Friday, 23 December 2011

సామల సదాశివ మాస్టారుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

‘స్వర లయలు’వ్యాస సంపుటికి దక్కిన గౌరవం
సంగీతం విని స్వర లయలు రాసి
మారుమూల పల్లె నుంచి ఎదిగిన మహారచయిత
పలు భాషల్లో అందెవేసిన చెయ్యి
సంతోషంగా ఉందన్న సరస్వతీ పుత్రుడు
ఇది తెలంగాణకే అవార్డు

musal-talangana patrika telangana culture telangana politics telangana cinemaఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 21(టీ న్యూస్): దశాబ్దాల సాహితీ సేద్యానికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ మాగాణ ప్రతిభ మరోసారి దేశాన తలెత్తి నిలిచింది. అడవి బిడ్డల ఒడిలో పుట్టిన కలం అక్షరాలను సానపడుతున్న తీరుకు జాతీయ అవార్డు ఆదిలాబాద్‌కు నడిచివచ్చింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు డాక్టర్ సామల సదాశివ మాస్టారును కేంద్ర ప్రభుత్వం ఈ యేడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేసింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత నేపథ్యంలో ఆయన రాసిన ‘స్వరలయలు’ పుస్తకానికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఫిబ్రవరి 14న ఈ అవార్డును ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. తెలుగు, ఉర్దూ, పార్శీ తదితర భాషల్లో సాహిత్యానికి ఆయన చేస్తొన్న కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం విశేషం. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్8 చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన రాజీవ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010 సంవత్సరానికి కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయనను వరించింది. అవార్డును అందించిన ఈ పుస్తకాన్ని వేద్‌కుమార్ సారథ్యంలోని చెలిమి ఫౌండేషన్ ప్రచురించింది.

మరాఠీ సంగీతం వినీ వినీ స్వర లయలు రాశాను
అవార్డు రావడం సంతోషంగా ఉంది. అయితే నేను ఎప్పుడు అవార్డుల కోసం ఏదీ రాయలేదు... ఇనాం కేలియే నహీ లిక్తా... (బహుమతుల కోసం రాయను ) స్వరలయలను మరాఠాలో సూరానిలయ్ అంటారు. మరాఠీ సంగీతం వినీ వినీ స్వరలయలు రాశాను. చాలా సంతోషం. గత రెండేండ్ల క్రితమే అవార్డు వస్తుందని ఒక అభిమాని చెప్పాడు. యాద్ జిందగీ హై... సంతోషం 
- సామల సదాశివ

తెలంగాణ ఆణిముత్యం, సరస్వతి ముద్దుబిడ్డ సదాశివ
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పుట్టి పెరిగిన సాహితీవేత్త సామల సదాశివకు జాతీయ సాహిత్యఅకాడమీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణకే ఆణి ముత్యంగా గుర్తింపు తెచ్చుకున్న సదాశివ పండితుల, పామరుల నుంచి కూడా అభినందనలు అందుకుంటున్నారు... ఈ ఆణిముత్యం తెలంగాణ మాగానంలోని మారుమూల దహెగాం మండలం తెనుగుపప్లూలో జన్మించి జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. 2011, మే 11న 84 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వైతాళికుడి శిష్యులు, అభిమానులు, అనుచరులు అక్షర కుసుమాలతో ఘనంగా నీరాజనం పలుకుతూ ఆయనను సాహిత్యం ద్వారా వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు... సదాశివ కావ్యసుధ పేరుతో ఆ రచనలను గ్రంథస్తం చేశారు. మూడు సంవత్సరాల క్రితం ఈ గ్రంథంను కాగజ్‌నగర్ పట్టణంలో ఆయన శిష్యులు ఘనంగా ఆవిష్కరించారు. సాహితీ లోకంలో సామల సదాశివ గురించి తెలియని వారుండరు.

పుట్టింది మారుమూల తెనుగుపప్లూలో...
సామల సదాశివ దహెగాం మండలంలో తెనుగుపప్లూలో 1928, మే 11న జన్మించారు. ఆయన తల్లిదంవూడులు సామన నాగయ్య పంతులు,చిన్నమ్మలు. ఎంఏ, బీఎడ్, డీ లిట్ చదివారు. డైట్ కళాశాల, ఆదిలాబాద్ ప్రిన్సిపాల్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్థుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆయన నివసిస్తున్నారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఫారసి, మరాఠీ భాషలలో ఆయన పాండిత్యాన్ని సాగించారు. ఉర్దూ, ఫారసీ, హిందీ, మరాఠీ భాషలకు చెందిన ప్రసిద్ధ కవుల, రచయితల సాహిత్యాన్ని ఆయన అనువదించారు. మూడు వేల వ్యాసాలు ఉర్దూలోనూ, 450 వ్యాసాలు తెలుగులోనూ రాసి ప్రముఖ దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రచురింపజేశారు. హైదరాబాద్, వరంగల్, కొత్తగూడెం, విశాఖపట్నం, ఆదిలాబాద్, ఆకాశవాణి కేంద్రాల నుంచి అసంఖ్యాకంగా ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ఇచ్చారు.

సామల సదాశివ 1963 నుంచి 1983 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘం సభ్యులుగా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా పని చేశారు. ఆయన చేసిన అంజత్ రుబాయిలు అనువాదానికి 1964లో రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనగా గుర్తించింది. 1968లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం. 1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రతిభా పురస్కారం, 2002లో కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ప్రదానం, 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్8 రాజశేఖర్ రెడ్డి ప్రతిభా రాజీవ పురస్కారం ప్రదానం. 2011, డిసెంబర్ 21న స్వరలయలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన. 

ప్రచురించిన పుస్తకాలు
ప్రభాతము (పద్య సంకలనం), సాంబ శివ శతకము (పద్యాలు), నిరీక్షణము (పద్య సంకలనం), మంచి మాటలు (పద్యాలు), అపశృతి(నవల), ఉర్దూ సాహిత్య చరిత్ర (అనువాదం), అంజద్ రుబాయిలు(అనువాదం), మౌలానా రూమీ మన్నవి (ఫారసీ నుంచి అనువాదం), మీర్జా గాలీబ్ (జీవితం - రచనలు), ఉర్దూ కవుల కవితా సామాగ్రి (కేశవసూత్, మరాఠీ కవి జీవితం ), ఫారసీ కవుల ప్రసక్తి, అర్తి (పద్య కవిత), మలయమారుతాలు(వ్యాసాలు), ఉర్దూభాష కవితా సౌందర్యం (వ్యాస సంపుటి), యాది (జ్ఞాపకాలు), సంగీత శిఖరాలు (వ్యాసాలు) 

ప్రచురించాల్సినవి
రేవతి (నవల), రాముడు( పిలాసఫీ ఆఫ్ రామా), సునోబాయి సాదూ(కభీర్ దోహల అనువాదం), సాహిత్య అవలోకనం (ఉర్ధూ సాహిత్య చరిత్ర), సాకీనామా(పద్యకావ్యం), విశ్వమివూతము(పద్యకావ్యం), సదాశివలేఖలు పాచీన ఆధునిక భాషా సాహిత్య విమర్శ) 


ఇది తెలంగాణకే అరుదైన గౌరవం
ప్రముఖ రచయిత, తెలంగాణ ఆణిముత్యంగా అందరూ భావించే సామల సదాశివగారి రచనకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించడం, అది అతనికే కాక తెలంగాణ గడ్డకే లభించిన అవార్డుగా భావించాలి.

నవల ప్రక్రియకు అరుదైన గౌరవం
కేంద్రసాహిత్య అకాడమీ వెల్లడించిన పురస్కారాల్లో పలుభాషల నవలలు ఉండడం ఈ యేటి విశేషం. జీవితంలో అనేక సంఘటనలను కావ్యంగా మలచడంలో భారతీయ సృజనకారులు చేస్తొన్న కృషిని అకాడమీ గుర్తించింది. ఈ విభాగంలో హిందీ నవలా రచయిత కాశీనాథ్ సింగ్ రచించిన ‘‘రహేనా పర్ రగ్గు’’, కన్నడ రచయిత గోపాలకృష్ణ రచించిన ‘‘స్వప్న సరస్వత’’ నవలలకు ఈ గౌరవం దక్కింది. నవలలతో పాటు పలువరు కవులు రాసిన కవుల కావ్యాలకు అవార్డు ప్రకటించిన అకాడమీ ప్రముఖ కాలమిస్టు రామచంద్ర గుహ రచించిన ‘‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’’ చారివూతక కథనానికి కూడా కేంద్రసాహిత్య అకాడమి అవార్డును ప్రకటించింది.
(నమస్తే తెలంగాణ నుంచి)

Monday, 21 November 2011

పసలేని పరకాలవాదం


మూడు నాల్గు పార్టీలు మారి నాలుగుసార్లు ఎలక్షన్లలో నిలబడి డిపాజిట్టు కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో పరకాల అంటే పెద్దగా ఇంతకుముందు ఎవరికీ తెలియదు. పీఆర్పీలో టికెట్ దొరక్క బయటికి వచ్చి అదోవిషవృక్షం అంటూ పరకాల హడావిడీ చేసినతరువాత మాత్రం కొన్నిరోజులు పరకాలకు టీవీల్లో మంచి పబ్లిసిటీ దొరికింది. ఆతరువాత మల్లీ ఎవరూ పట్టించుకోకపోయేసరికి ఎలాగోలా మల్లీ టీవీ హెడ్లైన్లలోకెక్కాలని ఈమధ్యన విశాలాంధ్ర మహాసభ అంటూ ఒక వెబ్‌సైటు పెట్టుకుని హడావిడీ చేస్తున్నాడు. అసలిది విశాలాంధ్ర మహాసభ కాదు, ఇదొక విషాంధ్ర మహాసభ, వీరికంటూ ఒక వాదం గట్రా ఏంఈలేదు, తెలంగాణా వాదాన్ని, తెలంగాణ ఉద్యమకారులను తిట్టడమే వీరి ఏకైక అజెండా అని జనాలు చెప్పుతున్నారనేది వేరే విషయం.

సరే ఈవెబ్సైటుతో మీడియా వర్క్‌షాప్ గట్రా అంటూ హడావిడీ చేసి తెలంగాణవాదుల్ని రెచ్చగొట్టి ఎలాగయితేనేం పరకాల మల్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎలాగూ పరకాలకు కావల్సిందదే, వార్తల్లోకి ఎక్కడం, పబ్లిసిటీ పెంచుకోవడం. ఇప్పటికే మూడు పార్టీలు మార్చి వెల్తూ వెల్తూ పీఆర్పీని తిట్టిని తిట్లకు ఎలాగూ ఇప్పుడూ ఎవరూ ఈయన్న పార్టీలోకి చేర్చుకోరు.

ఈవిషాంధ్ర మహాసభ వెబ్‌సైటూ, బ్లాగూ నడుపుతూ ఇంతవరకూ సాధించింది ఏంతయ్యా అంటే ఫలానా తెలంగాణ నాయకుడు ఫలానా టైంలో సమైక్యాంధ్రకు జైకొట్టాడు అంటూ పేపర్ కటింగులు పెట్టడం, లేదా తెలంగాణ వాదుల్ని వేర్పాటువాదులు అంటూ తిట్టిపొయ్యడం. మొదట్లో కొన్నిరోజులు అసలు తెలంగాణకు నీటిపారుదలలో ఎలాంటి వివక్షా జరగలేదంటూ లోక్‌సత్తా రిపోర్టును సాక్ష్యంగా చూపుతూ హడావిడీ చేశారు కానీ అవన్నీ తప్పని బ్లాగుల్లో నిరూపించబడడంతో సమాధానం చెప్పలేక నోర్మూసుకున్నారు.

పరకాల ఈమధ్య టీవీల్లో బాగా హడావిడీ చేస్తున్నాడు. పరకాలకు, ప్రొఫెసర్ హరగోపాల్‌కు మధ్యన  మహాటీవీలో ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఆసక్తి కరంగా ఉంది కదా అని నేనూ ఓపిగ్గా అన్ని వీడియోలు చూశాను. లండన్లో పీహెచ్డీ చేసిన ఈమహానుభావుడు ఏంచెబుతాడో చూద్దామంటే అసలు ఎంతసేపూ చెప్పిందే చెప్పి బోరుకొట్టించడం లేకపోతే ఎదుటివారిని ఎగతాళి చెయ్యడం తప్ప ఈయన వాదన శూన్యం. కాలికేస్తే మెడకేస్తాను, మెడకేస్తే కాలికేస్తాను అదే నావాదన అని నిరూపించుకుంటున్న ఈయన ఒకే అర్ధం వచ్చే విషయానికి వరుసగా పది పర్యాయపదాలు చెబుతూ అదే వాదన అని భ్రమ పడుతున్నాడు.

"సమైక్యవాదం ఒక గొప్ప ఉదాత్తమమయిన వాదం, తెలంగాణ అన్నిరంగాలలోనూ ఈఈ సూచీల్లో మిగతా ప్రాతాల్లోకన్నా ముందుంది, తెలంగాణలో లక్షలాది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు." ఇవే విషయాలను పదే పదే వల్లించడం తప్ప ఇంక ముందుకు వెల్లడు, ఆయా వాదనలపై హరగోపాల్ అడిగే సహేతుక ప్రశ్నలకు ఈఅయన దగ్గర సమాధానం ఉండదు, పైగా మల్లీ మల్లీ వేర్పాటువాదుల వాదనలో పస లేదు అంటూ అరవడం. అసలు తెలంగాణవాదుల్ని వేర్పాటువాదులు అని పిలిచేవారినీ, అలా పిలవడాన్ని సమర్ధించే టీవీ చానెల్లను బొక్కలో వెయ్యాలని నా అభిప్రాయం, ప్రస్తుతం ఉన్న సీమాంధ్రప్రభుత్వంలో అది సాధ్యం కాదుగానీ.

జీడీపీలు, తలసరి ఆదాయాలు అభివృద్ధిని చెప్పలేవు, వాస్తవపరిస్థుతులు అలాలేవు. అన్నీ బాగా ఉంటే మరి క్రిష్నా పక్కనే ఉండగా నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య, మహబూబ్నగర్లో కరువు ఎందుకు ఉంటుంది అంటే అందుకు సీమాంధ్ర ఎలా కారణం అంటూ దాటవేస్తాడు. తెలంగాణ అన్ని రంగాల్లో మిగతాప్రాంతాలకంటే చాలా అభ్వృద్ధి చెందిందనే ఈయన వాస్తవపరిస్థుతులు చెబుతుంటే తప్పించుకోవడం ఎందుకు? అక్కడ వాదన మహబూబ్నగర్ ఎండిపోవడానికి సీమాంధ్ర ప్రజలే కారణమని కాదు, ఈయన చెప్పే తెలంగాణ చాలా అభివృద్ధి చెందింది అనేది తప్పని చెప్పడం.

లక్షలాది ప్రజలు తెలంగాణలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అని పదేపదే వల్లిస్తాడు, మరి అందుకు సాక్ష్యం ఏది, ఏదయినా మహాసభ నిర్వహించారా, ర్యాలీ జరిగిందా అంటే సమాధానం ఉండదు. కానీ ఇదిగో నలమోతు తెలంగాణవాడే అని చెబుతాడు. ఆ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టయితే ఈయనకు నలమోతు ఒక్కడే లక్షలాది ప్రజల్లాగా కనిపిస్తున్నారేమో.

సమైక్యభావన గొప్ప ఉదాత్తమమయిన భావన అనేది ఈయన మరో పాయింటు. మరి సమైక్యవాదంలో ప్రజలను సంతృప్తి పరచడానికి ఏదయిన ఆదాయవనరు ఉందా, సమైక్యవాదంలో కలిపిఉంచే అంశమేంటి అనడిగితే దానికీ సమాధానం ఉండదు. ఊరికే మమ్మల్ని సమైక్యవాదం ప్రచారం చేసుకోనీయట్లేదు అంటూ దొంగ ఏడుపులు మాత్రం ఏడుస్తుంటాడు. అయ్యా పరకాలా, నీవాదానికి నిజంగా నువ్వు చెప్పేట్లు లక్షలాది ప్రజల మద్దతు ఉంటే ఒకరు నీవాదాన్ని వినిపించకుండా ఆపలేరు, ప్రజలే నీకు మద్దతుగా వస్తారు, ఇక్కడ ఎవరూ సమైక్యంగా ఉండాలని కోరుకోవట్లేదు కాబట్టే నీకు ఒక మీటింగు పెట్టుకోవడం కూడా గగనమవుతుంది.  నువ్విక్కడీకొచ్చి వేర్పాటువాదులూ లాంటి భాషను ఉపయోగితూ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలను అగౌరవపరచడం రెచ్చగొట్టడం తప్ప మరోటి కాదు, ఈవిషయం నీక్కూడా తెలుసుననుకో, అయినా ఇలా చెప్పాల్సి వస్తుంది.

Wednesday, 16 November 2011

విస్తృత స్థాయి చర్చలు


జూన్ 2011:

తెలంగాణ అంశంపై యూపీయే ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని కాంగ్రేస్ మరియూ ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతుంది. ఇది చాలా సున్నితమైన అంశం, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కనుక ఈవిషయంపై తొందరపాటుతో వ్యవహిరించకుండా అన్నివర్గాలవారి అంగీకారంతో అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటాం.

నవంబరు 2011:

తెలంగాణ అంశంపై యూపీయే ప్రభుత్వం జాతీయస్థాయిలో అందరు యూపీయే భాగస్వామ్య పార్టీలతోనూ మరియూ ఇతర వర్గాలతోనూ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. తెలంగాణ అంశం ఒక్క తెలంగాణప్రాంతానికి సంబంధించిన వ్యవహారం మాత్రమేకాదు, ఇది దేశంలోని అన్ని ప్రాంతాలనూ ప్రభావితం చేసే విషయం. తెలంగాణ డిమాండ్ పరిష్కరిస్తే దేశంలో ఇంకా ఇలాంటి డిమాండ్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కనుక అందరినీ సంప్రదించినతరువాత కీలక నిర్ణయం తీసుకుంటాం.

జనవరి 2012:  

తెలంగాణ అంశంపై యూపీయే ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని పెద్ద దేశాల నేతలతో అత్యంత విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. ఈఅంశానికి సంబంధించి మన విదేశాంగ మంత్రి బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, టాంజానియా దేశాలనేతలతో రాబోయే నాలుగు నెలల్లో కీలక చర్చలు నిర్వహిస్తారు. తెలంగాణ డిమాండ్ లాంటిదే టాంజానియాలోనూ ఒక డిమాండ్ ఉంది, మరియూ ముందు ముందు ఈసమస్యను పరిష్కరిస్తే ఉగాండా, కాంబోడియా లాంటి దేశాల్లో కొత్త డిమాండ్లు ఉత్పన్నమయే అవకాశం ఉంది. కనుక అందరితో చర్చించిన తరువాత ప్రభుత్వం ఒక చక్కని శాశ్వత పరిష్కారాన్ని ప్రకటిస్తుంది.

