Thursday, 23 December 2010
తొంభై ఐదేళ్ళ యువకుడు
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మన్ గారు 1956లొ ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాతి మొట్టమొదటి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్ర మంత్రిగా విభిన్న ప్రభుత్వాలలో పనిచేసిన ఈ నేత 1969లో తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశి ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. ఆదిలాబాద్ వాస్తవ్యుడైనప్పటికీ నల్లగొండ జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిఘ్యం వహించారు. తెలంగాణా ప్రజా సమతి ఫౌండింగ్ మెంబర్ కూడా అయిన కొండా లక్ష్మన్ గారు నేటికీ అదే ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.
సుమారు నలభై ఏళ్ళుగా తెలంగాణా ఆశయం కోసం పనిచేసిన కొండా లక్ష్మన్ గారు టీఆరెస్ పార్టీ ఆఫీసు కోసం తన నివాస గృహాన్ని అద్దె లేకుండానే ఇవ్వగా అక్కసుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాంక్‌బండ్ పక్కన ఉన్న వారి ఇంటిని అధికారబలంతో రాత్రికి రాత్రి నేలమట్టం చేయించాడు.
తన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పైలట్‌గా పని చేసి విమాన ప్రమాదంలో మృతి చెందగా మరో కొడుకు అమెరికాలో ఉంటూ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. తొంభై ఏల్ల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న బాపూజీ గారు ఈ వయసులో కూడా ఉద్యమానికి సంబంధించి ఎవరు ఏ సమావేశానికి ఆహ్వానించినా తప్పకుండా వెలుతారు. ఈ తొంభై అయిదేళ్ళ యువకుడి ఉద్యమస్ఫూర్తికి నా జోహార్లు.
Saturday, 18 September 2010
Wednesday, 25 August 2010
"రహస్య గూఢాచారి aka కణిక నీతి" (డా విన్‌చీ కోడ్ కు స్వేచ్చానువాదం)
ఆ తరువాత వరుసగా భీమోజి ఫిల్మ్ సిటీలో ఒక తోట మాలీ, తానియా గాంధీ సెక్యూరిటీ వాడూ, కిద్వానీకి అంట్లు తోమే వాడూ, టాటా కారు డ్రైవరూ అంతా ఒకేసారి హత్య కావించబడుతారు.
తనపై వచ్చిన నేరారోపణని తుడిచేయడం కోసం, ఈ నాలుగు హత్యల రహస్యం తెలుసుకోవడం కోసం హీరోయిన్ అయిన కుట్రకోణాల స్పెషలిస్టూ ప్రయత్నం చేస్తుంది. తన పరిశోధనలో తెలిసేదేమంటే భారత దేశం ఆర్ధిక, రాజకీయ, ఇతిహాసాలపై నాలుగు వందల సంవత్సరాలుగా ఒక మహా కుట్ర జరుగుతుంటుంది. ఈ కుట్ర ఒక కణిక వ్యవస్థ నడుపుతుంటుంది. వీరంతా ఒక నెట్ వర్క్ లాగా ఏర్పడి తరతరాలుగా ఈ రహస్యాన్ని తరువాతి తరాలకి అందిస్తూ ఉంటారు.
వీరి కుట్ర యొక్క రహస్యం ఇంకో రహస్య గ్రూపుకి తెలిసి ఉంటుంది. ఈ రెండో రహస్య గ్రూపు కణిక వ్యవస్థలో ఒక్కొక్కరి ఇంటిలో పని వారు గానూ, వాచ్మన్, కారు డ్రవరుల్లాగా ఉంటారు. కణిక వ్యవస్థ నాయకుడైన భీమోజీకి ఈ రహస్యం తెలిసి ఒక కాంట్రక్ట్ కిల్లర్ ద్వారా అందరినీ ఒకే సారి చంపేస్తాడు. ఇప్పుడు ఆ రహస్యం తెలిసిన వారంతా చనిపోయారు, మరి మన కధానాయకురాలు ఈ రహస్యాన్ని ఎలా చేదిస్తుంది?
