత్కాలం
    మీరేకదా తెలంగానా వాదులని కాష్మీర్ తీవ్రవాదులతో పోల్చింది!!ఇంకా నయం మద్రాస్ నుండి విడిపోదాం అన్నందుకు అమరజీవి పొట్టి శ్రీరాములును ఒసామా బిన్ లాడెన్ తో పోలచలేదు. తమరి పరిగ్నానానికి జోహార్లు.

    ReplyDelete
  7. @ కిరణ్
    హి హి. థాంక్స్ - నా జ్ఞానాన్ని గుర్తించినందుకు :)

    ReplyDelete
  8. ఇకపోతే యాభై ఏల్లకింద నెహ్రూయే చెప్పాడు..ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోవచ్చని. అయినా మీకవన్నీ ఎందుకు వినిపిస్తాయి? ఏదో తెలంగానా వాదుల బ్లా బ్లా లు.

    ReplyDelete
  9. Karan K . I don't know about telangana people before this telagana movement. but in the recent past I understood how you guys hate telugu people. now all telugu people got the same feeling . and now onwards you all real pakistanis to andhra people. No telugu ( telangana's are no more telugu people) people will accept your comments.

    ReplyDelete
  10. @Mady

    Your comment shows your ignorance, hatred and racist attitude. If someone asks for their right, it makes you think them as terrorists.

    For this very reason telangaana people don't want to live together with aandhra people.Grow up, hope one day you will learn how to respect other's culture.

    ReplyDelete
  11. It is very easy to point your fingers to others for your own problems.

    not sure why andhra people were threatened and attacked in telangana region ( you can tell who is racist now ).
    To be frank no telugu have feeling to stay with telagana with recent telagana attitude.
    I personally pray the god for a separate AP.

    ReplyDelete
  12. @ hope one day you will learn how to respect other's culture.
    Do you mean by burning others property, supporting KCR statements, using foul language and calling it as part of your own culture, by banning your own language song.......

    good going buddy, keep it up :)

    ReplyDelete
  13. ఏక అబిప్రాయం ఎలా సాద్యం?....ఆంధ్ర కి 180 mandi MLA lu తెలంగాణాకి 110 MLA lu తో సాద్యమా? మరో సారి తెలంగాణా ప్రజలను ఆంధ్ర నాయకుల మోసగించడం తద్యం?

    ReplyDelete
  14. @Mady

    Andhra people were not threatened, infact aandhra people in telangana are happy to be separated with telangana state. Only the shootings of those film stars whose fathers supported samaikyandhra were stopped.

    And the buring of andhra messes in hyderabad, as everyone knows it was the handwork of andra/seema gundas sponsored by their seema leaders.

    ReplyDelete
  15. @Krishna

    Why didn't you say the same when thousands of RTC buses are damaged in andhra sofar and crores of BSNL property burnt to ashes?

    ReplyDelete
  16. Just a correction "thousand buses " are not damaged in Andhra..only 8 buses were partially damaged ( this info by IG Anuradha) ..none were burnt...any how its loss to AP state ..Govt may ask to pay more tax to recover all this...we all need to pay..we are the loosers..enlight ur mind my dear frnd..

    ReplyDelete
  17. ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదనలుః

    * మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.

    ReplyDelete