మార్చి 2013:

ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చలు పూర్తిచేశాం. ఈచర్చలు చాలా వేగవంతంగా పూర్తిచేయగలిగాం, చర్చలు చాలావరకు సత్ఫలితాలనిచ్చాయి. అయితే రాబోయే కాలంలో ఒక్క భూమిమీదే కాక ఇంకా ఎక్కడైనా జీవరాశి ఉంటే అక్కడకూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం యూపీయే ప్రభుత్వం ఏలియన్లతో కూడా చర్చించాలని నిర్ణయించుకుంది, దానికోసం ఒక కమిటీని రూపొందించాం. ఈకమిటీ అసలు భూమండలం కాక ఎక్కడయినా జీవరాశి ఉందా అన్న విషయంపై ముందుగా అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తుంది. ఆతరువాత అక్కడి జీవరాశితో ఒక కమ్యూనికేషన్ చానెల్ను తయారుచేసి సంప్రదింపులు చేయడంకోసం మరో కమిటీని నియమిస్తాం.

మొత్తానికి ఈసమస్య ఎంతో సంక్లిష్టమయిన సమస్య అయినా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా వేగవంతంగా చర్చలు పూర్తిచేయగలిగాం. ఇకముందు కూడా అదేవేగంతో విశ్వవ్యాప్త సంప్రదింపులు పూర్తిచేస్తామని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం.

Tuesday, 8 November 2011

తొంభై ఐదేళ్ళ యువకుడు

సంవత్సరం క్రితం రాసిన టపా..బ్లాగరులకోసం మరొకసారి.

Thursday, 23 December 2010


తొంభై ఐదేళ్ళ యువకుడు

శ్రీ కొండా లక్ష్మన్ బాపూజీ గారు ప్రస్తుత తరం ప్రజలకి అంతగా తెలియని వెనుకటి తరం కాంగ్రేస్ నాయకుడు. తొంభై అయిదు సంవత్సరాలు పైబడ్డ వయసులో కూడా కొండా లక్ష్మన్ గారు తెలంగాణా ఉద్యమంలో అత్యంత చురుగ్గా పాల్గొంటూ అనేక కార్యక్రమాలలో ముఖ్య అథిధిగా, వక్తగా ఉద్యమానికి తోడ్పడుతున్నారు..

స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మన్ గారు 1956లొ ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాతి మొట్టమొదటి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్ర మంత్రిగా విభిన్న ప్రభుత్వాలలో పనిచేసిన ఈ నేత 1969లో తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశి ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నారు. ఆదిలాబాద్ వాస్తవ్యుడైనప్పటికీ నల్లగొండ జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిఘ్యం వహించారు. తెలంగాణా ప్రజా సమతి ఫౌండింగ్ మెంబర్ కూడా అయిన కొండా లక్ష్మన్ గారు నేటికీ అదే ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.

సుమారు నలభై ఏళ్ళుగా తెలంగాణా ఆశయం కోసం పనిచేసిన కొండా లక్ష్మన్ గారు టీఆరెస్ పార్టీ ఆఫీసు కోసం తన నివాస గృహాన్ని అద్దె లేకుండానే ఇవ్వగా అక్కసుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాంక్‌బండ్ పక్కన ఉన్న వారి ఇంటిని అధికారబలంతో రాత్రికి రాత్రి నేలమట్టం చేయించాడు.

తన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పైలట్‌గా పని చేసి విమాన ప్రమాదంలో మృతి చెందగా మరో కొడుకు అమెరికాలో ఉంటూ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు. తొంభై ఏల్ల వయసులో కూడా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న బాపూజీ గారు ఈ వయసులో కూడా ఉద్యమానికి సంబంధించి ఎవరు ఏ సమావేశానికి ఆహ్వానించినా తప్పకుండా వెలుతారు. ఈ తొంభై అయిదేళ్ళ యువకుడి ఉద్యమస్ఫూర్తికి నా జోహార్లు.

Thursday, 3 November 2011

వంచన దోపిడీ పునాదులుగా (నాటకం) -2


సీన్ - 3

టెంట్ హౌజ్ నుండి తెచ్చి వేసిన ఒక షామియాన కింద సంజీవ్, ప్రకాశ్, బ్రహ్మానంద్, గోపాల్ కూర్చుని మంతనాలు చేస్తుంటారు. పక్కనే కాస్త దూరంగా కొందరు మేకలు కాసుకునేవారు మాట్లాడుకుంటూ వీల్లే మన ముఖ్యమంత్రీ, మంత్రులూ నంట, ఈషామియానాలోనే మన పెబుత్వం నడుస్తుందంట నీకు తెలుసా అని చెవులు కొరుక్కుంటుంటారు.

సంజీవ్:                 శ్రీరాం గాడి చావు పుణ్యమా అని రాష్ట్రం, పదవులూ అయితే దక్కాయి గానీ ఏమిటీ విధి వైపరీత్యం? షామియానాలకింద అసెంబ్లీలూ, సెక్రెటేరియట్లూనూ!!

ప్రకాశ్:                  నా పరిస్థితి అయితే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. ఇంతకుముందు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతూ క్రిష్ణా రామా అంటూ ఉండేవాడిని. ఇప్పుడు ముఖ్యమంత్రినయ్యాను గానీ ఒక అసెంబ్లీ లేదు, ఒక కారు లేదు. ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు జీతాలడుగుతున్నారు, ఇద్దామంటే ఒక్క పైసా లేదు.

గోపాల్:                ఇప్పుడేం చేద్దాం?

బ్రహ్మానంద్:          ఇలా ఎక్కువరోజులు భరించలేం, ఏదో ఒకటి చేసి ఈపరిస్థితినుండి బయట పడాలి. కేంద్రం ఏమన్నా డబ్బిస్తుందంటావా?

గోపాల్:                కేంద్రామా నా బొందా, ఒక చిప్ప ఇస్తుంది.

ప్రకాశ్:                ఎలాగోలా మనం భాగ్యనగర్‌ను దక్కించుకున్నామంటే మన కష్టాలన్నీ తీరిపోయి మల్లీ భాగ్యం చేతికొస్తుంది. దానికోసం ఏం చెయ్యాలో మార్గాలు వెతకాలి.

గోపాల్:               మనదగ్గర రాజధాని కాదు గదా ఒక జిల్లాను పరిపాలించడానికి కూడా సరిపోయే నగరం ఒక్కటంటే ఒక్కటి లేదు.

సంజీవ్:             మరెందుకాలస్యం? తొందరగా భాగ్యనగర్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుదాం. అక్కడ మిగులు బడ్జెట్ కూడా ఉందంట. మన కష్టాలన్నీ తీరిపోతాయి.

బ్రహ్మానంద్:           మనం కలవమంటే వాల్లు కలుస్తారా? మన సంగతి తెలిసినవారు ఎవరైనా మనల్ని నమ్ముతారంటావా?

సంజీవ్:           వాల్లు మనల్ని నమ్మరనేది నిజం, కానీ ఎలాగయినా నమ్మించాలి మరో మార్గం లేదు.

ప్రకాశ్:             ఐదుగురు పెద్దమనుషులను కూర్చోపెట్టి పంచాయితీ పెడదాం వాల్లేం అడిగితే అది ఒప్పుకుని సంతకాలు పెడదాం. అమలయేనాటికి ఎవడు బతికుంటాడో, ఎవడు చస్తాడో ఎవరికి తెలుసు?

సంజీవ్:           ఈ ఐడియా బాగానే ఉంది గానీ ముందు ఢిల్లీ ఒప్పుకుంటుందా?

ప్రకాశ్:            నీకన్నీ అనుమానాలే. మనం గట్టిగా లాబీయింగ్ చెయ్యాలి గానీ ఢిల్లీని ఒప్పించడం పెద్ద కష్టమా?

గోపాల్:           మరి అక్కడి ప్రజలసంగతో? వారు ఇందుకు అస్సలు ఒప్పుకోరు. మొదట్నుంచీ మన జనాలు వాల్లను తక్కువగా చూస్తారనీ, వాల్ల యాసను వెక్కిరిస్తారనీ వారికి తెలుసు కదా?

ప్రకాశ్:           అందరం తెలుగువాల్లమే అనీ, తెలుగు జాతి ఐక్యత అనీ ప్రచారం చెయ్యాలి. తెలుగుతల్లి విగ్రహాలు ఊరూరా పెట్టాలి. మన శ్రీరాం గాడి బొమ్మను కూడా అక్కడ ఊరూరా పెడదాం. మెల్లగా జనాలు దారికొస్తారు.


Wednesday, 2 November 2011

పొట్టి శ్రీరాములు గురించి తెలంగాణవాదిగా!!

ఈమధ్యన కొందరు తెలుగు బ్లాగరులు తెలంగాణవాదులు పొట్టిశ్రీరాములును ద్వేషిస్తున్నట్టూ, అవమానిస్తున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములుపై తెలంగాణవాదులకు ఎలాంటి ద్వేషం లేకపోగా ఒక గాంధేయవాదిగా, తాను నమ్మినదానికోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా గౌరవం ఉంది. తెలంగాణవాదులు ఎక్కడా పొట్టి శ్రీరాములును ద్వేషించలేదు, దూషించలేదు. కొండకచో కొందరు ఆవేశపూరిత ఉద్యమకారులు పొట్టి శ్రీములు విగ్రహాలను తొలగించడానికి ప్రయత్నం చేసినా అది పొట్టి శ్రీరాములుపై కోపం కాదు, తెలంగాణవాదుల కోపం కేవలం తమప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని తమ ప్రాంతంలో ఊరూరా (హైదరాబాద్ మాత్రమే కాదు, ప్రతి జిల్లాలో అని గమనించాలి) ప్రతిష్టించి తమ అభిజాత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం పైనా, చరిత్రను వక్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు పొట్టిశ్రీరాములుకు ముడిపెట్టడం పైనా.


ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందుగా దీక్ష చేసింది గొల్లపూడి సీతారాం. అతని దీక్ష తరువాత కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంది. ఆతరువాత పొట్టి శ్రీరాములు దీక్ష చేసింది మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలి అనే ప్రధాన డిమాండ్‌తో కాగా అతని డిమాండ్ తీరకుండానే పొట్టి శ్రీరాములు గతించారు.

నిజానికి ఎలాగూ దక్కదని తెలిసీ మద్రాసు నగరం కోసం పొట్టి శ్రీరాములును దీక్షకు ఉసిగొల్పిందీ, అతను దీక్షకు పూనుకుంటే ఈడిమాండ్ నెరవేరడం కాష్టమని చెప్పి  దీక్ష విరమణకోసం ప్రయత్నం చెయ్యనిదీ ఆంధ్ర నాయకులే. దీక్ష చివరిరోజుల్లో అపస్మారక స్థితిలో ఉండి తన స్వంత నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు విరమింపజేయాల్సింది ఆంధ్రనాయకులే అయినా వారు దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. ఈవిధంగా పరోక్షంగా పొట్టి శ్రీరాములు మృతికి కారణం ఆంధ్ర నాయకత్వమే.

ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఆంధ్రరాష్ట్ర ఉద్త్యమానికి ముందు పొట్టి శ్రీరాములు ఒంటరిగా దళిత అభ్యున్నతికై ఉద్యమిస్తూ రోడ్డుపై బ్యానర్ పట్టుకుని  కాల్లకు చెప్పుల్లేకుండా తిరుగుతుంటే ఏఆంధ్రా నాయకులూ అతనికి సహకారం ఇచ్చిన పాపాన పోలేదు. అప్పుడు ఆంధ్రా ప్రజానీకమే పొట్టి శ్రీరాములును పిచ్చివాడికింద జమకట్టి అవమానించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతరువాత ఒక్కసారిగా పొట్టి శ్రీరాములు హీరోను చేసి ఆంధ్రాకంటే కూడా ఎక్కువ విహ్రహాలను తెలంగాణలో ప్రతిష్టించింది కూడా ఆంధ్రా నాయకులే. పాఠ్యపుస్తకాల్లో పొట్టి శ్రీరాములు మూలంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనే అర్ధం వచ్చేలా పాఠాలు చొప్పించిందీ ఆంధ్రా నాయకత్వమే. పొట్టి శ్రీరాములు ఆత్మ నేడు ఎవరిచర్యలవల్ల క్షోభిస్తుందో!!

ఇప్పుడు తెలంగాణవాదులు మాకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు మాప్రాంతంలో వద్దు, చరిత్రను వక్రీకరించి నవంబరు ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణకు, పొట్టి శ్రీరాములుకు ముడిపెట్టొద్దంటే తెలంగాణవాదులను ద్రోహులు అంటూ అవాకులు పేలుతున్నదీ ఆంధ్రా నాయకులూ, బ్లాగరులే.పొట్టి శ్రీరాములు విగ్రహానికి దండేయాల్సింది నవంబరు ఒకటిన కాదు, అక్టోబరు ఒకటి రోజు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ గూర్చి.



వంచన, దోపిడీ పునాదులుగా (నాటకం) -1

సీన్-1:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ కలిసి గదిలో మంతనాలు చేస్తున్నారు
.
సంజీవ్:                భజగోవిందం, భజగోవిందం. అంతా అయిపోయింది. ఆఖరుకు ఎమ్మెల్యే పదవి కూడా దక్కలేదు. ఈకమ్యూనిస్టులు చెయ్యబట్టి సొంత నియోజకవర్గంలో ఓడిపోయాను. ఇంతబతుకూ బతికి ఇంటెనుక చచ్చినట్టు ముఖ్యమంత్రినవుదామని కలలు గంటే ఎమ్మెల్యేగిరీ దక్కలేదు.

బ్రహ్మానంద్:  నాపరిస్థితి కూడా సేం టు సేం. నేనెవరితో చెప్పుకునేది?

గోపాల్:         బాగుంది వరస. నేను మాత్రం ఎమన్న ఎక్కువ బావుకున్నానా? నేనూ మీవంతే. ఇంగ్లీసోడి చదువులు చదువుకున్నందుకు ఇన్నాల్లూ కాంగ్రేస్ పార్టీలో నాయకత్వం వెలగబెట్టాము గానీ ఇప్పుడా ఇంగ్లీసోడు వెల్లిపొయ్యాక మన ఇంగ్లీసుకు విలువ లేదు. సొంతనియోజక వర్గంలో ప్రజలు మనల్ని నమ్మడం లేదు. ఇప్పుడేం మార్గం?

గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్:      ప్రకాశ్, నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు. నువ్వు చక్కగా మంత్రి పదవి వెలగబెడుతున్నావుగా?

ప్రకాశ్:       నాగోడెవరితో చెప్పుకునేది? ఈ రాజా ఢిల్లీకి వెల్లినవాడు అక్కడే ఉండక వెనక్కొచ్చి ముఖ్యమంత్రి పదవి లాగేసుకున్నాడు. మనకు ఇక బతికుండగా ముఖ్యమంత్రి పదవి దక్కడం కష్టం.

సంజీవ్:      అయితే ఇప్పుడు ఏమిటి సాధనం?

ప్రకాశ్:        దీనికొక్కటే మార్గం ఉంది. మనం వెంటనే మనకో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేద్దాం. ప్రజల్లో మల్లీ పలుకుబడి వస్తుంది. ఒకవేళ రాష్ట్రం గానీ వస్తే గిస్తే మనం ముగ్గురం ముఖ్యమంత్రి పదవులు పంచుకోవచ్చు.

బ్రహ్మానంద్: మనం ఉద్యమం చేస్తే ఎవరు నమ్ముతారు? పోనీ నిరాహార దీక్షలూ గట్రా చేద్దామంటే మనకసలే అలవాటు లేదాయే?

ప్రకాశ్:          మన చేతికి మట్టంటించుకోవడం ఎందుకు? ఏదారే పోయే శ్రీరాం గాన్నో దీక్షకు కూర్చోపెడితే సరి, చస్తే వాడే చస్తాడు. పదవులు మనం కొట్టేయొచ్చు.

సంజీవ్:        బాగుంది ఈ ఐడియా. మరి ఎప్పుడు మొదలెడుదాం?

గోపాల్:    ఆలస్యం అమృతం విషం, శుభస్య శీఘ్రం. 

సీన్- 2:
ప్రకాశ్, గోపాల్, సంజీవ్, బ్రహ్మానంద్ గదిలో తీవ్రంగా వాదులాడుకుంటున్నారు.

సంజీవ్:           ముఖ్యమంత్రి పదవి నాకే దక్కాలి. లేకపోతే నేను నామద్దతు విరమించుకుంటాను. మా ప్రాంతం కొత్తరాష్ట్రంలో కలవనివ్వను.

గోపాల్:            నేనొప్పుకోను, నాకే దక్కాలి. నీక్కావాలంటే ఉపముఖ్యమంత్రి పదవి తీసుకో.

ప్రకాశ్: మీరు కాస్త ఊరుకోండి. వయసు పైబడ్డవాన్ని. ఈసారికి నన్ను ముఖ్యమంత్రిని కానివ్వండి. తరువాత మీఇష్టం.

పక్కగదిలో నుంచి బలహీనంగా మాటలు వినిపిస్తున్నాయి. "ఆకలి. ఆకలి. నాక్కాస్త అన్నం పెట్టండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నాకింకా ఈదీక్ష వద్దు. కాస్త అన్నం పెట్టండి, వచ్చేజన్మలో మీకడుపులో పుడతాను."

గోపాల్:              చచ్చేట్టున్నాడు. ఏం చేద్దాం? కాస్త తిండి పడేద్దామా?

సంజీవ్:             పైవాడు ఇంకా మన ఉద్యమానికి పూర్తిగా స్పందించలేదు. ఇప్పుడు దీక్ష విరమిస్తే ఎలా?

ప్రకాశ్:              అవున్నిజమే. ఇప్పుడు తిండి ఇవ్వొద్దు.

పక్క గదిలో నుండి దబ్బుమని కింద పడ్డ శబ్దం. ముగ్గురూ అక్కడికి వెల్తారు.

సంజీవ్:             చచ్చినట్టున్నాడు. ఇప్పుడేమిటి చెయ్యడం?

ప్రకాశ్:               ఇదే మంచి అదును. మన వాల్లకు చెప్పి అల్లర్లు చేయిద్దాం. బెజవాడ, నెల్లూరు, వైజాగ్ అన్నీ ఒక్కసారి అదిరిపోవాలి. ఈదెబ్బకు కేంద్రం దిగి రావాలి.




Tuesday, 1 November 2011

జీడీపీలు సులభంగా పెంచండిలా!!

జీడీపీ, తలసరి ఆదాయాలగురించి వినని వారుండరు. చిన్నప్పుడు మనందరం సోషల్ పుస్తకాల్లో దేశాల ఆర్ధిక స్థితులను పోల్చడానికి ఈ ఇండెక్స్‌లు వాడడం చూసేఉంటాం. జీడీపీ (Gross Domestic product) ఒక ప్రాంతంలో ఒక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని సూచిస్తే తలసరి ఆదాయం ఆప్రాంతంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని సూచిస్తుంది.