ఈ రహస్యాలను తెలిసిన భీమోజీ పత్రికలోని ఒక రిపోర్టర్ చిన్న చిన్న క్లూలను మనకు అందిస్తూ ఉంటాడు. అవి న్యూస్ హెడ్డింగులు గానూ, కార్టూన్ల రూపంలోనూ, అంతర్యామి లాంటి కాలంలలోనూ కనిపిస్తూ ఉంటాయి.
మధ్యలో ఫ్లాష్ బాక్ లో హీరోయిన్ హీరో ల సంభాషణ ద్వారా తెలిసేదేమంటే ఈ కణిక నెట్‌వర్క్ ఇప్పుడు మొదలు కాలేదు, బ్రిటిషు వారు ఇండియాను ఆక్రమించుకోవడానికీ, ఇందిరా గంధీ, రాజీవ్ గాంధీ ల హత్యలకీ, 911 సంఘటనకీ అన్నింటికీ మూలం ఈ కణిక వ్యవస్థే. త్వరలో విడుదల, గొప్ప అద్భుత థ్రిల్లర్.
Saturday, 31 July 2010
తెలంగాణా విద్యార్థి ఆత్మహత్య - మూఢ నమ్మకాల ఫలితం
Friday, 23 July 2010
శ్రీక్రిష్ణ కమిటీకి లోక్‌సత్తా చత్త నివేదిక
Sunday, 18 July 2010
లాజికల్ కన్సిస్టెన్సీ టెస్టు
దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయంపై ఎవరి ఫిలాసఫికల్ స్టాండు వారిది. అయితే తమ తమ స్టాండులో ఎంత కన్సిస్టెంటుగా మనుషులు ఉండగలరు? ఈ క్రింది టెస్టు వారి లాజిక కన్సిస్టెన్సీని టెస్టు చేస్తుంది. మీరూ ట్రై చెయ్యండి
Can your beliefs about religion make it across our intellectual battleground?
In this activity you’ll be asked a series of 17 questions about God and religion. In each case, apart from Question 1, you need to answer True or False. The aim of the activity is not to judge whether these answers are correct or not. Our battleground is that of rational consistency. This means to get across without taking any hits, you’ll need to answer in a way which is rationally consistent. What this means is you need to avoid choosing answers which contradict each other. If you answer in a way which is rationally consistent but which has strange or unpalatable implications, you’ll be forced to bite a bullet.
http://www.philosophersnet.com/cgi-bin/god_game1.cgi?num=0&hits=0&bullets=0&bulletcount=0&hitcount=0
Saturday, 5 June 2010
ఆడిన మాట తప్పకూడదా?
Friday, 4 June 2010
దేవుడి అస్తిత్వంపై పాస్కల్ వేజర్
Sunday, 30 May 2010
జగన్‌కి వరంగల్‌లో ఓదార్పు యాత్ర చేసే హక్కు ఉండాలా?
Friday, 28 May 2010
మేధావులు పాలనకు అసమర్ధులా?
Wednesday, 26 May 2010
అబద్దానికి పరాకాష్ఠ - ఓదార్పు యాత్ర జరగదేమోనని హఠాన్మరణం
Monday, 24 May 2010
నాస్తికవాదం కూడా ఒక నమ్మకమేనా?
Saturday, 22 May 2010
దోషం మతంలో ఉందా లేక మనిషిలో ఉందా?
Saturday, 24 April 2010
దొరికితేనే దొంగ బాబా!!
ఒక్క వీడియోతో ఒక్కసారిగా ఎన్నో కొత్త కేసులు బయటికి రాసాగాయి. నిత్యానంద ఆశ్రమాల మీద దాడులవల్ల ఆయన రాసలీలలపై ఎన్నో ఆధారాలు బయట బడ్డాయి.
అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మన దేశంలో నిత్యానంద ఒక్కడే కాదు, ఇంకా ఎందరో దొంగ స్వాములు, దొంగ బాబాలూ తామే దేవుళ్ళమని చెప్పుకుని వెర్రి జనాలని మోసగిస్తున్నారు. ఇంకా ఎక్కువ విరాళాలు సేకరిస్తున్నారు, ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆశ్రమాలమాటున ఎన్నో ఇల్లీగల్ చర్యలకు పాల్పడుతున్నారు. వారిని టచ్ చేసే ధైర్యం మీడియాకి గానీ, న్యాయవ్యవస్తకి గానీ ఇంకా రాలేదు.
పోనీ ఈ ఇతర బాబాలమీద ఇప్పటివరకూ ఆరోపణలు ఏమీ లేవా అంటే అలా కాదు. వీరిపై నిత్యానందపై వచ్చిన ఆరోపణలకంటే పెద్ద ఆరోపణలు ఎన్నో వచ్చాయి. మరి ఎందుకు ఎవరూ వీరి గురించి అడిగే సాహసం చెయ్యరూ అంటే కారణం వారు నిత్యానంద లాగా అడ్డంగా దొరికిపోలేదు. వారిపై ఇంతకుముందు వచ్చిన వీడియోలు నిత్యానంద లాగ క్రిస్టల్ క్లియర్గా కనపడలేదు. అందుకే ఈ బాబాలెవరూ పూర్తిగా దొరకక దొంగ బాబాలుగా కాక నిజం బాబాలుగా చలామనీ అవుతున్నారు.
మొత్తానికి నిత్యానంద ఎపిసోడ్ ఫలితంగా మీడియాలో దొంగ బాబాలగురించిన వార్తలు గత నెలరోజులుగా పెరిగాయి. అయితే ఇవి కేవలం ఏ కాళేశ్వర్ బాబా లేక మరో చోటా మోటా బాబాకో మాత్రమే పరిమితమయ్యాయి. అంతే కానీ తాము దేవుళ్ళ అవతారాలుగా చెప్పుకునే బడా బాబాల జోళికి మీడియా వెల్లలేక పోయింది.
నిత్యానంద ఎపిసోడ్ కంటే కొద్దిరోజులు ముందుగా కల్కి అమ్మ భగవాన్ గురించిన వార్తలు కొన్ని చానెల్స్లో వచ్చాయి. ఆ వార్తలలో చూపించినది మీడియా సొంత ఇన్వెస్టిగేషన్ కాదు, కొంతమంది మాజీ భక్తులు కల్కి బాగోతాన్ని వీడియో తీసి మీడియాకి ఇచ్చారు.
నిజానికి కల్కి భగవాన్ పైన వచ్చిన అరోపణలు నిత్యానంద కంటే సీరియస్ ఆరోపణలు. నిత్యానంద కేవలం ఒక సినీ తారతో రాసలీలలు జరిపి దొరికిపోయాడు. ఇది చట్టపరంగా నేరమేమీ కాదు. కాని ఆ వీడియో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పోలీస్ వ్యవస్థ కూడా రంగంలోకి దిగింది, చివరికి నిత్యానందని అరెస్టు చేశారు. అయితే కల్కి భగవాన్ భక్తి పేరుతో భక్తులను మత్తుమందులకి బానిసలు చేస్తున్నట్లు, భక్తులతో మత్తులో ముంచి కామక్ర్రిడలు చేస్తున్నట్లు ఆరోపణలు. అయినా కల్కి భగవాన్ పైన ఎలాంటి చర్యా తీసుకోబడలేదు.
ఇక సత్య సాయి, ఆసరం బాపు, బాల సాయి లాంటి బాబాల జోలికి చట్టం కాదు కదా, వారిని తప్పు పడితే సగం మంది బ్లాగరులే మన మీదికి దాడి చేస్తారు. మరి ఈ బడా దొంగబాబాలు దొరికేదెప్పుడు?