ఈసూచీలు ఇంకా అనేక ఇతర సూచీలతో కలిపి చూసి మనం రెండు దేశాల ప్రజల జీవన ప్రమాణాలని పోల్చవచ్చు. అయితే statistics మీద అవగాహన లేనివారు వీటిని ఇష్టం ప్రకారం ఉపయోగిస్తే మొదటికే మోసం వస్తుంది. తలసరి ఆదాయం ఒక ప్రాంతంలో మనిషియొక్క సగటు ఆదాయాన్ని చెపుతుంది కానీ అక్కడ ఉన్న ఆర్ధిక అసమానతలు, బీదా బిక్కీ ప్రజల స్థితి తెలియదు. అందుకే మనదేశంలో వెనుకబడిన జిల్లాల పట్టీ తయారు చేసేప్పుడు మన కేంద్రప్రభుత్వం జీడీపీలూ, తలసరి ఆదాయాలు తీసుకోదు, అక్కడి కూలీ రేట్లు, వ్యవసాయం, జీవనోపాధి మార్గాలు, లిటరసీ రేట్లు లాంటి ఇతర ఇండికేటర్లను తీసుకుంటారు. 

ఉదాహరణకు ఫలానా జిల్లాలో తలసరి ఆదాయం బాగా తక్కువగా ఉందనుకోండి. అక్కడ నిజమైన అభివృద్ధి జరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే చాలా శ్రమించాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాలి, వ్యవసాయం నీటిపారుదలలో అభివృద్ధి సాధించాలి ఇంకా ఎన్నో సాధించాలి. అయితే ఇవన్నీ చేయకుండా కూడా చాలా సులభంగా ఆజిల్లా ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచొచ్చు. ఎలాగంటారా లగడపాటి, కావూరు, జగన్, చంద్రబాబు లాంటి కొందరు బడా బాబులను అక్కడి జనాభా లెక్కల్లో నమోదు చేస్తే సరి. వారి ఆదాయం కూడా అక్కడి ప్రాంతం లోకే వస్తుంది కాబట్టి తలసరి ఆదాయం అమాంతంగా పెరిగిపోతుంది.

ఇక జీడీపీ ఎలా పెంచాలంటారా? వెనుకబడిన ప్రాంతంలో ఎలాగూ వ్యవసాయభూములు తక్కువధరకు దొరుకుతాయి. అక్కడ కొన్ని భూములను ప్రభుత్వం లాగేసుకుని ఒక SEZ కట్టిందనుకోండి, అప్పుడు జీడీపీ అమాంతంగా పెరిగిపోతుంది. ఆSEZలో లోకల్ ప్రజలు   ఎలాగూ ఉండరు, అప్పటికే అభివృద్ధి సాధించిన ప్రాంతాల్లో విద్యావకాశాలు, చదువుకునే స్థోమత ఎక్కువ ఉంటాయి కనుక అక్కడివారే పెద్ద ఉద్యోగాలు ఎలాగూ చేజిక్కించుకుంటారు. కంపనీ ఎలాగూ అభివృద్ధి చెందిన ప్రాంతం వారే పెడతారు కాబట్టి కీలక పదవుల్లో అంతా వారి చుట్టాలో పక్కాలో అభివృద్ధి చెందిన ప్రాంతం వారే ఉంటారు.  చప్రాసీ ఉద్యోగాలకు కూడా తమ ప్రాంతంలోనే ఉన్న వెనుకబడిన వర్గాలను తెచ్చుకుంటే సరి. అంటే వెనుకబడిన ప్రాంతంలో ఒక్కరి ఆదాయం కూడా పెంచకుండానే అక్కడి జీడీపీని అమాంతం పెంచవచ్చు. అయినా బలిసిన వారు ఎక్కడన్నా తాముండే ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకుని తమప్రాంతంలో కాలుష్యం పెంచుకుంటారా మన పిచ్చిగానీ?

మరి బ్లాగుల్లో జీడీపీలూ, తలసరి ఆదాయాల లెక్కలు చూపించి తెలంగాణాయే అభివృద్ధి చెందిందని చెప్పే చౌదర్లకు ఇవన్నీ తెలియవా అంటే అన్నీ తెలుసు. కానీ చదివేవాల్లని అందర్నీ అమాయకులకింద జతకట్టేసి ఇలాంటి అవాకులు రాస్తుంటారు. ఇలాంటి అబద్ధపు రాతలు రాయడం ఎందుకు? రాష్ట్రం కలిసుంటే వీరికేం లాభం అంటారా? అదో చిదంబర రహస్యం. సమైక్య రాష్ట్రంలో వీరిది చాలా బలమయిన లాబీ. వ్యాపారాలు, రాజకీయాలు, మీడియా అన్నీ వీరిచేతుల్లోనే ఉంటాయి. విడిపోతే తెలంగాణా, మరీ ముఖ్యంగా హైదరాబాదు వీరి చేతుల్లోంచి బయటికి పోతుంది, అక్కడి కాంట్రాక్టులు వీరి వర్గం వారికి రావు అనేదే వీరి బాధ.

ఎవరి బాగుకై సమైక్య?



తేగీ!!
ఆరు వందల పదిజీవొ అమలుకాదు,
సాగునీటిపై దోపిడీ సమిసిపోదు
నిధుల తరలింపు ఆగదు నేటివరకు
ఎవరి బాగుకై సమైక్య? ఏది నీతి?

Thursday, 20 October 2011

ఇద్దరన్నదమ్ముల కథ

అనగనగా ఒక ఊర్లో ఇద్దరన్నదమ్ములు. అన్న ఏపని చేసేవాడు కాదు. ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. తమ్ముడు అదో ఇదో పనిచేసి సంపాదిస్తే వచ్చిన డబ్బుతో కుటుంబం గడిచేది. సంపాదించేది తమ్ముడయినా పెద్దవాల్లు కాబట్టి ఇంట్లో అన్నా, అన్న భార్యల పెత్తనమే సాగేది.గంపెడు చాకిరీ చేస్తే తమ్ముడి భార్యకు తినడానికి కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు.

తమ్ముడి పెల్లయినప్పుడు తమ్ముడి భార్యకు అరణంగా పుట్టింటివారు ఒక ఆవును ఇచ్చారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆవు పెద్దదయి బాగానే పాలిస్తుంది. అయితే పాలన్నీ అన్న పిల్లలే తాగేవారు. తమ్ముడి పిల్లలకు పాలూ, పెరుగు దొరికేవి కావు. ఇంట్లో ఒక దానిమ్మ చెట్టుండేది. ఆ దానిమ్మ పల్లు కూడా అన్ని అన్న పిల్లలే తినేవారు. కాలం గడుస్తున్నకొద్దీ సరైన ఆహారం దొరక్క తమ్ముడు, తమ్ముడి భార్యా పిల్లలూ బక్కచిక్కిపొయ్యారు. దాంతో వీరికంటే బలంగా తయారయిన అన్న పిల్లలు ఇంకాస్త దౌర్జన్యం చేసే వారు, తమ్ముడి పిల్లలను గేలిచేసేవారు.


కొన్నాల్లకు వల్లుమండిన తమ్ముడి భార్య  భర్తతో మనం దోపిడీకి గురవుతున్నాం, ఇలాగయితే కష్టం, ఉమ్మడి కుటుంబంలో తమకు ఇబ్బందిగా ఉంది, విడిపోదామని తెగేసి చెప్పింది. ఊర్లో పెద్దమనుషుల పంచాయితీ పెట్టి ఇలా నామొగుడు పనిచేసి సంపాదిస్తున్నా మాకు సరిగ్గా తిండి కూడా దొరకట్లేదు, అందుకే విడిపోవాలనుకుంటున్నామని చెప్పింది.


అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్కగా తింటున్న అన్నకుటుంబానికి ఈపరిణామం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అమ్మో విడిపోతే రేపటినుంచి తాను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అని అన్న అనుకున్నాడు. అమ్మో ఇప్పుడు ఉన్నపళంగా విడిపోతే నాఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోవాలి ఎలాగా అని అన్న  భార్య అనుకుంది. అమ్మో ఇప్పుడు చక్కగా ఆవు పాలూ, పెరుగు తాగుతున్నాం, విడిపోతే ఈ ఆవు మనకు దక్కదు అని అన్న పిల్లలనుకున్నారు. అంతా కలిసి ఎలాగయినా తమ్ముడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలనుకుని తామూ విడిపోడానికి వీల్లేదంటూ పద్దమనుషులదగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలయింది.


అదేంటి, మేం విడిపోవడానికి వీల్లేదంటూ చెప్పే హక్కు మీకెక్కడుంది? కలిసుండాలా విడిపోవాలా అని నిర్ణయించుకునే హక్కు మాకుంది. మేం విడిపోతామంటే సొమ్ములు ఎలా పంచుకోవాలనే విషయంపై పంచాయితీ పెట్టాలి గానీ విడిపోవాడానికి వీల్లేదంటూ పంచాయితే పెడితే ఎలా అంటూ తమ్ముడు నోరుబాదుకున్నాడు. మనది ఒకే వంశం, ముందు నుండీ కలిసే ఉన్నాం, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇదంతా ఆపక్కింటి ఎల్లయ్యగాడి కుట్రగని లేకపోతే విడిపోవాలనే పాడు బుద్ది నీకెలా వస్తుంది? అంటూ అన్న ఎదురు ప్రశ్న వేశాడు.


"చూడు తిండిసరిగా దొరక్క నాడొక్క ఎలా ఎండిపోయిందో? ఇన్నాల్లూ నాసంపాదన మీరు దోచుకున్నారు, ఇక మీతో కలిసి ఉండడం నాకు సాధ్యం కాదు" అంటూ వల్లుమండిన తమ్ముడు చెప్పాడు. అమ్మో అమ్మో మీ సంపాదన మేం దోచుకున్నామా? మమ్మ్మల్ని దోపిడీ దొంగలంటావా? ఇల్లాగయితే నిన్నస్సలు విడిపోనివ్వం అంటూ అన్న భార్య హుంకరించింది.


నీడొక్క ఎండిపోతే దానికి మేమెలా భాద్యులం? నీసమస్యకు మమ్మల్ని కారణమంటావేం అంటూ అన్న లాజిక్ పెట్టాడు. నాసమస్యకు కారణం నువ్వనడం లేదు, అసలు నాసమస్యే నువ్వు అందుకే విడిపోతున్నాం. తమ్ముడు బుర్ర గొక్కుంటూ సనిగాడు.


మమ్మల్ని దోచుకున్నామని నువ్వు, నీభార్యా ఫలానా రోజు పెద్దమనుషుల దగ్గర అన్నారు, మీరు లెక్కలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని నిజంగానే దోచుకున్నట్టు నిరూపిస్తేగానీ విడిపోవడానికి వీల్లేదు. మమ్మల్ని ఈసంఘం దృష్టిలో దోపిడీదారులను చేద్దామనా నీ ఐడియా? అన్న భార్య హుంకరించింది. ఇంట్లో లెక్కలు రాసేదీ, సామాన్లూ కొనుక్కొచ్చేదీ అన్నీ అన్నే చేస్తాడు కాబట్టి అన్న ముందే లెక్కల పద్దు తనకు అనుకూలంగా రాసుకున్నాడు. తమ్ముడు లెక్కలు చెప్పబోతే అవి చెల్లవు, నేను  రాసిన ఈ మన ఉమ్మడికుటుంబం అధికారిక పద్దులు చూపిస్తేనే నేను ఒప్పుకుంటా, వేరే లెక్కలు నేనొప్పుకోను అంటూ అన్న తెలివి ప్రదర్శించాడు.


అసలు కలిసి ఉండాలనేభావన ఒక ఉమ్మడి కుటుంబంలోని విలువ, దాన్నీ ఇద్దరూ గౌరవించి ఎవరికీ అన్యాయం జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది, అలా కుదరనప్పుడు విడిపోవడం నాహక్కు దానికి అసలు ఏలెక్కలు మాత్రం ఎందుకు? లేని హక్కు కోసం నువ్వెలా పంచాయితీ పెడతావు? తమ్ముడు వాపోయాడు.


నువ్వు విడిపోతామనేది మీకు అరణంగా మీపుట్టింటివారిచ్చిన ఆవు ఉంది కనుకే. ఆఅవు ఇప్పుడు మన ఉమ్మడి పెరట్లో గడ్డితిని బలిసింది కనుక అది ఉమ్మడి ఆస్థి, దాన్ని నువ్వొక్కడివే కొట్టేద్దామని చూస్తున్నావ్! అన్న తెలివి ప్రదర్శించాడు. అయ్యో అది నాకు మాపుట్టింటివారిచ్చిన ఆవు, ఇన్నాల్లూ మీరే మా ఆవు పాలు తాగారు, విడిపోతే నాఅవు నాకుదక్కాలనుకోవడం కూడా తప్పేనా అనుకుంది తమ్ముడి భార్య.


ఇదీ కథ! మాఇంట్లో జరిగిన కథ, రాష్ట్రంలో జరుగుతున్న కథ. ముగింపు ఎలాగుంటుందనేది కాలమే నిర్ణయించాలి.

Thursday, 6 October 2011

రెండు కళ్ళ సిద్దాంతాలు




"తెలంగాణ, సీమాంధ్రా నాకు రెండు కళ్ళలాంటివి, రెండు చోట్లా మాపార్టీని కాపాడుకోవడమే మాలక్ష్యం, తెలంగాణలో తెలంగాణకు అనుకూలంగా సీమాంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మేము ఉద్యమిస్తం, ఆవిధంగా చాలా స్పష్టమైన వైఖరితో ముందుకుపోతున్నాం" ఇదే మన చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం. ఏమాత్రం నిజాయితీ ఉన్న మనిషైనా ఒక రాజకీయ పక్షం ఇలా రెండుకల్లవైఖరి కలిగిఉండడాన్ని ఒక నీతిబాహ్యమైన, మోసపూరిత విధానంగా ఒప్పుకుంటారు.

కానీ మన తెలుగుబ్లాగుల్లో పచ్చకామెర్లతో కల్లు పచ్చబారినవారికి మాత్రం విచిత్రంగా అందులో నీతి కనిపిస్తుందీ. అదేంటి మిగతా ఎవరికీ కనిపించని నీతి ఈపచ్చకల్ల మేధావులకు మాత్రం ఎలాకనిపిస్తుందని అనుకుంటున్నారా? దానికి వారి వివరణ తెలంగాణవాదులు తమ రంగుకల్లజోల్లని తీసి పచ్చకామెర్లవ్యాధిని తెచ్చుకుని కల్లను పచ్చగా తయారుచేసుకుంటే అందులో నీతి కనిపిస్తుందని.

ఒక ఇష్యూపై రెండువర్గాలు ఘర్షణపడుతున్నప్పుడు ఆప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయపార్టీ తమవైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సరే వైఖరి చెప్పడం సాధ్యం కాదు అనుకుంటే కనీసం తటస్థంగా ఉండాలి, అంతేకానీ ఇలా రెండుచోట్లా ఉద్యమం చేసి రెండుచోట్లా రాజకీయంగా లాభపడదాం, కేంద్రం ఏవైఖరి చెప్పినా అందుకు వ్యతిరేక సెంటిమెంటును కొల్లగొడదాం అని వ్యవహరించడం పచ్చి అవకాశవాదం. మరి ఈఅవకాశవాదంలో నీతి పచ్చమేధావులకు ఎలాకనిపించిందంటే వారంతే, కొందరి రాతలను చూసి ఇలాంటి మనుషులు కూడా ఉంటారని తెలుసుకుని వదిలెయ్యాలంతే.

ప్రస్తుతం దేశంలో రగులుతున్న కొన్ని సమస్యలపై రెండుకల్లవిధానాన్ని అప్లై చేస్తే ఎలాగుంటుందో చూద్దాం:

అవినీతి, జన్‌లోక్‌పాల్ బిల్లు: మాపార్టీలో ఉన్న అవినీతిపరులైన నాయకులందరికీ జన్‌లోక్‌పాల్ బిల్లు ఇష్టం లేదు, ఆబిల్లు వస్తే వారికి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు దండుకోవడం కష్టం. కానీ మాపార్టీలో మధ్యతరగతి కార్యకర్తలు అవినీతికి వ్యతిరేకం. కాబట్టి మాలంచగొండి నేతలు ఈబిల్లుకు వ్యతిరేకంగా, మిడిల్ క్లాస్ కార్యకర్తలు బిల్లుకు అనుకూలంగా ఉద్యమిస్తారు. మాపార్టీ ఇద్దరికీ మద్దతిస్తుంది, ఉద్యమానికి కావల్సిన మెటీరియల్‌ను ఇద్దరికీ సప్లై చేస్తుంది, ఆవిధంగా మేము ముందుకు పొతా ఉంటాము.

మహిళా రిజర్వేషన్: మాపార్టీలో మహిళలు రిజర్వేషన్ కావాలంటున్నారు, కొందరు పురుషులు మాత్రం దానికి వ్యతిరేకం. కనుక మేము ఇద్దరినీ రెండువైపులా ఉద్యమించమని చెప్పాం. మేము ఇద్దరికీ మద్దతిస్తున్నాం, ఆవిధంగా మేము స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నాం.

అయోధ్య, బాబ్రీ మసీదు: మాపార్టీలో ఉన్న హిందువులేమో అక్కడ గుడి కట్టాలంటున్నారు, ముస్లిములేమో మసీదు కట్టాలంటున్నారు. మేము ఇద్దరికీ అనుకూలం కనుక ఇద్దరికీ కత్తులు సప్లై చేసి పొడుచుకుని చావండని చెప్పాం. మాపార్టీ ఈవిషయంపై అన్ని పార్టీలకన్నా అత్యంత స్పష్టమైన వైఖరి కలిగి ఉంది.

Tuesday, 16 August 2011

బ్లాగుల్లోనూ మెజారిటీ రాజకీయాలే!


తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకోవటానికి ముఖ్య కారణం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు, అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకు మెజారిటీ లేకపోవడం వలన. మెజారిటీ లేకపోవడం వలన తెలంగాణ నాయకులకెప్పటికీ అధికారం రాదు. అసెంబ్లీలో వారి మాట నెగ్గదు. మెజారిటీ ఆధ్రాంగా నడిచే ప్రజాస్వామయంలో మెజారిటీలేనివాడికి న్యాయం జరగదు కనుక.

కొందరు అతితెలివి కలిగినవారు మెజారిటీ లేకపోతే మాత్రం తెలంగాణనుండి ప్రజాప్రతింధులు లేరా, మంత్రులు లేరా? ప్రజాస్వామ్యంలో అందరూ కలిసే కదా నిర్ణయాలు తీసుకునేది అని అతితెలివి చూపుతారు, కానీ వాస్తవాలు అందరికీ తెలిసిందే. భేధాలు లేనంతవరకే మెజారిటీ నిర్ణయాలు ఆమోదనీయం, మనం కలిసి ఒక్క రాష్ట్రంగా ఉన్నా ఎన్నడూ ప్రజలుగా కలిసి లేము, అధికారంలో కూర్చున్నవారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా కాక ప్రాంతాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.

ఇప్పుడు బ్లాగుల్లో జరుగుతుంది కూడా అదే. మెజారిటీ తెలుగు బ్లాగర్లు సీమాంధ్ర ప్రాంతం వారు. వీరిలో అధికభాగం పక్షపాతపూరితంగా తమది తప్పు అని తెలిసినా ఎదుటివారినే దెప్పిపొడుస్తారు. ఎవరైనా పొరపాటున తెలంగాణవాది తన బ్లాగులో ఒక చిన్న కవిత రాసుకున్నా అక్కడికి వెల్లి కావు కావుమంటూ కామెంట్లు అరిచి గీపెడతారు. పచ్చి అబద్దాలు చెబుతారు, అయినా ఎదుటివారివే అబద్దాలు అంతారు. కానీ మెజారిటీ ఉంది కదా.. ఎక్కువ కామెంట్లు వారివే కదా.. కనుక తెలంగాన వాదులు నోరుమూసుకుంటారు.

మచ్చుకు ఒక ఉదాహరణ: ఒక పెద్దమనిషి వెల్లి ఒక బ్లాగులో "ఏమిటి, మీ నల్లగొండలో ఫ్లోరసిస్ అని చెబుతున్నావు, నల్లగొండలో ప్రతి ఊరికి క్రిష్ణా నుండి తాగు నీరు వస్తుంది, 2000 సమవత్సరంలోనే ఫ్లోరసిస్ సమస్య తీరిపోయింది" అని గదమాయిస్తాడు. ఎదుటివారిని అబద్దాలు రాస్తున్నావని హుంకరిస్తాడు. ఎవరైనా అయ్యా నల్లగొండ జిల్లాలో ఏఊరికీ తాగునీరు క్రిష్ణా నుండి అందడం లేదు, ఫ్లోరసిస్ అలాగే ఉంది, ఘోరంగా ఉంది అని చెబితే మల్లీ దాని ఊసెత్తడు, కానీ అతనే మరో బ్లాగుకెల్లి తెలంగాణవారు అన్నీ అబద్దాలు చెబుతున్నారని గోలపెడతాడు. అక్కడ అతని మద్దతుగా మరో పది కాకులు కావుకావు మంటాయి. మధ్యలో సందట్లో సడేమియాల్లాగా రక్తచరిత్రలూ, సంకరులూ బయల్దేరుతారు, బూతు రాతలకు, హేళనలకు తెగబడుతారు, గోల చేస్తారు.

ఇక ఎవరో విశాలాంధ్ర వారు ఏదో సర్వేని ఒకటి చూపుతారు. వెంతనే మన బ్లాగు కాకులు కావు కావుమంటూ మల్లీ అదే సర్వేని దాని అసలు అర్ధాన్న్నే మారుస్తూ ప్రచారం చేస్తారు, కామెంటర్లు కామెంట్ల గోల పెడతారు. ఆఖరుకు బ్లాగుల్లో మేధావులుగా చలామనీ అయిపోయే కొందరు 14F లాంటి ఒక అన్యాయపు క్లాజును కూడా సమర్ధించడం, 14F తొలగింపును సీమాంధ్రలోనే అనేక నాయకులు, మేధావులు సమర్ధించినా అస్మెంబ్లీ నిర్ద్వంద్వంగా తొలగింపును సమర్ధించినా ఇంకా 14Fను వెనుకేసుకు రావడం, దానికి కొందరు కావు కావు మంటూ సమర్ధించడం అత్యంత శోచనీయం.

ఈగోలంతా భరించలేక చాలామంది తెలంగాణ వాద బ్లాగరులు తెలంగాణ గురించి రాయడం మానుకున్నారు, కొందరు తమ బ్లాగులను అగ్రిగేటర్లనుంచి తొలగించారు. కొందరు ఏదో తమకు నచ్చింది రాస్తున్నారు కానీ కామెంట్లను తీసివేశారు. ఇడీ ప్రస్తుత బ్లాగు మెజారిటీ రాజకీయాల పరిస్థితి.




మేమేది చేస్తే అదే న్యాయం



తేగీ!!
కలిసిరవసరం కోసమై పిలిచి వీరు,
వీరె తమ స్వార్ధ లాభమై వీడ జూచె!!
మేము విడిపోవ కోరగా, తామె మరల
నేడు సమైక్య నాటకం ఆడ సాగె !!




Monday, 15 August 2011

లేని హక్కుల సాధనకోసం, హక్కులను కాలరాయడం కోసం ఉద్యమాలు


ఉద్యమాలు, నిరశనలు అనేవి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉపయోగించే ఆయుధాలు. ప్రజలు ప్రజాస్వామ్యంలో తమందరి తరఫునా నిర్ణయాలు తీసుకోవడం కోసం కొందరు ప్రతినిధులను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తారు. అలాంటి ప్రభుత్వం తమ న్యాయమైన హక్కులను కాలరాస్తే మనకు ఆప్రభుత్వాన్ని వెంటనే దించివేసే హక్కులేదు, ఐదేళ్ళదాకా ఆగాల్సిందే. కనుక ప్రజలు తమ హక్కుల సాధనకోసం ఉద్యమాలు, నిరశనలు చేస్తారు. ఈనిరశనలు బందులూ, రాస్తారోకోలూ, సమ్మెలూ లాంటి అనేక విధానాలద్వారా చేస్తారు.

అయితే ప్రజలు లేని హక్కులకోసం ఉద్యమాలు చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతోందదే. ఆరోజోన్లో ఉద్యోగాలు ఆరోజోన్ వాసుల హక్కు. దానికోసం సీమాంధ్ర వారు బందులు చెయ్యడం, ఉద్యమాలు చెయ్యడం తమకు లేని హక్కును కోరడమే కాక ఆరోజోన్ ప్రజల హక్కులు హరించడమే. ఈసాంప్రదాయం ఇలాగే కొనసాగితే రేప్పొద్దున రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకోసం కూడా ఇదే సీమాంధ్రులు ఉద్యమాలు చెయ్యగలరు..రాజస్థాన్ వారికి మాత్రం తమ ప్రభుత్వోద్యోగాల్లో అర్హత ఇస్తే ఒప్పుకోరు. ఇలాంటి అన్యాయపు డీమాండ్లను కొందరు చెయ్యడం, వారికి కొందరు రాజకీయ నాయకులు వత్తాసు పలకడం క్షమించరాని నేరం.

అసలు సమైక్యవాదులు అని చెప్పుకునే వారు చేసే ఉద్యమమే ఒక హాస్యాస్పద ఉద్యమం. దీనికి అబద్దాలను జోడించి కావూరి సాంబశివరావు లాంటి నేతలు తెలంగాణవారు తెలంగాణ కావాలనుకుంటే సీమాంధ్రలో ప్రజలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్రాన్ని విడదియ్యడానికి వీల్లేదని చెప్పడం హాస్యాస్పదం. ముందుగా సీమాంధ్రలో అందరూ సమైక్యరాష్ట్రాన్ని కోరుకోవడమే పచ్చి అబద్దం, ఇక ఒకవేళ ఇది నిజమనుకున్నా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలని ఒక్కపక్షం వారే నిర్ణయించలేరు, అదివారి హక్కు కాదు.

ఒకభాగస్వామ్యం నచ్చనప్పుడు ఒకభాగస్వామి నాకీ పొత్తు నచ్చడం లేదు, నేను విడిపోతాను అని చెప్పగలడు, అలా చెప్పేహాక్కు ఒకభాగస్వామికి ఉంటుంది. అప్పుడు మరో భాగస్వామి మాత్రం విడిపోవడానికి వీల్లేదు, మనం కలిసే ఉండాలి అని చెప్పే హక్కు ఉండదు, ఉండేహక్కల్లా విడిపోయే పక్షంలో తన సమస్యలను పరిష్కరించుకోవడమే.

ఒకవేళ ఇద్దరు భాగస్వాములూ కలిసే ఉందామని ఇష్టపడుతున్నా ఎవరైనా బలవంతంగా విడగొడుతుంటే అప్పుడు ఇద్దరు భాగస్వాములూ కలిసి మేం కలిసే ఉంటామని చెప్పడం ఒక హక్కవుతుంది. దానికోసం, బలవంతపు విభజనకు వ్యతిరేకంగా ఇరు పక్షాలూ కలిసి ఉద్యమించవచ్చు. కానీ ఒక పక్షం వారంతా మేం విడిపోతాం మొర్రో అంటుంటే లేదు మీరు కలిసే ఉండాలని చెప్పడం హక్కు కాదు కదా, ఎదుటి వారి హక్కులను కాలరాయడమే.

ఇలా ఎదుటివారి హక్కులను హరించే ఉద్యమాలను కొందరు చదువుకున్నవారు కూడా సమర్ధించడం, దానికి రాజకీయనాయకులు వత్తాసు తెలపడం మాత్రమే కాక ఆనాయకులే ఇలాంటి ఉద్యమాలను సృష్టించడం మనదేశంలో ప్రజాస్వామ్య భావనకే ఒక దెబ్బ. ఇలాంటి దొంగ ఉద్యమాలను లేవదీసేవారు ఎంతమాత్రం క్షమార్హులు కారు.

వెక్కిరింతురు, నగుదురు ఫక్కుమనుచు!!

తేగీ!!
మీరు మేమంత ఒక్కటే వేరు కాదు
యనుచు విభజన కడ్డుగా జనుచు వారె,
తోటి యువకుల చావుల తూలనాడి,
వెక్కిరింతురు, నగుదురు  ఫక్కుమనుచు!!

Wednesday, 10 August 2011

జగన్ తీహార్ జైలు వెలతాడా?


1)జగన్ ఆస్తుల కేసులో తీహార్ జైలుకెలతాడా?
2)జైలుకెలితే జగన్‌కు సీమాంధ్రలో మద్దతు తగ్గుతుందా లేక సింపతీవలన పెరిగుతుందా?
3) రాష్ట్రం విడిపోతే సింపతీ వోటుతో వైఎస్సార్ కాంగ్రేస్ సీమాంధ్రలో మెజారిటీ సాధిస్తుందా?
4) సీమాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా అప్పుడు విజయమ్మగారు అవుతారా?
5) జగన్‌తోపాటు ఇంకా ఎవరెవరు తీహార్ జైలుకెల్లొచ్చు?

Friday, 22 July 2011

ఆదిరెడ్డి నేడు, యాదయ్య ఆనాడు


ఆవె!!
ఆదిరెడ్డి నేడు, యాదయ్య ఆనాడు
అసువుబాసి ఎందరమరులాయె?
పక్షపాత బుద్ది ప్రభుతయూ, మీడియా
ఒక్కరీతి కూడి వెక్కిరించె!!  


ఆవె!!
ఆరు నూర్ల యువకులాత్మార్పణము జేయ
జాళి జూప నెవరి జాడలేదె?
విగ్రహాలపైన విపరీత ప్రేమలా?
మట్టి బొమ్మ విలువ మనిషి కేది?

Monday, 11 July 2011

రాయలసీమ, కోస్తాంధ్ర కలిసి ఉంటాయా?

ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఒక నిర్ణయాత్మక దశకు వచ్చింది. తెలంగాణకు చెందిన పార్లమెంటు, శాసనసభ ప్రతినిధులందరూ రాజీనామా చేసిన తరువాత కేంద్రానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఇక సమస్యను నాంచుడు కార్యక్రమం ఎక్క్వకాలం చెయ్యలేరు. ముందు టపాల్లో చెప్పుకున్నట్లు మరో మూడేల్లు ఆగితే ఎన్‌డీయే ఎలాగూ తెలంగాణ ఇస్తుంది కనుక ఈలోపట తెలంగాణ ఇస్తే కాంగ్రేస్‌కే మంచిది.

అయితే విభజనకు ముందు రాష్టృఆన్ని ఏరకంగా విభజించాలనే విషయంలో స్పష్టత అవసరం. దీనికి విభజన తరువాత రాయలసీమ, కోస్తాంధ్ర కలిసి సమైక్యంగా ఉండగలవా అనేది చాలా ముఖ్య్మైన అంశం. తెలంగాణ ప్రజలు విడిపోతామంటే తమతమ స్వార్ధ ప్రయోజనాలకోసం, ఇప్పటివరకూ తెలంగాణతో కలిసి ఉండడం వలన మితిమీరిన లబ్దిపొందుతూ అదెక్కడ పోతుందో అనే అసహనంతో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు కలిసి సమైక్య ఉద్యమం చేపట్టారు కానీ వీరికి తెలంగాణ ప్రజలమీద ఎలా ప్రేమలేదో, వీరిలో వీరికి కూడా అలాగే ఎలాంటి ప్రేమలు లేవనేది అందరికీ తెలిసిన వాస్తవమే.

మద్రాసు రాష్ట్రంతో కలిసిఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం వారు తమకు ప్రత్యేక రాష్ట్రం కొరకు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే రాయలసీమకు చెందిన నాయకులకు కోస్తాంధ్ర వారిపై ఉన్న అనుమానాలతో వారు ఒక్క రాష్ట్రంగా ఉండడానికి ఒప్పుకోకపోవడంతో ఆడిమాండ్ వెనుకబడిపోయింది. చివరికి శ్రీబాగ్ ఒప్పందం కుదిరి రాయలసీమకు కొన్ని ప్రతిపత్తులు ఇస్తామని ఒప్పుకున్న తరువాత మాత్రమే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర డిమాండ్ ముందుకు వెల్లింది. ఆశ్రీబాగ్ ఒప్పందం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయ్యింది.

అయితే శ్రీబాగ్ ఒప్పందం సరిగా అమలు కాలేదని రాయలసీమ నాయకులకు అసంతృప్తి ఇప్పటికీ ఉంది. అలాగే శ్రీబాగ్ ఒప్పందంతో మేము నష్టపొయ్యామని కొందరు అప్పటికే ధనబలం కలిగిన మధ్యకోస్తా భూస్వామ్య వర్గానికీ ఉంది. మొత్తానికి తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతరువాత ఈరెండుప్రాంతాలవారికీ మరో సాఫ్ట్ టార్గెట్ దొరకడం వలన రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు రెండూ తెలంగాణను ఎక్స్‌ప్లాయిట్ చేసి లాభం పొందాయి కనుక ఈభేదలు ఇంతకుముందు బయటపడలేదు.

అయితే తెలంగాణ విడిపోతే రాయలసీమ, కోస్తాంధ్ర ఎంత్వరకు కలిసి ఉండగలవనేది సందేహమే. ఇప్పుడు క్రిష్ణా జలాల్లో తెలంగాణ వాటా పూర్తిగా నొక్కేయడం వలన రాయల్సీమకు నీరివ్వగలుగుతున్నారు. అయితే తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడ్డతరువాత ఒక రాష్ట్రంగా తెలంగాణకు రావాల్సిన నదీజలాల వాటాను ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది. అప్పుడు తెలంగాణ వాటా పోయిన తరువాత రాయలసీమకు నీరివ్వాలంటే నీటిదాహం విపరీతంగా గల మధ్యకోస్తా నాయకులు ఒప్పుకోరు, స్వతహాగా అంతా తమకే చెందాలనుకుంటారు.

రాయలసీమ తెలంగాణలాగా సాఫ్ట్ టార్గెట్ కాదు. రాజకీయబలం బాగా ఉండి, ముఠాకక్షలకు పేరుగాంచినా ఇక్కడి నాయకులు మధ్యకోస్తా పెత్తనాన్ని ఎంతమాత్రం ఒప్పుకోరు. నిజానికి ఇప్పుడు సమిక్యాంధ్రప్రదేశ్ లోనే ఎప్పుడూ అతితక్కువ జనాభా కల రాయలసీమ నుండే ముఖ్యమంత్రులు ఉంటున్నారంటే సీమాంధ్ర రాష్ట్రంలో కూడా వీరే ముఖ్యమంత్రులు అవుతారు. మరి సీమాంధ్ర రాజకీయబలాన్ని కోస్తాంధ్ర ధనబలం గౌరవిస్తుందా? ఈప్రశ్నలన్నింటికీ సమాధానాలకోసం వేచిచూడాల్సిందే.

ఇప్పుడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి కలిసి ఉన్నట్లు నటించే ఈరెండుప్రాంతాలు, కేంద్రం విభజనకు ఒప్పుకున్న మరుక్షణం కత్తులు దూసుకోవడం ఖాయం. ఏతావాతా తెలిసేదేమంటే తెలుగుజాతి ఐక్యత, సమైక్య నినాదం అంతా నేతిబీరకాయలో నెయ్యే.

Sunday, 10 July 2011

భాద్యత కేంద్రానిదే..కానీ వ్యతిరేకించడం మా హక్కు


చివరికి అంతా అనుకున్నదే అయ్యింది. జగన్ తెలంగాణ విషయంపై చేతులెత్తేశాడు. తెలంగాణ ఇచ్చే లేదా ఆపే హక్కు నాకు లేదు, తేల్చాల్సింది కేంద్రమే అంటూ తానూ గోడమీద పిల్లినే అని చెప్పకనే చెప్పాడు. ఇదేమాట ఇన్ని రోజులూ రెండు కల్లూ సొట్టబోయిన చంద్రబాబూ చెబుతున్నాడు కనుక జగన్ కొత్తగా చెప్పిందేం లేదు.

తేల్చాల్సింది కేంద్రమేనంటూ భాద్యత కేంద్రంపై నెట్టివేసే ఈనేతలు కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా? కేంద్రం నిర్ణయానికి కట్టుబడడం అటుంచి తామే అంతకు కొన్ని గంటలముందు ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉన్నారా అంటే లేదు.. ఇదే చంద్రబాబు స్వయంగా సీమాంధ్రలో తమ పార్టీనాయకులచేత కృత్రిమ ఉద్యమం సృష్టించడమే కాకుండా అందుకు కావల్సిన మెటీరియల్ మొత్తాన్ని తానే ఎంటీఆర్ భవన్ నుండి సమకూర్చాడు. మరోసారి కేంద్రం తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుంటే రేపు చంద్రబాబు లాగే జగన్ కూడా అదే పని చేస్తాడు.ప్రస్తుతానికి ఇద్దరూ తెలంగాణలో తమ పార్టీ ప్రతినిధులచేత తామే రాజీనామాలు చేయించి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు అని ప్రజలను భ్రమింపజేద్దామని ప్రయత్నం చేస్తున్నారు.

అంటే ఈరాజకీయ పార్టీలకు తెలంగాణపై నిర్ణయంలో భాగం పంచుకునే భాద్యత లేదు, కానీ కేంద్రం ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు మాత్రం ఉందన్నమాట. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు ఇప్పటిదాకా చంద్రబాబు దగ్గర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను విశ్వసనీయతకు మారుపేరు అని చెప్పుకునే జగన్ కూడా చేస్తూ తానూ ఆతానుముక్కనే అని నిరూపించుకున్నాడు. విశ్వసనీయత అంటే ఆచరణ సాధ్యం కాని ఉచిత పధకాలను గుప్పించి ఖజానాను గుల్లచేసి తన సొంత ఖజానా నింపుకోవడం కాబోలు.

ఇంతకూ చంద్రబాబుకూ జగన్‌కూ ఉన్న తేడా ఏమిటి? ఒకడు వేలకోట్ల అవినీతి చేస్తే మరొకడు లక్షల కోట్లకు అవినీతిని పెంచాడు. కాలం గడుస్తున్నకొద్దీ మన రాష్ట్ర బడ్జెట్ పెరిగినట్లే అవినీతి స్థాయి పెరగడంలో ఆశ్చర్యం లేదు. రేపు చంద్రబాబుకు అధికరం ఇస్తే అతను లక్షలకోట్ల అవినీతిని కోటికోట్లకు పెంచగల సమర్ధుడు. ఒకడు మామకు వెన్నుపోటు పొడిస్తే మరొకడు తండ్రి పదవి అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు మేసి ఆస్తితోపాటు అధికారానికీ వారసున్ని నేనేనంటున్నాడు. ఇద్దరూ చేసేది కులరాజకీయాలు, ధన రాజకీయాలే..కానీ తాము రెప్రజెంట్ చేసే కులాల్లో తేడా, అందుకే వారి వారి సమర్ధకులు కూడా మారుతారు, రాష్ట్ర విభజన విషయం వచ్చేవరకూ అందరూ సీమాంధ్ర వాదాన్నే సమర్ధిస్తారు. ఈమాత్రం దానికి కొందరు మాబాబు గొప్ప అంటే కొందరు మా జగన్ గొప్ప అంటూ కేవలం తాము ఏసామాజిక వర్గానికి చెందినవారో చెప్పకనే చెబుతున్నారు.

Thursday, 7 July 2011

కేంద్రం ఇప్పుడు ఏంచెయ్యాలి?

రాష్ట్రవిభజన ప్రస్తుత పరిస్థుతుల్లో కాంగ్రేస్‌కు అనివార్యమని క్రితం పోస్టులో చెప్పుకున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితిని పరిష్కరించి భవిష్యత్లో తమిలనాడులో లాగా కాంగ్రేస్ పూర్తిగా మనుగడ కోల్పోకుండా ఉండాలంటే రాష్ట్రాన్ని ఇప్పుడు విభజించాల్సిందే. అయితే రాష్ట్రాన్ని ఎలా విభజిస్తే ఎక్కువమందిని ఒప్పించి లాజికల్‌గా విభజించి కాంగ్రేస్‌కూడా లబ్ది పొందవచ్చు?

తెలంగాణ మాత్రం విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే పూర్తిగా 1956 క్రితం పరిస్థితిలోకి, ఫజల్ అలి శిఫార్సుల్లో మొదటి సిఫార్సుకి వెల్లినట్టు అవుతుంది. అయితే ఇలా చేస్తే తెరాసకు పూర్తిగా తల వంచినట్లవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రేస్ తెరాసపై ఆధారపడాల్సి వస్తుంది. అలాగే కొందరు కావూరు లాంటి నేతలు రాష్ట్ర విభజనకు ఒక ప్రాతిపాదిక ఉండాలి, తెరాస చెప్పినట్లు జరగదు అంటున్నారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని మేము కాస్త శాస్త్రీయంగా విభజన చేశాం అని కాంగ్రేస్ చెప్పుకోవచ్చు కూడా. అయితే రాష్ట్రాన్ని ఎలా ఎన్ని ముక్కలు చెయ్యొచ్చు?

1) మూడు ప్రాంతాలను మూడు రాష్ట్రాలు చెయ్యడం ఒక వాదన. అయితే రాయలసీమకు ఒక రాష్ట్రంగా మనగలిగే అంత వనరులు లెవ్వు కనుక ఇది సాధ్యం కాదు.
2) గ్రేటర్ హైదరాబాద్‌ను ఒక రాష్ట్రంగా మార్చాలనేది ఒక వాదన...గ్రేటర్ హైదరాబాద్ తాగునీటివిషయంలో మిగతా ప్రాంతాలపై ఆధారపడాల్సి ఉంటుంది కనుక ఇది కూడా సాధ్యం కాదు. పైగా హైదరాబాద్‌ను చేస్తే మిగతా అన్ని మహానగరాలనూ రాష్ట్రాలుగా మార్చాలని డిమాండ్ రావొచ్చు..ఇది ప్రాక్టికల్ కాదు.
3)మహబూబ్ నగర్ను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చెయ్యటం...ఇప్పటిఏ సమైక్య రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడి నీల్లున్నప్పటికీ తమకు దొరకని పరిస్థితిలో ఉన్న మహబూబ్‌నగర్ వాసులు దీన్ని ఎంతమాత్రం ఒప్పుకోరు.
4) రాయల తెలంగాణ...ఇది ఇద్దరికీ ఇస్టం ఉండని మరో బలవంతపు పెల్లి జరపడమే. పైగా అంతపెద్ద రాష్ట్రానికి తీరప్రాంతం అస్సలు ఉండదు.
5. పైవన్నీ కాకుండా ఉత్తరాంధ్రను తెలంగాణలో కలిపి రాష్ట్రాన్ని ఉత్తర దక్షిన భాగాలుగా ఈమ్యాపులో చూపినట్లు విభజిస్తే చాలా సమస్యలు తీరుతాయి. ప్రస్తుతం ఎలక్షన్లు జరిగేటప్పుడు ఈవిధంగానే మొదటి, రెండో ఫేజుల్లో జరుగుతయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ పై ప్రాంతపు ఎన్నికలు కాగానే మాటమార్చి హైదరాబాద్ వెల్లాలంటే వీసాలు తీసుకోవాలా అన్న విషయం తెలిసిందే.


ఉదాహరణకు:
1) రెండు రాష్ట్రాలకూ సముద్ర తీరం దొరుకుతుంది.
2) ఉత్తరాంధ్ర కూడా తెలంగాణాలాగే వివక్షకు గురవుతున్న ప్రాంతం.. విడిపోతే మధ్యకోస్తా వారు తమకు అన్యాయం చేస్తారని వీరికి భయం ఉంది.
3) ఉత్తరాంధ్ర, తెలాంగాణ ప్రాంతాల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్లో పోలిక ఉంటుంది. రెండూ వెనుకబడిన ప్రాంతాలు, రెండు చోట్లా దళిత, బీసీ వర్గాలు ఎక్కువ.
4) తెలంగాణలో ఉత్తరాంధ్ర కూడా ఉండడం వలన పూర్తి తెరాస ఆధిపత్యం కాకుండా కాంగ్రేస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చెయ్యొచ్చు.
5) ఉత్తరాంధ్రలో బలం పెంచుకుంటున్న జగన్‌కు చెక్ చెప్పినట్లవుతుంది.

ఏం చేస్తే ఏం జరుగుతుంది?



తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు సమర్పించినతరువాత ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం సంక్లిష్ట స్థ్తితిలోకి వచ్చింది. అసలే బొటాబొటి మెజారిటీతో ఉండి అందులోనూ అవినీతి కూపంలో కూరుకుపోయి మంత్రులపైనే విచారణలెదుర్కుంటూ, మరో పక్క లోక్‌పాల్ విషయంతో కొట్టుమిట్టాడుతున్న కేంద్రానికి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో అని భయంతో ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిని ఇలాగే కొనసాగించడం అసలు సాధ్యం కాదు కనుక కేంద్ర ఏం చెయ్యాలి? ఇప్పుడు కేంద్ర దగ్గర ఉన్న మార్గాలు ఏమిటి? ఇంతకూ కేంద్రం ఏం చేస్తే ఏం జరుగుతుంది?

రెండు మూడు రోజుల్లో జగన్ తన స్టాండును కూడా చెప్పాల్సి వస్తుంది. జగన్ నిర్ణయం కూడా కొంతవరకూ భవిష్యత్ పరిణామాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం కొండా సురేఖ, జయసుధల రాజీనామాలను బట్టి జగన్ తెలంగాణ సమర్ధిస్తాడనుకోవచ్చు. కాకపోతే జగన్ మద్దతు ఇవ్వడం, ఇవ్వకపోవడం వల్ల ఈక్వేషన్లు పెద్దగా మారకపోవచ్చు.

1) గవర్నర్ పాలన: కేంద్ర ఎటూ తేల్చక, అందరి రాజీనామాలు తీసుకుని రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించవచ్చు. ఇదే నియంత గవర్నర్ నరసింహన్‌ను కొనసాగించి రాబోయే మూడేల్లలో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివెయ్యొచ్చు. తరువాత నిదానంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2014లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరుపవచ్చు.

ఫలితం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రేస్, తెలుగుదేశం పూర్తిగా ఓడిపోతాయి. టీఆరెస్, బీజేపీ, సీపీఐ ఒక కూటమి లాగా మారవచ్చు. జగన్ అనుకూల నిర్ణయం తీసుకుంటే జగన్ కూడా కూటమిలో చేరవచ్చు. టీఆరెస్, బీజేపీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. సీట్ల పంపిణీ ద్వారా సీపీఎం, జగన్ పార్టీలు తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. మజ్లీస్‌కు బాగా సీట్లు తగ్గిపోయి ఒకటి లేదా రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకోవచ్చు. పార్లమెంటు సీట్లలో కాంగ్రేస్్‌కు బహుషా ఒక్కటి కూడా దక్కక పోవచ్చు.

గవర్నర్ పాలన వలన సీమాంధ్ర ప్రజలు కూడా విసిగిపొయి ఉంటారు కాబట్టి కాంగ్రేస్‌కు సీమాంధ్రలో కూడా 4-5 కంటే ఎక్కువపార్లమెంటు స్థానాలకంటే ఎక్కువ రావు. జగన్‌కు ఎక్కువ సీట్లు , కొన్ని సీట్లు టీడీపీకి దక్కొచ్చు. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్కుండి 4,5 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటే కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఎండీయే అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణ ఇస్తుంది. అప్పుడు రాష్ట్రంలో కూడా జగన్, టీఆరెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఉంటే వారు విభజనకు అభ్యంతరాలు పెట్టరు. తెలంగాణలో టీఆరెస్, ఆంధ్రాలో జగన్ పార్టీ అధికారంలోకి రావొచ్చు.


2) సమస్యను సాగదీయడం: ఏదో ఒకలాగా కాంగ్రేస్ ప్రజాప్రతినిధులను మెత్తబరిచి, సమస్యను పరిష్కరిస్తున్నట్లు నటించి రాజీనామాలు వెనక్కి తీసుకునేట్టు చేసి కాలయాపన చెయ్యడం. రెండు సంవత్సరాలు అలాగే గడపెయ్యడం.

అప్పుడు కూడా వెచ్చే ఎలక్షన్లలో కాంగ్రేస్ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. తెలుగుదేశానికి ఇప్పటికే అడ్రస్ లేదు. ఎలక్షన్ రిజల్ట్సు మొదటి ఆప్షన్ లాగానే ఉంటాయి. తరువాత జరిగే పరిణామాలు కూడా భిన్నంగా ఉండవు, ఎండీయే అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇస్తుంది.

3) తెలంగాణ ఇవ్వడం:  కేంద్రానికి మిగిలిన ఏకైక మార్గం తెలంగాణ ఇచ్చెయ్యడం. అప్పుడు ఉద్యమం సీమాంధ్రాకు మారుతుంది. కొన్నిరోజులు బంద్‌లూ గట్రా జరుగుతాయి. తెలంగాణా నుండి స్పషల్ ఫోర్సులను ఆంధ్రాకు తరలిస్తే రెండువారాల్లో అక్కడ పరిస్థితి మామూలు దశకు తీసుకురావొచ్చు.

ఎలాగూ అక్కడ ప్రజల్లో విభజన విషయంలోగానీ సమైక్యత విషయంలో గానీ పెద్ద ఆసక్తి లేదు. ఉద్యమాన్ని నడిపించేది ఎలాగూ నాయకులే. కాంగ్రేస్ నాయకులు సోనియా ఒక్కసారి కన్నెర్రజేస్తే నోరుమూసుకుంటారు. జగన్ బూచిని చూపి చంద్రబాబును దారిలోకి తెచ్చుకుంటే తెలుగుదేశం నాయకులు కూడా మెత్తబడుతారు. జగన్ ఎలాగూ రెండు రోజుల్లో తెలంగాణ అనుకూల ప్రకతన చేస్తాడనుకుంటే జగన్ సమైక్య ఉద్యమం చేసే అవకాశాలు అస్సలు లెవ్వు.

వచ్చే ఎలక్షన్లలో తెలంగాణలో కాంగ్రేస్ తెరాసతో పొత్తు పెట్టుకోవచ్చు, లేక తెరాసను కలిపేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో కొన్ని సీట్లు కాంగ్రేస్ గెలుచుకోవచ్చు. సీమాంధ్రాలో విభజన వద్దనే పార్టీ ఏదీ ఉండదు కాబట్టి సీమాంధ్రాలో ఈఅంశం ఎన్నికలపై ప్రభావం చూపకపోవచ్చు. చంద్రబాబు పని ఇప్పటికే అయిపోయింది కాబట్టి సీమాంధ్రలో జగన్, కాంగ్రేస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు. దీనివల్ల వచ్చే ఎలక్షన్లలో కేంద్రంలో కాంగ్రేస్ మల్లీ అధికారంలోకి రాకపోయినా కనీసం కొన్ని సీట్లు పెరుగుతాయి, ఆంధ్ర, తెలంగాణాల్లో తన ఉనికిని కాంగ్రేస్ కాపాడుకుంటుంది.

కాబట్టి ఎలా చూసినా తెలంగాణా ఇస్తేనే కాంగ్రేస్‌కు లాభం. ఏం జరిగినా వచ్చే మూడేల్లలో పూర్తిగా జోకర్లుగా మిగిలేది మాత్రం చంద్రబాబు, చిరంజీవి
.

Sunday, 3 July 2011

హైదరాబాదులో రాజకీయ మతకల్లోహాలు ఏనాటివి?

మనదేశంలో మతకల్లోహాలు కొత్తగాదు, హిందువులూ, ముస్లిముల ఘర్షణలు కొత్త గాదు. అసలు మనదేశంలో అనేముంది ప్రపంచంలో అనేక చోట్ల మతయుద్ధాలు, ఘర్షనలు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఈమధ్య తగ్గాయి కానీ చరిత్రలో అక్కడ కూడా మతఘర్షణలు జరిగిన ఉదంతాలు అనేకం. మనదేశంలో ముస్లిములు అధికంగా ఉండే అన్ని ప్రాంతాల్లో మతఘర్షణలు అనేక సందర్భాల్లో జరిగాయి. మతం ఉన్నన్నాల్లూ మతఘర్షనలు ఏదో ఒకరీతిలో ఉంటాయనేది మత ఛాందసవాదులు తప్ప మిగతావారంతా ఒప్పుకునేదే. అందుకే ఈమతాల అడ్డుగోడలు తొలగిపోవాలని అభ్యుదయవాదులందరూ చెబుతారు.

మిగతా ప్రాంతాల్తో పోల్చినపుడు హైదరాబాదులో మతసామరస్యం బాగానే ఉండేది అనేది అందరూ ఒప్పుకునే విషయం. ఇంతమంది ముస్లిములు ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ హిందువులూ, ముస్లిములూ by and large కలిసే ఉన్నారు. కలిసి ఒకరి పండుగలు మరొకరు చేసుకున్నారు, ఒకరి పెల్లిల్లకు, ఫంక్షన్లకూ మరొకరు అతిథులయ్యారు. ఏదో కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా పెద్దేత్తున ఇక్కడ ఘర్షణలు జరిగిన ఉదంతాలు చరిత్రలో కనపడవు.ఇప్పటికీ పాతబస్తీలో హిందువులూ, ముస్లిములూ చక్కగా కలిసే ఉంటారు.

అయితే ఎప్పుడయితే రాజకీయ నాయకులు తమ రాజకీయ అవసరాలకు హైదరాబాద్ పాతబస్తీని వాడుకోవడం మొదలు పెట్టారో అప్పటినుంచీ ఇక్కడ పెద్ద ఎత్తున ఘర్షనలు చెలరేగాయి. వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అయితే ఇవి నిజమయిన మత ఘర్షనలు కావు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాలకు మతవిభేదాలను రెచ్చగొట్తడం ఒక ఎత్తు. అది దేశంలోని మిగతా ప్రాంతాల్లో మొదలయ్యింది. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. రాజకీయ పార్టీలు తమ అనుచర బృందాన్ని ఇతర ప్రాంతాలనుండి తెప్పించి హత్యలు చేసి వాటికి మతం రంగు పుయ్యటం మాత్రం హైదరాబాదుకే ప్రత్యేకమయింది. ఇవి ఎంత ఘోరంగా జరిగాయి అంటే ఒకే బస్టాపులో హిందూ, ముస్లిం లిద్దరూ ఉంటే స్కూటర్ మీద వచ్చిన దుండగులు హిందూ, ముస్లిం లిద్దరిపై దాడి చేసినలాంటి ఉదంతాలెన్నో.

ముఖ్యమత్రులను మార్చాలన్నా, కొందరు నేతలకు తమ ప్రాబల్యం పెంచుకోవాలన్నా హైదరాబాదులో మతఘర్షణలను కృత్రిమంగా సృష్టించడం గత మూడుదశాబ్దాలుగా మొదలయిన నాయాట్రెండు. కృత్రిమంగా ఉద్యమాలే సృష్టించిన ఘనులకు కృత్రిమ మతఘర్షణలు సృష్టించడం పెద్ద విద్యేం కాదు. ఈ ట్రెండును సృషించింది, రాజకీయ అవసరాలకోసం హైదరాబాదుకు బయటినుండి తెప్పించిన గూండాలద్వారా మతకల్లోహాలు సృష్తించిందీ ఎవరనేది ఇక్కడ అందరికీ తెలిసినా బయటికి చెప్పలేని ఒక బహిరంగ రహస్యం. ఇది ఎవరి రంగప్రవేశం తరువాత మొదలయిందో కూడా తెలిసిందే. మజ్లీస్ లాంటి ఒక ముఠాకు అనవసర సీనిచ్చి దాన్ని బలంగా తయారుచేసింది కూడా ఈవర్గమే.

సాధారణంగా ఒక వ్యాసం రాసేప్పుడు విషయాన్ని వివరించగలిగే సౌలభ్యం ఉన్నట్టు టీవీ చానెల్స్‌లో అందునా సీమాంధ్రా మీడియా చానెల్లుగా ముద్రపడ్డ కొన్ని చానెల్లు ఒకరిపై ఒకరు అరుచుకోవడమే చర్చ అని చెప్పబడే చర్చాకార్యక్రమాల్లో ఉండదు. అలాంటి ఒక అరుపుల కార్యక్రమంలో ఒక తెలంగాణ అనుకూల మీడియా విశ్లేషకుడు హైదరాబాదులో మతఘర్షణలు మొదలయింది సీమాంధ్ర నేతల ప్రవేశం తరువాతే అని చెప్పాట్ట, నేనయితే అది చూళ్ళేదు. ఆచత్త కార్యక్రమాన్ని పట్టుకుని ఆ విశ్లేషకుడు చవకబారున్నర విశ్లేషకుడు, సిగ్గులేని ప్రొఫెసరు అంటూ రకరకాల పోస్టులు బ్లాగుల్లో వెలిశాయి, అక్కడికి ఈయన తప్ప మిగతా విశ్లేషకులందరూ పెద్ద సుద్దపూసలు, ఈయన తప్ప మిగతా వారు చెప్పేవన్ని చరిత్ర సత్యాలు. అంతే కదా మన పచ్చకల్లకు అనుకూలంగా మాట్లాడేవాడు గొప్ప విశ్లేషకుడు, వ్యతిరేకంగా మాట్లాడే వాడు చవకబారున్నర....మనం మాట్లాడిందే ఎప్పటికీ సత్యం.మనం ఇన్నాల్లూ పుస్తకాల్లో చదువుకున్న తెలుగుజాతి ఐక్యతకోసం పొట్టి శ్రీరాములు చనిపోయాడనేది గొప్ప సత్యం.

పచ్చకామెర్లు వచ్చిన కొందరికి తప్ప వేరెవరికి నచ్చని పచ్చబాబు రెండుకల్ల సిద్దాంతం మాత్రం గొప్ప నీతీ, నిజాయితీ, ధర్మం. ఇలాంటి రాతలు రాసేవాల్లందరూ నిజంగా తాము నమ్మినదాన్నే రాస్తారా.. ఏదో తమవర్గానికి కొమ్ముకాసేవారిని ఎలాగయినా సమర్ధించాలనేది వీరి తపన గానీ. అసలు తెలంగాణ లాంటి ఒక సున్నితమైన అంశంపై ఎక్కువమంది సాధారన ప్రజలకు ఏది మచిది అన్న కోణంలోనుండి కాకుండా రాష్ట్రాన్ని విభజిస్తే నాకు, నా సామాజిక వర్గానికి, నా అభిమాన రాజకీయ పార్టీకి, అభిమాన రాజకీయ నాయకుడికి ఎంత లాభం, ఎంత నష్టం అంటూ కూడికలూ తీసివేతలూ వేసేవారివలననే ఇలాంటి వాదోపవాదాలని నా అభిప్రాయం.

క్రికెట్ మాచ్ ఓడిపోతే?

మన క్రికెట్ జట్టు ఒక గెలవాల్సిన క్రికెట్ మాచ్ చివరిబంతుల్లో ఏదో బౌలర్ లేదా బాట్స్‌మన్ తప్పిదం వల్ల ఓడిపోతే అది క్రికెట్ అభిమానులందరినీ ఎంతో బాధిస్తుంది. అంతా ఒక జట్టు ఓడిపోయినట్లు గాక తామే ఓడిపోయినట్లు భావిస్తారు.అలాంటిది ఒక రాష్ట్రం ఏర్పాటు, కోట్లమంది ప్రజల ఆకాంక్ష చివరిదాకా వచ్చి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకుని చివరికి ఆ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోతే ఎలా ఉంటుంది?

అది కూడా కొంతమంది స్వార్ధ నాయకులు, కొన్న్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ లాభాలకోసం మాటలు మార్చి, ధనబలంతో, మీడియా బలంతో, అధికార బలంతో, అంగబలంతో లేని ఉద్యమాలను పీసీ సర్కార్ కన్న గొప్పగా మాయాజాలం చేసి సృష్టించి ఆపితే ఎలా ఉంటుంది?

ఈబాధ ఇక్కడి ప్రజలను కలవరపరిచింది. ఈవోటమి ఇప్పటికే ఆరువందల ప్రాణాలు బలిగొంది. ఇప్పటిదాకా నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈప్రాంత ప్రజలతో ఆటలు ఆడుకుంటూ మాచ్‌ఫిక్సింగ్ చేస్తుంటే చూసిన ప్రజల సహనం నశించింది. ఇప్పుడు ప్రజలు తాము ఎంతకాలమూ ఆటలో పావులు కాదని తేల్చారు. దాని పరిణామమే ఇప్పుడు కాంగ్రేస్, తెలుగుదేశం నేతల్లో వణుకు. తెలంగాణ సాధించకపోతే తాము తమ నియోజకవర్గాల్లో మల్లీ అడుగుపెట్టలేని పరిస్థితి. తెరాసకు తాము గతంలో చెన్నారెడ్డిలాగా ప్రజలను వంచిస్తే ప్రజలు సహించరనే హెచ్చరిక.

ఎలాగయితేనేం, ఇప్పుడు ప్రజలు నాయకుల ఆటల్లో బొమ్మలు కావడం మాని నాయకులను శాసించే స్థితికి వచ్చారు. అందుకే ఇప్పుడు కాంగ్రేస్, తెలుగుదేశం ప్రతినిధుల రాజీనామాలు. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా చివరికి ఎలాగోలా గట్టి నిర్ణయం తీసుకున్న ఈనాయకులు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటే వెక్కిరించే సీమాంధ్ర నేతలు, మీడియా, మాస్వార్ధలాభంకోసం మీరు మాతో కలిసే ఉండాలి, విడిపోయే హక్కు మీకులేదంటూ మిడిసిపడే కుహనా సమైక్యవాదులూ అందరూ గిజగిజలాడడం ఖాయం. ఈనాయకులు ఎంతవరకూ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటారనేదానికి ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ కాంగ్రేస్, తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు నా అభినందనలు.

Thursday, 23 June 2011

ముసుగేస్తే దాగదీ వివక్ష - ఇరిగేషన్ (repost)


Image credits: http://www.gideetelangana.blogspot.com/

మన స్వయప్రకటిత మేధావి నాయకుడు జయప్రకాశ్ నారాయణ తెలంగాణా అంశంపై చాన్నాల్లపాటూ గోడమీద పిల్లిలా విన్యాసాలు చేసి ఇక తప్పనిసరి పరిస్థితిలో సమైక్యాంధ్రకు అనుకూలంగా శ్రీక్రిష్ణ కమీషనుకు ఒక రిపోర్టును వండాడు. ఈ రిపోర్టులో తెలంగాణాపై వివక్ష ఏమీ జరగలేదని నిరూపించడానికి అనేక లెక్కలను వండివార్చాడు. దీనిపై గతంలో నేను రాసిన టపా ఇక్కడ చూడొచ్చు. ఈమధ్యనే కొత్తగా వెలిసిన "విషాంధ" మహాసభ అనే ఒక బ్లాగువారు ఈమధ్య తెలుగుజాతిని కలిపి ఉంచే మహత్తర భాద్యతలో భాగంగా తెలంగాణా వాదులపై విషం చిమ్ముతూ పనిలో పనిగా అసలు ఇరిగేషన్‌లో తెలంగాణాపై ఎలాంటి వివక్ష జరగలేదు, అన్నీ కట్టుకథలు అని చెబుతూ ఒక టపా రాశారు. దానికోసం వారు పాపం మన జేపీగారి రిపోర్టును అరువు తెచ్చుకున్నారు.

వీరి వాదన టూకీగా గోదావరి భౌగోళిక స్వరూపంవల్ల శ్రీరాంసాగర్ తరువాత పోలవరం వరకూ ఎక్కడా డాం కట్టడానికి అనువైన స్థలం లేదు, ఎత్తిపోతలు ఖర్చుతో కూడినపని (అంటే ఇచ్చాపురం ప్రాణహిత-చేవెళ్ళ పధకాన్ని అటకెక్కించాలి). కనుక గోదావరి జలాలను తెలంగాణాలో వాడకంలో తేవడం సాధ్యం కాదు, పోలవరం దగ్గర ప్రాజెక్టు కట్టి నీటిని క్రిష్ణా డెల్టాకు మల్లించాలి, తద్వారా మిగిలిన క్రిష్ణా నీటిని రాయలసీమకు మల్లించాలి, తెలంగాణా నోట్లో మొత్తంగా మట్టికొట్టాలి. మన ప్రభుత్వ ఉద్దేషంకూడా ఇదే కానీ బయటికి చెప్పక తెలంగాణాలో కూడా ప్రాజెక్టులు చేస్తున్నాం అని కథలు చెబుతూ ప్రజలను ఏమారుస్తారు, వీరు మేధావులు కనుక బహిరంగంగానే తెలంగాణా నోట్లో మట్టికొట్టాలని ప్రవచిస్తారు. వీరి వాదనలో ఎక్కడా క్రిష్ణా నది ఊసెత్తరు, ఎందుకంటే అక్కడ జరిగే వివక్షను ఏమార్చడం ఇంతమేధావులవల్ల కూడా కాలేదు మరి.

ఇప్పటికే క్రిష్ణా పూర్తిగా తెలంగాణాకు కాకుండా పోయింది. మిగిలిన గోదావరిని కూడా తెలంగాణాకు కాకుండా చెయ్యడం అనే తమ ప్రణాలికను ఒకవైపు చెబుతూనే మరోవైపు తెలంగాణాపై వివక్షలేదని చెప్పడం వీరి వాదన. మీ ప్రాంతంలో నీల్లివ్వడం కష్టం, మీకు వ్యవసాయం లాభదాయకం కాదు, రైతులందరూ వ్యవసాయం వదిలేసి మీ భూములను సెజ్జులకిచ్చేయండి, ఆతరువాత ఆసెజ్జులు కట్టేప్పుడు రోజుకూలీలుగా పనిచేసి పొట్టపోసుకోండి, కడుపు నిండకపోతే ముంబైకో దుబాయికో వలస పోండి, కానీ మీకు ఎవరైనా వచ్చి ఇక్కడి సాగునీటి వాడకంలో మోసం జరిగిందంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఇదీ వీరి వాదన.

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు: తెలంగాణాపై ఎప్పుడు వివక్ష ఊసొచ్చినా సమైక్యవాదులు ఇచ్చే ఏకైక ఉదాహరణ శ్రీరాంసాగర్. చూశారా శ్రీరాంసాగర్ మీనిజాం కట్టించలేదు, సమైక్య ప్రభుత్వమే కట్టించింది. ఎంతసేపూ అందులో పూర్తిగాని స్టేజీలనే ఎందుకు మాట్లాడుతారు? పూర్తయిన చిన్నముక్కను చూసి సంతోషించొచ్చు కదా?

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సమైక్య ప్రభుత్వం తెలంగాణాపై ప్రేమతోనో, తమ భాద్యత గుర్తొచ్చో ఇవ్వలేదు. ఇక్కడి ప్రజలు 69లో రాష్ట్రం కొరకు ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసినతరువాత ఏదో ఒకటి చెయ్యకపోతే ఎక్కువకాలం ఏమార్చలేమని ఈప్రాజెక్టును మొదలుపెట్టారు. గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ఉన్న ప్రాంతం అత్యంత ఎత్తుపై ఉన్న ప్రాంతం, ఆప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కరీమ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలన్నింటికీ ఇచ్చే ప్రణాలికతో మొదలయిన ప్రాజెక్టు. పూర్తయితే ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సిన ప్రాజెక్టు అన్ని క్లియరెన్సులూ వచ్చిన తరువాత నలభై ఏల్లు గడచిన తరువాత కూడా ఇంకా ఐదు లక్షల ఎకరాలకు కూడా ఇవ్వలేకపోతుంది. నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలు ఎప్పటికైనా తమకు పోచంపాడు(శ్రీరాంసాగర్) నీల్లొస్తాయని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

మన దేశంలో ప్రాజెక్టులన్ని ఇలాగే లేటవుతాయి అందులో పెద్ద వివక్ష ఏమీ లేదు అని తేల్చే వారు ఒక్క సారి మన రాష్ట్రంలోని నాగార్జునసాగర్, తెలుగు గంగ ప్రాజెక్టులు, ఇతర రాష్ట్రాలలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్ని రోజుల్లో అయ్యాయో గమనించాలి.

లిఫ్ట్ ఇరిగేషన్ పై అపోహలు: లిఫ్ట్ ఇరిగేషన్లో నదిపై అనువైన ప్రాంతంలో ఒక బ్యారేజీ కట్టి, స్టోరయిన నీళ్ళను ఒక ఎత్తయిన ప్రదేశంలో కట్టిన రిజర్వాయరుకు తరలిస్తారు. అక్కడినుంచి కాలువల ద్వారానో మరో విధంగానో ఆయకట్టుకు నీటిని తరలించొచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్‌పై వచ్చే విమర్శలు ఏమిటంటే దీనివలన విద్యుత్ ఖర్చవుతుంది, ఇది అదనపు భారం. గ్రావిటీ ద్వారా నయితే ఫ్రీగా నీటిని తరలించొచ్చు.

నిజమే నీటిని లిఫ్ట్ చెయ్యాలంటే విద్యుత్ కావాలి. ఐతే మన దేశంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. ఏదో అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మనం వ్యవసాయం లాభసాటి అయితేనే చెయ్యం, వ్యవసాయం ఇక్కడ ఎందరికో జీవన విధానం. కాలువల ద్వారా నీరు రాకపోతే ప్రతి రైతూ ఒక బావి తవ్వుకోవాలి, బావిలో నీల్లు సరిపోవు కనుక అందులో ఒక బోరు వేసుకోవాలి, రెండు మోటార్లు పెట్టి బోరునీటిని పొలానికి తరలించాలి. అంటే రైతు కాలువవ్యవసాయం కంటే అదనంగా బావికి, బోరుకు, మోటార్లకు, విద్యుత్తుకు ఖర్చు చెయ్యాలి. ఆ విద్యత్తుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ప్రపంచ బ్యాంకు ఏడుపులు. ప్రతి రైతూ తన బోరుకోసం విద్యౌత్‌పై చేసే ఖర్చూ, అందుకు ప్రభుత్వ సబ్సిడీ అన్నీ చూసుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్‌లో అయ్యే విద్యుత్ ఖర్చు చాలా తక్కువ. తీరా వచ్చే కరెంటు కనీసం ఆరుగంటలు కూడా ఉండదు, అది ఎప్పుడొస్తుందో తెలియక నిద్రాహారాలు మాని పొలం దగ్గర పడిగాపులు చెయ్యాలి. ఇంతఖర్చు చేసి చివరికి పొలం ఎండిపోతే రైతులు అప్పులభాధకు ఆత్మహత్యలు చేసుకోవాలి.

మరి ఒక ప్రాజెక్టుకింద వ్యవసాయం చేసేవారు ఏదో నామమాత్రంగా ఎకరాకు యాభై రూపాయలు ప్రభుత్వానికిస్తాడు. మరి ప్రాజెక్టు కట్టిన ఖర్చూ, కాలువలు తవ్విన ఖర్చూ, వాటి మెయింటెనన్సు ఖర్చులూ, ప్రాజెక్టు కట్టినప్పుడు నిర్వాసితులకు పునరావాస ఖర్చు ఇవన్నీ ఖర్చులు కావా? ఇవన్ని ఎవరి జేబులోనుంచి వెల్తున్నాయి? కాబట్టి రైతుకు నీటిని ఇవ్వడం అనేది ప్రభుత్వ భాద్యత, అందులో లాభనష్టాలు బేరీజు వేసుకుని ఎక్కడ కాలువ తావ్వడం తక్కువ ఖర్చుతో అవుతుందో అక్కడే తవ్వుతాం, ఎక్కడ ఖర్చెక్కువ అవుతుందో అక్కడ తవ్వం అని ఏప్రభుత్వమూ లెక్కలు కట్టదు, ఒక్క మన ప్రభుత్వం తప్ప. మన పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలో, మిగతా చాలా చోట్ల చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేసుకున్నారు, వారి వాటా నీటిని వాడుకున్నారు అంతే కానీ డెల్టా ప్రాంతం మాకు లేదు, డెల్టా అంతా కోస్తా ఆంధ్రలో ఉంది అక్కడయితే తేలిగ్గా నీటిని సరఫరా చెయ్యొచ్చు కాబట్టి ఈనీళ్ళను వారికే వదిలేద్దం అనుకోలేదు.మన రాష్ట్రంలోమాత్రం గడచిన యాభై ఏల్లలో శ్రీరాంసాగర్ నుంచి ధవలేశ్వరం మధ్యలో ఒక్క ప్రాజెక్టూ కట్టకపోవడానికి చూపించే సాకు గ్రావిటీ.

వాటర్ బేసిన్ ఉల్లంఘణలు: ఏ నదీ జలాలను ఆ నది బేసిన్‌లోనే వాడాలనేది ఇరిగేషన్‌లో ఒక ప్రాధమిక సూత్రం. మన రాష్ట్రం మాత్రం క్రిష్ణా జలాలను పూర్తిగా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమకు,నెల్లూరుకూ తరలించి కనీసం పది శాతం కూడా తెలంగాణకు ఇవ్వట్లేదు. ఈ ఉల్లంఘణవల్ల నష్టం తెలంగాణాకు మాత్రమే కాదు, క్రిష్ణా ట్రిబ్యునల్ వద్ద కర్నాటక మనరాష్ట్ర రివర్ బేసిన్ వియోలేషన్లను సాకుగా చూపించి తను ఎక్కువ నీటి వాటాను పొందుతుంది. ఈ వాటర్ బేసిన్ ఉల్లంగణలవల్ల క్రిష్ణా ట్రిబ్యునల్ తీర్పులో మనరాష్ట్రానికి (మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌కు, తెలంగాణకు మాత్రమే కాదు) జరిగిన నష్తం గురించి నేను గతంలో రాసిన టపా ఇక్కడ చూడొచ్చు.

మన ప్రభుత్వం మేం మిగులు జలాలను మాత్రమే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని కుంటి సాకులు చెబుతూ వచ్చింది, నికరజలాలను వాడకుండా మిగులు జలాలు ఎలావాడుతారో చెప్పలేకపోయి క్రిష్ణాలో వాటాను తగ్గించుకుంది. ఇప్పుడు గోదావరి విషయంలో కూడా తెలంగాణాలో గ్రావిటీ సాకు చూపించి గొడావరి నీటిని ఇతర బేసిన్లకు తరలించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మన జేపీగారి మేధావి వర్గం అప్రూవ్ చేస్తుంది.

పోలవరం: ఇక గోదావరి నీటిని తెలంగాణాలో వాడడానికి గ్రావిటీ బూచిని చూపిస్తున్నవారు పోలవరంపై మాత్రం గగ్గోలు పెడతారు. లక్షల మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసి, ఎంతో ప్రకృతి సంపదను, పాపికొండలనూ, వన్యమృగాలనూ ముంచేసే పోలవరంపై వీరికి అపార ప్రేమ. తెలంగాణాలో అన్ని క్లియరెన్సులూ వచ్చేసి దశాబ్దాలు పెండింగులో ఉన్న ప్రాజెక్టులను వదిలేసి ఎన్విరన్‌మెంట్ అనుమతి లేని పోలవరంపై మాత్రం ఉద్యమాలు చేస్తారు.పోలవరంపై ఆదివాసీల అభిప్రాయాలు ఈవీడియోలో చూడొచ్చు.



రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు ఏం లాభం?: ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలవడం వలన మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ఘర్ గోదవరిపై తమ హక్కును ఎలా కాపాడుకుంటున్నాయో అలాగే తెలంగాణ కూడా తమ గోదావరి జలాలపై తమహక్కును కాపాడుకుంటుంది. ఇది తెలుసుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్ అక్కరలేదు, మేధావులు కానక్కర్లేదు. ఎలా గ్రావిటీ సమస్యను అధిగమిస్తారు నీటిని ఎలా పంపు చేస్తారు అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ఇక గోదావరిపై తెలంగాణకు అన్యాయం ఏమీ జరగలేదని మోసపు రాతలు రాసేవారు మీ రాతలను కట్తబెట్టి మీపని మీరు చూసుకోవచ్చు.

Sunday, 19 June 2011

సత్యసాయిబాబా చెప్పులపై హిందూ దేవతలు



ఈబంగారు పాదరక్షలు బాబా యజుర్మందిరంలో దొరికాయి. హిందూ దేవతామూర్తుల విగ్రహాలను చెప్పులపై చూడవచ్చు. హిందువులు పవిత్రంగా చూసుకునే లక్ష్మీ, సరస్వతి లాంటి దేవతల మూర్తులను కాళ్ళకు ధరించడం వలన ఆయా దేవతలకు అవమానం జరిగినట్లా, లేక బాబా స్వయంగా దేవుడు కనుక ఆయనకు మామూలు మనుషులకు ఉండే నిభందనలు వర్తించవా అనే విషయం నాఊహకు అందలేదు.

Friday, 17 June 2011

దేవుడి యజుర్మందిరంలో లక్షల కోట్లు??



సత్యసాయిబాబా మరణించి రెండునెలలు కావొస్తున్న సమయంలో సత్యసాయి అనారోగ్యానికి లోనయినప్పుడు తాళం పెట్టిన ఆయన వ్యక్తిగత గది యజుర్మందిరం తలుపులు నిన్న తెరిచారు. నదులో లక్ష కోట్ల దాకా విలువ చేసే డబ్బూ, బంగారం, వజ్రాలు, టన్నులకొద్దీ వెండీ ఉన్నట్లు తెలుస్తోంది. బాబా మరణం తరువాత ఇప్పటికే ఎంతో బంగారం, డబ్బూ బయటికి తరలించారనేది మరో విషయం. ఇదంతా కేవలం ఆయన వ్యక్తిగతహోదాలో తన మందిరంలో దాచుకున్న సంపద కాగా దేశవిదేశాల్లో ట్రస్టుకు ఇంకెంతో సంపద ఉందనేది తెలిసిందే.

బాబా తాగునీటి ప్రాజెక్టులూ, విద్య, హాస్పిటల్ వగైరాలను చూపించి అతని దేవుడి స్టేటస్‌కు జస్టిఫికేషన్ ఇచ్చేవారు సంక్షేమానికి వెచ్చించిన మొత్తం సొమ్ము ఆయన సంపదలో నీటిబిందువంత అని ఒప్పుకోకతప్పదు. అదికూడా సత్యసాయి సంక్షేమానికి డబ్బులు వెచ్చించింది ఆయనమీద అనేక ఆరోపణలు వచ్చినతరువాత ఆరోపణలనుండి బయటపడడానికి మాత్రమే కానీ 1980 ముందు అతను సేవకు పెద్దగా చేసిందేమీ లేదనేది మరొక విషయం. ఇంతకూ సమాజసేవ చేసిన వారంతా దేవుల్లయితే సొంతడబ్బులు సమాజసేవకు వెచ్చించిన పారిశ్రామికవేత్తలనెవరూ దేవుల్లనరు..ఒక్కరోజు పేపర్లో చదివి ఓహో అలాగా అనడం తప్ప. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్, స్టీవ్‌వా లాంటి విదేశీయులు వారికి సంబంధం లేని మనదేశంలో సొమ్మును సమాజసేవకు ఖర్చు చేస్తున్నారు. మనదేశంలో అజీంప్రేంజీ, టాటా, నారాయణమూర్తీ లాంటివారు ఎంతో సొమ్ము సమాజసేవకు వెచ్చిస్తున్నారు. ఎవ్వరూ తాము దేవుల్లమని చెప్పుకోరు, వారిని వారి సేవచూసి ఎవరూ దేవుల్లని అనరు.

ఇంతకూ సత్యసాయి దేవుడని చెప్పుకున్నందుకు డబ్బులు సంపాదించాడా, డబ్బులు సంపాదించి అందులో కొద్దిమొత్తాన్ని సమాజసేవకు వెచ్చించినందుకు దేవుడయ్యడా అనేది మరో సందేహం. ఒక మామూలు వ్యక్తి ఎంతనిజాయితీగా సమాజసేవ చెయ్యడానికి ముందుకొచ్చినా డబ్బులు పెద్దగా రాలవు, దేవుడని చెప్పుకుంటే మాత్రం దండిగా వస్తాయి. డబ్బులిచ్చినవారిలో అధికభాగం డబ్బును ట్రస్టుకు ఇచ్చారు, ట్రస్టు స్థాపించిన ఉద్దేషం ఎలాగూ సమాజసేవే కనుక డబ్బును ఎందుకు ఇచ్చారో అందుకు అదికూడా అతికొద్ది శాతం ఖర్చు చేస్తే దేవుడెలాగ అయ్యాడో నాకయితే అర్ధం కాదు.

ఇక నీసొమ్మేమన్నా అడిగాడా, నువ్వేమన్నా నీడబ్బులు ఇచ్చావ, మరి నువ్వెందుకు అడుగుతున్నావు అంటూ విరుచుకుపడే వితండవాదులగురించి వాదన ఎలాగూ అనవసరం. ఒక రాజకీయనాయకుడు అధికారం అడ్డం పెట్టుకుని లక్షలకోట్లు దోచుకుని ప్రజలసొమ్మును తనసొంతడబ్బులాగా ఉచితపధకాలకు దానం చేసి దేవుడయిపొయాడు. ఒక బాబా దేవుడినని చెప్పుకుని లక్షలకోట్లు సొమ్ముచేసుకుని అందులో ఒక ఫ్రాక్షన్ ప్రజలసొమ్మును ప్రజలకు దానం చేసి దేవుడయిపొయ్యాడు. ఇద్దరిలో పెద్దతేడాలేదు.

Tuesday, 14 June 2011

తెలుగు భాష సరళతను కాపాడుదాం



తెలుగు భాషాపరిరక్షణ


తెలుగు భాష సరళతను కాపాడడానికి నలమోతు శ్రీధర్ గారు ప్రారంభించిన భాషా పరిరక్షణ ఉద్యమానికి నా సంఘీభావం ప్రకటిస్తున్నాను. ఈసందర్భంగా శివరామ ప్రసాద్‌గారి వాఖ్యను యధాతధంగా రాస్తూ నామాటకూడా అదేనని చెబుతున్నాను.

"నేను ఎన్నటికీ “గట్టిపళ్ళెం”, “జాలగూడు”, “విహారిణి”, “నియంత్రణా వ్యవస్థ”,”క్రమకర్తలు”,”ఖతి” ,”సంగణకం”, “విశ్వవ్యాప్త వలయం” “మృదులాంతకం” ,”పంపక సులభ కవిలె” “సంప్రకారం” వంటి భ్రష్ట పదాలను వాడను. నేను మాట్లాడాను లేదా వ్రాశాను అంటే ఇతరులకి అర్ధం కావటానికి కాని, నా పాండిత్య ప్రదర్శనకు కాదు అని తెలిసి ఉన్నవాణ్ని కనుక అలా చేయలేను."

Friday, 3 June 2011

రంగు కళ్ళజోళ్ళు


రంగు కల్లజోళ్ళు పెట్టుకుంటే లోకమంతా రంగుగా కనిపిస్తుందనేది అందరికీ తెలిసిన పాత సామెతే, అందరం తరుచుగా వాడే సమెతే. సమస్య ఏమిటంటే ప్రతివాడు ఎదుటివాడిని నీరంగు కల్లజోళ్ళు తీసెయ్యమనడం, కానీ తనదాకా వస్తే తనకల్లజోళ్ళసంగతి మరిచిపోవడం.

ఒక్కరిని అనేదేముంది, మన తెలుగు మీడియా అంతా రంగుకల్లజోళ్ళమయం. ఒకరికి పసుపు కల్లజోళ్ళయితే మరొకరికి మొన్నటిదాకా ఆకుపచ్చకల్లజోళ్ళు, ఇప్పుడేరంగో తెలియదు కానీ జగన్ జోళ్ళు. నేను రోజూ పొద్దున లేవగానే ఈనాడూ, సాక్షి అప్పుడప్పుడూ సూర్య పత్రికలు చదువుతాను. ఈమధ్య ఆంధ్రజ్యోతి వాడు వెబ్ ఏదిషన్ పైడ్ చేశాడు కాబట్టి చదవడం కుదరడం లేదు. సాధారణంగా ఒకే విషయంపై ఈనాడులో ఒక వార్త ఒకలాగ రాస్తే సాక్షి దానికి పూర్తిగా వ్యతిరేకంగా రాస్తుంది. ఏవిషయంలో ఏవార్తను నమ్మాలి అన్న దాన్ని కేస్ టు కేస్ బేసిస్లో డిసైడ్ చెయ్యాల్సి ఉంటుంది. జగన్ విషయమైతే ఈనాడు, చంద్రబాబు విషయమైతే సాక్షి వార్తలను నమ్మితే కాస్త వాస్తవానికి దగ్గరగా ఉంటుందనిపించింది.

మేముండే ప్రాంతంలో ఇండియన్స్ తక్కువే, అందులో తెలుగువాళ్ళు పెద్ద ఎక్కువ కాదు. కానీ ఉన్నకొద్దిమందిలో రెండు సామాజిక వర్గాలవారు గ్రూపులుగా కలిసి ఉంటారు. మిగతావారు ఒక వర్గంగా ఉండేంత మంది లేకపోవడంతో ఆవర్గాలు లేవు. మిగతా అన్ని రాష్ట్రాలవారు రాష్ట్రాలవారీగా గుంపులు కడితే తెలుగు వారు మాత్రాం ఇలా సామాజికవర్గాలు గా విడిపోవడం మామూలే. అయితే విషయం ఏమిటంటే ఏదయినా గెట్‌టుగెదర్ జరిగి జనం కలుసుకున్నపుడు టాపిక్ రాజకీయాల్లోకి వెలుతుంది. ఒక సామాజిక వర్గం చిరంజీవిని మరో సామాజిక వర్గం చంద్రబాబునూ సమర్ధిస్తుంది, అది ఎలాంటి విషయమైనా. ఇది ఎంతగా నంటే చిరంజీవి రాజకీయాల్లో రెండు సంవత్సరాల్లో పూర్తిపరువు పోగొట్టుకున్నప్పటికీ చిరంజీవిని ఒక వర్గం ఇంకా సమర్ధిస్తుంది. చంద్రబాబు నక్కజిత్తులు తెలిసినా ఒక వర్గం చంద్రబాబును సమర్ధిస్తుంది. ఫలానా వారు ఫలానా విషయాన్ని కేవలం తాము ధరించిన కల్లజోళ్ళకారణంగా సమర్ధిస్తున్నారని తెలిసినపుడు మనం వారితో విషయంపై చర్చించి ఏం లాభం?

ఈమధ్యన ఒకబ్లాగులో ఒకరు తెలంగాణ వాదులు తమ రంగుకల్లద్దాలను తీసి చూసినట్లయితే చంద్రబాబు రెండుకల్లసిద్దాంతంలో ఉన్న నీతిని చూడచ్చని రాసి తెలంగాణ వాదులందరికీ కలగలిపి రంగుకల్లజోళ్ళను అంటించారు. అవును తెలంగాణ వారికి తెలంగాణ రంగు కల్లజోళ్ళు, సీమాంధ్ర వారికి సీమాంధ్ర రంగు కల్లజోళ్ళు ఉంటాయి, ఇద్దరూ ఆ కల్లజోళ్ళలోంచే విషయాన్ని గమనిస్తారు. అసలు సీమాంధ్ర వాదులకు ఉన్నవి రంగు కల్లజోళ్ళు కావు, అవి "అంధులు" ధరించే నల్ల కల్లజోల్లు, కాబట్టి వారు నిజాలను ఎప్పుడూ చూడలేరు అని చెప్పేవారు కూడా ఉన్నారనుకోండి, కానీ అది వేరే విషయం.

అయితే నాకు తెలిసి తెలంగాణ వారి కల్లజోళ్ళకు ఒక లేయర్ ఉంటే సీమాంధ్ర వాదులకు ఉన్న కల్లజోళ్ళకు రెండు లేయర్లుంటాయి, ఒకటి ప్రాంతానికి సంబంధించిన లేయర్ కాగా మరొకటి కులాని సంబంధించినది. అందుకే జగన్ను విమర్శిస్తే ఒక వర్గం, చంద్రబాబును విమర్శిస్తే ఒక వర్గం, చిరంజీవిని విమర్శిస్తే మరో వర్గం మండిపడుతుంది. తెలంగాణపై మాత్రం పై అన్ని వర్గాలు ఎగిరిపడతాయి. మరి వీరు రెండు పొరలున్న ఈకల్లజోల్లను ఛేదించుకుని వాస్తవాలను ఎప్పటికైనా గ్రహిస్తారంటారా? ఇలాంటివారితో ఎవరైనా విషయంపై విభేదించి అవతలి వారికి తమవాదన వినిపించగలరా?

Friday, 6 May 2011

పోలవరం మోసం

పోలవరం ప్రాజెక్టు గురించి తెలియని తెలుగువారుండరు. రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు రోజూ ఎక్కడో ఒక చోట పోలవరానికి జాతీయహోదాలు ఇవ్వాలని డిమాండ్లు చేస్తారు. ఇప్పటికే పోలవరం కోసం చిరంజీవి ఒక యాత్ర చేయగా జగన్ ఒక లక్ష(?)దీక్ష చేశాడు. ఎలాంటి అనుమతులూ లేక ఒక రాష్ట్రం ఈప్రాజెక్టుపై కేసుపెట్టినప్పటికీ, భవిష్యత్తులో అనుమతులు లభించేది అనుమానాస్పదమయినప్పటికీ ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఈప్రాజెక్టుపై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గుమ్మరించింది.

"Down to Earth" సైన్స్ అండ్ ఎన్విరన్మెంట్ పత్రిక వారు polavaram fraud అనే ఒక కధనాన్ని ప్రచురించారు. వారి కధనాన్ని ఇక్కడ చదవవచ్చు.

Tuesday, 3 May 2011

నడ్డి విరిచే వడ్డీ రేట్లు





పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని (ఇన్‌ఫ్లేషన్) అదుపుచెయ్యడానికని రిజర్వ్ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లు పెంచింది. వడ్డీ ధరలు పెంచడం సంవత్సరకాలంలో ఇది బహుషా నాల్గోసారి అనుకుంటా. వడ్డీ రేట్లు ఎంతపెంచినా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అసలింతకీ ఇన్‌ఫ్లేషన్‌కూ వడ్డీ రేట్లకూ సంబంధం ఏమిటి? మిగతా దేశాల్లో ఇంత పెరగని ఇన్‌ఫ్లేషన్ ఒక్క మన దేశంలోనే ఎందుకు పెరుగుతుంది? అసలు ఇన్‌ఫ్లేషన్ పెరుగుదల, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ రెండింటిలో ఏది సామాన్యునిపై ఎక్కువ భారం వేస్తుంది? లాంటివన్ని మనబోటి వారికొచ్చే ధర్మ సందేహాలు.

"వడ్డీ రేట్లు పెరిగితే ద్రవ్యం విలువ పెరుగుతుంది, కాబట్టి డబ్బు సప్లై తగ్గుతుంది. డబ్బు సప్లై తగ్గితే వస్తువుల డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ధరలు తగ్గుతాయి." ఇది ధరలకు, వడ్డిరేట్లకూ ఉన్న థీరిటికల్ లింకు. ధరలను తగ్గించడానికి మన ప్రభుత్వానికి తెలిసిన మొదటి సూత్రం ఇదే కాబట్టి ధరలు పెరిగినప్పుడల్లా వడ్డీరేట్లు తగ్గిస్తారు.కానీ నిజంగా ఈసూత్రం పనిచేసి ధరలు తగ్గుతాయా అనేది సందేహాస్పదం.

ఇంకా కుదరకపోతే ఆహార పదార్థాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తారు. అది ఈపాటికే చేసి చక్కర, బియ్యంలపై ఎగుమతులపై కంట్రోల్ పెట్టారు. దానివలన బయట చక్కర డిమాండ్ ఎక్కువ ఉన్నా మన చెరకు రైతుకు మాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు.

మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వలన క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి, దానికి వడ్డీ రేట్లతో సంబంధం లేదు. వర్షాలు బాగోలేక, పంటలు పండక, తుఫానులు, వడగళ్ళ వానలు లాంటి ప్రతికూల పరిస్థితులవలన,దళారీలూ, అక్రమ నిలువలవలన ఆహారధరలు పెరుగుతున్నాయి. వడ్డీరేటు పెరిగినా తరిగినా ప్రజలు బతకడానికి తినడం తప్పదు కాబట్టి ఆహార ధరలు కూడా వడ్డీరేటు పెరగడం వలన తగ్గే అవకాశాలు లేవు.

ఇల్లధరలు బహుషా వడ్డీరేటు పెంచితే తగ్గొచ్చు కానీ దానివలన ఇన్‌ఫ్లేషన్ పెద్దగా తగ్గే అవకాశం లేదు. మరీ ఊరికే ఇలా వడ్డిధరలు పెంచడం వలన నిజంగా సాధించేది ఏమైనా ఉందా? వడ్డీ రేట్లు పెరగడం వలన ఇంఫ్రాస్ట్రక్చర్ కంపనీలు నష్టపొతాయి, కాబట్టి ఇంఫాస్ట్రక్చర్ గ్రోత్ తగ్గుతుంది. మధ్యతరగతి ప్రజలలో బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేవారికంటే అప్పులు తీసుకునేవారే ఎక్కువ. వారికి వడ్డీరేట్లు పెంచినప్పుడల్లా నడ్డివిరుగుతుంది. మరి ఈ వడ్డీ రేట్లు పెంచడం వలన ఇప్పుడు ఎవరికి లాభం?

Thursday, 21 April 2011

ఎవరెవరు వేర్పాటు వాదులు?

తెలంగాణా ఉద్యమాన్ని, తెలంగాణా కోరుకునేవారిని కించపరచడానికి తరుచుగా మీడియా, కొందరు సీమాంధ్రా నాయకులు, తెలుగులో కొందరు బ్లాగరులు విరివిగా వాడెపదం "వేర్పాటు వాదులు". ముందుగా ఈపదాన్ని వాడింది లగడపాటి కాగా తరువాత తరువాత తెలంగాణా వ్యతిరేకించే నాయకులూ, సీమాంధ్రా మీడియా అందరూ వాడ్డం మొదలు పెట్టారు. ఎవరయినా అలా అనకూడదని చెబితే వీరిచ్చే సమాధానం విడిపోవడాన్నికి వేరుపడడం పర్యాయపదం, విడిపోవాలనుకునే వారిని వేర్పాటువాదులనే అంటారు అని.

నిజమే తెలుగులో విడిపోవడం, వేరు పడడం రెండూ ఒకటే. కానీ దానిపక్కన వాదం చేర్చినపుడు అది మామూలు వేరుపడడం కాదు, అర్ధం మారిపోతుంది. ఈ వేర్పాటువాదం అనేపదం ఆంగ్లంలోని separatism, secessionism అనే పదాలకు సరిసమానమయిన అర్ధం కోసం తెలుగులో వాడే పదం. separatism అనే పదం అర్ధం ఒక దేశ సార్వభుమత్వాన్ని ధిక్కరిస్తూ విడిపోవాలనుకునే భావజాలం. ఉదాహరణకు కాశ్మీర్, పంజాబ్, నాగాలాండ్, ఉల్ఫా లాంటి తీవ్రవాదులకుద్దేషించడానికి మనదేశంలో వేర్పాటువాదులు అనే పదాన్ని వాడతారు. అంతే కానీ ఒకదేశంలో ఆదేశ రాజ్యాంగానికి లోబడి ఒక కొత్త రాష్ట్రం కావాలనుకోవడం వేర్పాటువాదం కాదు. ఒకవేళ అది వేర్పాటువాదమయితే అసలు మన రాజ్యాంగంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అసలు వీలుండకూడదు, రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఎప్పటికీ అన్నే ఉండాలి. కానీ మన రాజ్యాంగం రాసినవారు అంత తెలివితక్కువ వారు కాదు, మన రాజ్యాంగం ప్రకారం ప్రజల, పాలన అవసరాలను బట్టి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు.

వీరు చ్ప్పేట్లు ఒక రాష్ట్రాన్ని విడగొట్టడమే వేర్పాటువాదమయితే మనదేశంలో ఎవరెవరు వేర్పాటువాదులు? వారిలెక్క ప్రకారం వేర్పాటువాదానికి ఆద్యులు స్వాతంత్రం వచ్చినతరువాత మొట్టమొదటిగా రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేసిన సీమాంధ్రా నాయకులు, ప్రజలు. అంటే వీరు వేర్పాటువాదులు అన్న ప్రతిసారీ పొట్టి శ్రీరాములు, టంగుటూరి లాంటి వారిని తీవ్రవాదులతో పోల్చినట్లు. ఇంకా మొన్నీమధ్యనే మూడు కొత్తరాష్ట్రాలను ఏర్పాటుచేసిన బీజేపీ ఒక వేర్పాటువాద రాజకీయపార్టీ. ఇంకా తెలంగాణాకు మద్దతు ఇస్తున్న మమతా బెనర్జీ, షరద్ పవార్, బీజేపీ లాంటి వారంతా వేర్పాటువాదులే. ఇంకా తమతమ పార్టీ మానిఫెస్టోలలో పెట్టినందుకు, ఎప్పుడో ఒకప్పుడు తెలంగాణాకు మద్దతిచ్చినందుకు టీడీపీ, కాంగ్రేస్లు కూడా వేర్పాటువాదులే. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేసిన మన యూనియన్ హోం మినిష్టరు చిదంబరం కూడా వేర్పాటువాదే!! హతవిధీ, ఇలా చూస్తే ఈపదాన్ని ఉపయోగించే తెలంగాణా ద్వేషులు మొత్తంగా మన భారత శాంతిభద్రతల మంత్రినే తీవ్రవాదితో పోల్చారన్నమాట.

Wednesday, 20 April 2011

ముసుగేస్తే దాగదీ వివక్ష - ఇరిగేషన్


Image credits: http://www.gideetelangana.blogspot.com/

మన స్వయప్రకటిత మేధావి నాయకుడు జయప్రకాశ్ నారాయణ తెలంగాణా అంశంపై చాన్నాల్లపాటూ గోడమీద పిల్లిలా విన్యాసాలు చేసి ఇక తప్పనిసరి పరిస్థితిలో సమైక్యాంధ్రకు అనుకూలంగా శ్రీక్రిష్ణ కమీషనుకు ఒక రిపోర్టును వండాడు. ఈ రిపోర్టులో తెలంగాణాపై వివక్ష ఏమీ జరగలేదని నిరూపించడానికి అనేక లెక్కలను వండివార్చాడు. దీనిపై గతంలో నేను రాసిన టపా ఇక్కడ చూడొచ్చు. ఈమధ్యనే కొత్తగా వెలిసిన "విషాంధ" మహాసభ అనే ఒక బ్లాగువారు ఈమధ్య తెలుగుజాతిని కలిపి ఉంచే మహత్తర భాద్యతలో భాగంగా తెలంగాణా వాదులపై విషం చిమ్ముతూ పనిలో పనిగా అసలు ఇరిగేషన్‌లో తెలంగాణాపై ఎలాంటి వివక్ష జరగలేదు, అన్నీ కట్టుకథలు అని చెబుతూ ఒక టపా రాశారు. దానికోసం వారు పాపం మన జేపీగారి రిపోర్టును అరువు తెచ్చుకున్నారు.

వీరి వాదన టూకీగా గోదావరి భౌగోళిక స్వరూపంవల్ల శ్రీరాంసాగర్ తరువాత పోలవరం వరకూ ఎక్కడా డాం కట్టడానికి అనువైన స్థలం లేదు, ఎత్తిపోతలు ఖర్చుతో కూడినపని (అంటే ఇచ్చాపురం ప్రాణహిత-చేవెళ్ళ పధకాన్ని అటకెక్కించాలి). కనుక గోదావరి జలాలను తెలంగాణాలో వాడకంలో తేవడం సాధ్యం కాదు, పోలవరం దగ్గర ప్రాజెక్టు కట్టి నీటిని క్రిష్ణా డెల్టాకు మల్లించాలి, తద్వారా మిగిలిన క్రిష్ణా నీటిని రాయలసీమకు మల్లించాలి, తెలంగాణా నోట్లో మొత్తంగా మట్టికొట్టాలి. మన ప్రభుత్వ ఉద్దేషంకూడా ఇదే కానీ బయటికి చెప్పక తెలంగాణాలో కూడా ప్రాజెక్టులు చేస్తున్నాం అని కథలు చెబుతూ ప్రజలను ఏమారుస్తారు, వీరు మేధావులు కనుక బహిరంగంగానే తెలంగాణా నోట్లో మట్టికొట్టాలని ప్రవచిస్తారు. వీరి వాదనలో ఎక్కడా క్రిష్ణా నది ఊసెత్తరు, ఎందుకంటే అక్కడ జరిగే వివక్షను ఏమార్చడం ఇంతమేధావులవల్ల కూడా కాలేదు మరి.

ఇప్పటికే క్రిష్ణా పూర్తిగా తెలంగాణాకు కాకుండా పోయింది. మిగిలిన గోదావరిని కూడా తెలంగాణాకు కాకుండా చెయ్యడం అనే తమ ప్రణాలికను ఒకవైపు చెబుతూనే మరోవైపు తెలంగాణాపై వివక్షలేదని చెప్పడం వీరి వాదన. మీ ప్రాంతంలో నీల్లివ్వడం కష్టం, మీకు వ్యవసాయం లాభదాయకం కాదు, రైతులందరూ వ్యవసాయం వదిలేసి మీ భూములను సెజ్జులకిచ్చేయండి, ఆతరువాత ఆసెజ్జులు కట్టేప్పుడు రోజుకూలీలుగా పనిచేసి పొట్టపోసుకోండి, కడుపు నిండకపోతే ముంబైకో దుబాయికో వలస పోండి, కానీ మీకు ఎవరైనా వచ్చి ఇక్కడి సాగునీటి వాడకంలో మోసం జరిగిందంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఇదీ వీరి వాదన.

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు: తెలంగాణాపై ఎప్పుడు వివక్ష ఊసొచ్చినా సమైక్యవాదులు ఇచ్చే ఏకైక ఉదాహరణ శ్రీరాంసాగర్. చూశారా శ్రీరాంసాగర్ మీనిజాం కట్టించలేదు, సమైక్య ప్రభుత్వమే కట్టించింది. ఎంతసేపూ అందులో పూర్తిగాని స్టేజీలనే ఎందుకు మాట్లాడుతారు? పూర్తయిన చిన్నముక్కను చూసి సంతోషించొచ్చు కదా?

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సమైక్య ప్రభుత్వం తెలంగాణాపై ప్రేమతోనో, తమ భాద్యత గుర్తొచ్చో ఇవ్వలేదు. ఇక్కడి ప్రజలు 69లో రాష్ట్రం కొరకు ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసినతరువాత ఏదో ఒకటి చెయ్యకపోతే ఎక్కువకాలం ఏమార్చలేమని ఈప్రాజెక్టును మొదలుపెట్టారు. గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ఉన్న ప్రాంతం అత్యంత ఎత్తుపై ఉన్న ప్రాంతం, ఆప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కరీమ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలన్నింటికీ ఇచ్చే ప్రణాలికతో మొదలయిన ప్రాజెక్టు. పూర్తయితే ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సిన ప్రాజెక్టు అన్ని క్లియరెన్సులూ వచ్చిన తరువాత నలభై ఏల్లు గడచిన తరువాత కూడా ఇంకా ఐదు లక్షల ఎకరాలకు కూడా ఇవ్వలేకపోతుంది. నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలు ఎప్పటికైనా తమకు పోచంపాడు(శ్రీరాంసాగర్) నీల్లొస్తాయని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.

మన దేశంలో ప్రాజెక్టులన్ని ఇలాగే లేటవుతాయి అందులో పెద్ద వివక్ష ఏమీ లేదు అని తేల్చే వారు ఒక్క సారి మన రాష్ట్రంలోని నాగార్జునసాగర్, తెలుగు గంగ ప్రాజెక్టులు, ఇతర రాష్ట్రాలలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎన్ని రోజుల్లో అయ్యాయో గమనించాలి.

లిఫ్ట్ ఇరిగేషన్ పై అపోహలు: లిఫ్ట్ ఇరిగేషన్లో నదిపై అనువైన ప్రాంతంలో ఒక బ్యారేజీ కట్టి, స్టోరయిన నీళ్ళను ఒక ఎత్తయిన ప్రదేశంలో కట్టిన రిజర్వాయరుకు తరలిస్తారు. అక్కడినుంచి కాలువల ద్వారానో మరో విధంగానో ఆయకట్టుకు నీటిని తరలించొచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్‌పై వచ్చే విమర్శలు ఏమిటంటే దీనివలన విద్యుత్ ఖర్చవుతుంది, ఇది అదనపు భారం. గ్రావిటీ ద్వారా నయితే ఫ్రీగా నీటిని తరలించొచ్చు.

నిజమే నీటిని లిఫ్ట్ చెయ్యాలంటే విద్యుత్ కావాలి. ఐతే మన దేశంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. ఏదో అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మనం వ్యవసాయం లాభసాటి అయితేనే చెయ్యం, వ్యవసాయం ఇక్కడ ఎందరికో జీవన విధానం. కాలువల ద్వారా నీరు రాకపోతే ప్రతి రైతూ ఒక బావి తవ్వుకోవాలి, బావిలో నీల్లు సరిపోవు కనుక అందులో ఒక బోరు వేసుకోవాలి, రెండు మోటార్లు పెట్టి బోరునీటిని పొలానికి తరలించాలి. అంటే రైతు కాలువవ్యవసాయం కంటే అదనంగా బావికి, బోరుకు, మోటార్లకు, విద్యుత్తుకు ఖర్చు చెయ్యాలి. ఆ విద్యత్తుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ప్రపంచ బ్యాంకు ఏడుపులు. ప్రతి రైతూ తన బోరుకోసం విద్యౌత్‌పై చేసే ఖర్చూ, అందుకు ప్రభుత్వ సబ్సిడీ అన్నీ చూసుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్‌లో అయ్యే విద్యుత్ ఖర్చు చాలా తక్కువ. తీరా వచ్చే కరెంటు కనీసం ఆరుగంటలు కూడా ఉండదు, అది ఎప్పుడొస్తుందో తెలియక నిద్రాహారాలు మాని పొలం దగ్గర పడిగాపులు చెయ్యాలి. ఇంతఖర్చు చేసి చివరికి పొలం ఎండిపోతే రైతులు అప్పులభాధకు ఆత్మహత్యలు చేసుకోవాలి.

మరి ఒక ప్రాజెక్టుకింద వ్యవసాయం చేసేవారు ఏదో నామమాత్రంగా ఎకరాకు యాభై రూపాయలు ప్రభుత్వానికిస్తాడు. మరి ప్రాజెక్టు కట్టిన ఖర్చూ, కాలువలు తవ్విన ఖర్చూ, వాటి మెయింటెనన్సు ఖర్చులూ, ప్రాజెక్టు కట్టినప్పుడు నిర్వాసితులకు పునరావాస ఖర్చు ఇవన్నీ ఖర్చులు కావా? ఇవన్ని ఎవరి జేబులోనుంచి వెల్తున్నాయి? కాబట్టి రైతుకు నీటిని ఇవ్వడం అనేది ప్రభుత్వ భాద్యత, అందులో లాభనష్టాలు బేరీజు వేసుకుని ఎక్కడ కాలువ తావ్వడం తక్కువ ఖర్చుతో అవుతుందో అక్కడే తవ్వుతాం, ఎక్కడ ఖర్చెక్కువ అవుతుందో అక్కడ తవ్వం అని ఏప్రభుత్వమూ లెక్కలు కట్టదు, ఒక్క మన ప్రభుత్వం తప్ప. మన పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలో, మిగతా చాలా చోట్ల చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేసుకున్నారు, వారి వాటా నీటిని వాడుకున్నారు అంతే కానీ డెల్టా ప్రాంతం మాకు లేదు, డెల్టా అంతా కోస్తా ఆంధ్రలో ఉంది అక్కడయితే తేలిగ్గా నీటిని సరఫరా చెయ్యొచ్చు కాబట్టి ఈనీళ్ళను వారికే వదిలేద్దం అనుకోలేదు.మన రాష్ట్రంలోమాత్రం గడచిన యాభై ఏల్లలో శ్రీరాంసాగర్ నుంచి ధవలేశ్వరం మధ్యలో ఒక్క ప్రాజెక్టూ కట్టకపోవడానికి చూపించే సాకు గ్రావిటీ.

వాటర్ బేసిన్ ఉల్లంఘణలు: ఏ నదీ జలాలను ఆ నది బేసిన్‌లోనే వాడాలనేది ఇరిగేషన్‌లో ఒక ప్రాధమిక సూత్రం. మన రాష్ట్రం మాత్రం క్రిష్ణా జలాలను పూర్తిగా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమకు,నెల్లూరుకూ తరలించి కనీసం పది శాతం కూడా తెలంగాణకు ఇవ్వట్లేదు. ఈ ఉల్లంఘణవల్ల నష్టం తెలంగాణాకు మాత్రమే కాదు, క్రిష్ణా ట్రిబ్యునల్ వద్ద కర్నాటక మనరాష్ట్ర రివర్ బేసిన్ వియోలేషన్లను సాకుగా చూపించి తను ఎక్కువ నీటి వాటాను పొందుతుంది. ఈ వాటర్ బేసిన్ ఉల్లంగణలవల్ల క్రిష్ణా ట్రిబ్యునల్ తీర్పులో మనరాష్ట్రానికి (మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌కు, తెలంగాణకు మాత్రమే కాదు) జరిగిన నష్తం గురించి నేను గతంలో రాసిన టపా ఇక్కడ చూడొచ్చు.

మన ప్రభుత్వం మేం మిగులు జలాలను మాత్రమే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నామని కుంటి సాకులు చెబుతూ వచ్చింది, నికరజలాలను వాడకుండా మిగులు జలాలు ఎలావాడుతారో చెప్పలేకపోయి క్రిష్ణాలో వాటాను తగ్గించుకుంది. ఇప్పుడు గోదావరి విషయంలో కూడా తెలంగాణాలో గ్రావిటీ సాకు చూపించి గొడావరి నీటిని ఇతర బేసిన్లకు తరలించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మన జేపీగారి మేధావి వర్గం అప్రూవ్ చేస్తుంది.

పోలవరం: ఇక గోదావరి నీటిని తెలంగాణాలో వాడడానికి గ్రావిటీ బూచిని చూపిస్తున్నవారు పోలవరంపై మాత్రం గగ్గోలు పెడతారు. లక్షల మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసి, ఎంతో ప్రకృతి సంపదను, పాపికొండలనూ, వన్యమృగాలనూ ముంచేసే పోలవరంపై వీరికి అపార ప్రేమ. తెలంగాణాలో అన్ని క్లియరెన్సులూ వచ్చేసి దశాబ్దాలు పెండింగులో ఉన్న ప్రాజెక్టులను వదిలేసి ఎన్విరన్‌మెంట్ అనుమతి లేని పోలవరంపై మాత్రం ఉద్యమాలు చేస్తారు.పోలవరంపై ఆదివాసీల అభిప్రాయాలు ఈవీడియోలో చూడొచ్చు.



రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు ఏం లాభం?: ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలవడం వలన మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ఘర్ గోదవరిపై తమ హక్కును ఎలా కాపాడుకుంటున్నాయో అలాగే తెలంగాణ కూడా తమ గోదావరి జలాలపై తమహక్కును కాపాడుకుంటుంది. ఇది తెలుసుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్ అక్కరలేదు, మేధావులు కానక్కర్లేదు. ఎలా గ్రావిటీ సమస్యను అధిగమిస్తారు నీటిని ఎలా పంపు చేస్తారు అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. ఇక గోదావరిపై తెలంగాణకు అన్యాయం ఏమీ జరగలేదని మోసపు రాతలు రాసేవారు మీ రాతలను కట్తబెట్టి మీపని మీరు చూసుకోవచ్చు.